బాలీవుడ్‌పై మేనక సంచలన వ్యాఖ్యలు: దుమారం
ముంబై: కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలపై ఈవ్ టీజింగ్ కు బాలీవుడ్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. దీంతో దుమారం రేగింది. శుక్రవారం గోవా ఫెస్ట్‌కు హాజరైన ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు.
మహిళలపై నేరాల పెరుగుదలకు సినిమాలే కారణమన్నారు. దాదాపు ప్రతి సినిమాలోనూ ప్రేమ ఈవ్ టీజింగ్ తో మొదలుతుందని పేర్కొన్నారు. బాలీవుడ్ అయినా, ప్రాంతీయ భాషా చిత్రంలోనైనా దీనికి అతీతం కాదన్నారు. అమ్మాయి చుట్టూ కొంతమంది చేరి గుమిగూడి, అసభ్యంగా ప్రవర్తించడం, తాకడం, వేధించడం ఆ తర్వాత ప్రేమలో పడుతూ ఉండటం చూపిస్తున్నారని విమర్శించారు. తద్వారా మహిళలపై హింసకు, వేధింపులకు పాల్పడవచ్చనే భావన పురుషుల్లోపెరుగుతోందన్నారు. అలా కాకుండా మహిళల ప్రాత చిత్రణ గౌరవప్రదంగా ఉండేలా చూడాలని బాలీవుడ్‌ని కోరారు. చేతకానిపురుషులే మహిళలపై హింసకి దారితీస్తుందనీ, పనిలో వైఫ్యల్యంతో పురుషులు మహిళలపై అసహనం ప్రదర్శిస్తారని,అరుస్తారని పేర్కొన్నారు.
దీంతో బాలీవుడ్ తీవ్రంగా స్పందిస్తోంది. సినిమా పరిశ్రమ శక్తిని తక్కువగా చిత్రనిర్మాత అశోక్ పండిట్ చూడొద్దని కోరారు సినీ పరిశ్రమపై విమర్శలకు దిగడం ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించారు. శ్యాంబెనగల్ నుంచిమొందలు మాధుర భండార్కర్ దాకా చాలా అగ్రదర్శకులు విమెన్ ఓరియెంటెడ్ సినిమాలను తీశారని గుర్తుచేశారు.