goal Mall
-
టీడీపీ ప్రభుత్వ హయాంలో CMRF నిధుల గోల్మాల్
-
గోధుమ మర కాంట్రాక్ట్‌లో గోల్మాల్!
సాక్షి, విజయవాడ: రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ సరఫరా చేసే గోధుమలను మర ఆడి, గోధుమ పిండి (ఆటా)గా తయారుచేసి తిరిగి కార్పొరేషన్‌కు సరఫరా చేసే కాంట్రాక్ట్ కేటాయింపులో గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. చినబాబు సన్నిహితుడైన చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి రోలర్ ఫ్లోర్‌మిల్‌కు కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలను చివరి నిమిషంలో అధికారులు మార్చారు. కేవలం ఒక రోలర్ ఫ్లోర్‌మిల్‌కే కాంట్రాక్ట్ దక్కే విధంగా నిబంధనలు మార్చడంపై ఇతర కాంట్రాక్టర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాత నిబంధనలివే.. పౌరసరఫరాల సంస్థ ద్వారా ప్రతి నెలా 1839.970 మెట్రిక్ టన్నుల గోధుమలు తీసుకుని వాటిని ఆటాగా మార్చి తిరిగి ఒక కిలో ప్యాకెట్లుగా తయారుచేసి, వాటిని 50 కిలోల సంచుల్లో నింపి రాష్ట్రంలోని పౌరసరఫరాల గోదాములకు సరఫరా చేయడం కోసం ఈ– టెండర్లు పిలిచారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను ఒకటో జోన్‌గాను, చిత్తూరు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలను రెండో జోన్గానూ, కర్నూలు, అనంతపురం జిల్లాలను మూడో జోన్ కింద పెట్టారు. ఏ జోన్లో మిల్లర్లు ఆ జోన్లోనే టెండర్లు దాఖలు చేయాలి. టెండర్ల ప్రకారం రోజుకు 100 మెట్రిక్ టన్నుల గోధుమలు మరపట్టే సామర్థ్యం ఉండాలి. ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్ చేసి ఉండాలి. టెండర్‌ను సోమవారం (ఏప్రిల్ 23) సాయంత్రంలోగా దాఖలు చేయాలని, 24న టెండర్లు తెరిచి తక్కువ కొటేషన్ ఉన్నవారికి టెండర్లు ఇస్తామని పేర్కొన్నారు. అయితే సోమవారం సాయంత్రం టెండర్ నిబంధనలను మార్చుతూ కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం గత ఆర్థిక ఏడాదిలో 3వేల మెట్రిక్ టన్నుల ఆటాను ప్రభుత్వ సంస్థకు సరఫరా చేసి ఉండాలనే కొత్త నిబంధన విధించారు. కొత్త నిబంధనలకు అనుకూలంగా టెండర్‌ను ఈ నెల 26 వరకు దాఖలు చేయొచ్చని, 27న టెండర్లు వేలం నిర్వహిస్తామని ప్రకటించారు. చినబాబు సన్నిహితుడికి కట్టబెట్టేందుకే.. చినబాబు సహకారంతో చిత్తూరులోని జయరామ్ చౌదరికి చెందిన సుద్దలగుంట ఫ్లోర్‌మిల్ గతేడాది ఆటా సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రన్న కానుకతో సహా నెలవారీ ఇచ్చే ఆటా టెండర్లూ ఆ మిల్కే దక్కాయి. కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది కూడా అదే మిల్కు టెండర్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ టెండర్ విలువ రూ.35 కోట్ల వరకు ఉంటుందని, కనీసం 2 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం రాయలసీమనే కాకుండా రాష్ట్రమంతా ఈ మిల్కే వచ్చినా ఆశ్చర్యం లేదని కాంట్రాక్టర్లు అంటున్నారు. కాగా సుద్దలగుంట ఫ్లోర్‌మిల్‌పై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ మిల్ సరఫరా చేసే గోధుమపిండిలో నాణ్యత లేదనే విమర్శలున్నాయి. -
చక్కెర కావాలా నాయనా!
బుచ్చిరెడ్డిపాళెం : కర్మాగార అధికారుల నిర్లక్ష్యం, జిల్లా అధికారుల పర్యవేక్షణ లేమితో కోవూరు చక్కెర కర్మాగారంలో చక్కెర అమ్మకాల్లో గోల్మాల్ జరిగింది. కలెక్టర్, జేసీ సమక్షంలో జరగాల్సిన అమ్మకాలు కర్మాగారం అధికారులే జరిపారు. నగదును డీడీల రూపంలో తీసుకోకుండా చెక్ తీసుకున్నారు. తీరా చెక్ బౌన్స్ కావడంతో జాగ్రత్తపడేందుకు మరో ఆలోచన చేశారు. విషయాన్ని గోప్యంగా ఉంచి జిల్లా అధికారుల వద్దకు అమ్మకాల వ్యవహారాన్ని తీసుకెళ్లారు. రెండు సీజన్ల నిల్వ చక్కెరకు మళ్లీ తాజాగా సోమవారం టెండర్లు పిలిచారు. వివరాల్లోకి వెళితే.... కోవూరు చక్కెర కర్మాగారం పరిధిలో 2012-13 సంవత్సరానికి 2,428 హెక్టార్లలో చెరకును సాగుచేశారు. అందుకు సంబంధించి 1.73 లక్షల మెట్రిక్ టన్నులకు కర్మాగారం అగ్రిమెంట్ జరిగింది. అయితే కర్మాగారంలో ఎక్కువసార్లు బ్రేక్‌డౌన్ జరగ డంతో కేవలం 89,356 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ జరిగింది. దీంతో అగ్రిమెంట్ జరిగిన మిగతా 84వేల మెట్రిక్ టన్నుల చెరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా చక్కెర కర్మాగారాలకు తరలింది. ఇదిలా ఉంటే అగ్రిమెంట్ కాని చెరకు 55 వేల మెట్రిక్ టన్నుల చెరకు కర్మాగారం పరిధిలో ఉంది. దానిని కూడా మహబూబ్‌నగర్, ఖమ్మం, కృష్ణా, చిత్తూరు జిల్లాలోని చక్కెర కర్మాగారాలకు రైతులు తరలించారు. అయితే కోవూరు చక్కెర కర్మాగారంలో క్రషింగ్ జరిగిన 89,356 మెట్రిక్ టన్నుల చెరకుకు 63,515 క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. కలెక్టర్ జోక్యంతో ఇందులో 59,519 క్వింటాళ్ల చక్కెర అమ్మకాలు జరిగాయి. 3,996 క్వింటాళ్ల చక్కెర మిగిలిపోయింది. అలాగే 2011-12 గాను కర్మాగారంలో 1,06,406 మెట్రిక్ టన్నుల చెరకు క్రషింగ్ కాగా 80వేల క్వింటాళ్ల చక్కెర ఉత్పత్తి జరిగింది. అందులో అమ్మకాలు పోగా 248 క్వింటాళ్ల చక్కెర మిగిలింది. దీంతో రెండు సీజన్లకు గాను 4,244 క్వింటాళ్ల చక్కెర నిల్వ ఉన్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. అధికారుల నిర్లక్ష్యం ఇలా.. సహాయ చక్కెర కమిషనర్ సత్యనారాయణ హయాంలో 4,244 క్వింటాళ్లకు సంబంధించి అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరిగాయి. అవి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు సంబంధం లేకుండా జరిగినట్లు సమాచారం. అయితే చక్కెరను కొనేందుకు వచ్చిన ముగ్గురు కొనుగోలుదారుల్లో ఇద్దరు డీడీలు తీసుకురాగా, మరో వ్యక్తి చెక్‌బుక్‌తో వచ్చాడు. అయితే డీడీలు తెచ్చిన వ్యక్తులు కిలో రూ.18.19 లెక్కన చక్కెర కొనుగోలుకు రాగా, మరో వ్యక్తి దాదాపు రూ.25 వరకు కొనేందుకు సిద్ధమయ్యారని సమాచారం. దీంతో ఆ వ్యక్తికే చక్కెరను అధికారులు అమ్మారు. ఆ సమయంలో అతను కేవలం చెక్‌ను మాత్రమే అధికారులకు ఇచ్చాడు. అయితే అతను కొన్న రెండు రోజులకే మార్కెట్లో ధర అమాంతంగా పడిపోవడంతో చ క్కెరను తరలించేందుకు ముందుకు రాలేదు. ఇదే సమయంలో కొన్న వ్యక్తి ఇచ్చిన చెక్‌ను బ్యాంకులో జమచేయగా అది కాస్తా బౌన్స్ అయ్యింది. కొన్నవ్యక్తి ఎవరో తెలియక, కోర్టులో కేసు వేయలేక అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాజాగా జాయింట్ కలెక్టర్ సమక్షంలో మళ్లీ నిల్వ ఉన్న 4,244 క్వింటాళ్ల చక్కెరకు టెండర్లు పిలిచారు. వీటిలో మంచి చక్కెర 767 క్వింటాళ్లు ఉండగా తడిసిన చక్కెర 3,767 క్వింటాళ్లు ఉంది. వీటిలో సోమవారం సాయంత్రం 3,767 క్వింటాళ్లకు కిలో రూ.16.10 లెక్కన టెండరు ఖరారైంది. దీనిపై బుధవారం జాయింట్ కలెక్టర్ ఆమోదం లభించింది. అయితే మిగిలిన మంచి చక్కెర 767 బస్తాలకు జనవరి 20న పర్చేసింగ్ కమిటీ సభ్యులు, జేసీ కూర్చుని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వేబిల్లు పరిస్థితి ఏమిటో..? ఇప్పుడు చక్కెరను తరలించేందుకు వే బిల్లులు తప్పనిసరిగా మారాయి. వేబిల్లుల ప్రక్రియ కర్మాగారం అధికారులు చేస్తారా, కొనుగోలుదారుడు తెచ్చుకుంటాడా అన్న అంశం సంశయంగా మారింది. దీంతో చక్కెర తరలింపులో జాప్యం నెలకొంది. ఇప్పటికైనా కోవూరు చక్కెర కర్మాగారంలో అవకతవలపై జరుగుతున్న గోల్‌మాల్‌పై కలెక్టర్ జానకి, జాయింట్ కలెక్టర్ రేఖారాణి దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రేషన్ ‘గోల్’మాల్
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ :పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం కిలో రూపాయికి పంపిణీ చేస్తుండగా, కొందరు డీలర్లు అక్రమార్గం ఎంచుకుంటున్నారు. వ్యాపారులకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా కాగజ్‌నగర్ పట్టణంలోని గోల్ బజార్లో విచ్చలవిడిగా సాగుతోంది. సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, దహెగాంతోపాటు కాగజ్‌నగర్ మండలాల నుంచి రోజూ వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం గోల్ బజార్‌కు చేరుతున్నాయి. కొంతమంది రేషన్ డీలర్లు, స్మగ్లర్లు, దళారులు ఆయా గ్రామాల నుంచి నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు గతంలో బియ్యం మాఫీయాపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్థానిక తహశీల్దార్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గోల్ బజార్లో దాడులు నిర్వహించి రూ.లక్షల విలువ చేసే సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనపర్చుకోవడమే కాకుండా, ఇరువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అనంతరం అధికారులు ‘మాములు’గా తీసుకున్నారు. రేషన్ బియ్యంతోపాటు పామాయిల్ వ్యాపారం కూడా మొదలైంది. సిర్పూర్ నియోజకవర్గంలో గల కాగజ్‌నగర్ మండల లెవల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్), సిర్పూర్ మండల లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి కూడా అధికారుల ప్రోద్బలంతో చౌక ధరల సరుకులను ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్రకు బియ్యంతోపాటు పామాయిల్ రవాణా గోల్ బజార్లో రోజూ రేషన్ డీలర్లు వందల క్వింటాళ్ల బియ్యాన్ని రూ.5 చొప్పున వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వ్యాపారులు ఈ బియ్యానికి పాలిష్ చేసి కిలో. రూ.15 చొప్పున సరిహద్దులు దాటిస్తున్నారు. ఆసిఫాబాద్, బెజ్జూర్ మండలాల గుండా మహారాష్ర్టకు తరలిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కాగా, రేషన్ బియ్యంతోపాటు పామాయిల్‌ను ఇతరత్రా ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోల్ బజార్లో ఏ సమయానికి వెళ్లినా అక్కడ ఒక ప్రభుత్వ గోదాం తరహాలో లోడింగ్ అన్లోడింగ్ వ్యవహారం దర్శనమిస్తోంది. ఒక వ్యాపారి కనుసన్నళ్లలో ఈ వ్యవహారం జరుగుతోంది. సదరు వ్యాపారి రైల్వేమార్గం ద్వారా ఇక్కడి నుంచి బియ్యాన్ని మహారాష్ర్టలోని విరూర్, మానిక్గఢ్, బల్లార్షా, చంద్రాపూర్ ప్రాంతాలకు తరలిస్తున్నాడు. రూటు మార్చిన వ్యాపారులు రైళ్ల ద్వారా బియ్యం అక్రమంగా రవాణా చేస్తుండటం వల్ల అందరికీ తెలిసిపోతుండటంతో అధికారులు దాడులు నిర్వహించక తప్పడం లేదు. దీంతో అప్రమత్తమైన సదరు వ్యాపారులు ప్రస్తుతం ప్రైవేట్ ట్రాలీలు, వ్యాన్లను ఏర్పాటు చేసుకొని, నేరుగా రోడ్డు మార్గంలో బియ్యాన్ని మహారాష్ర్టకు తరలిస్తున్నారు. రెవెన్యూ శాఖాధికారులు గోల్ బజార్లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తే, మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు. అక్రమ బియ్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.