godawari puskaralu
-
పుష్కర శోభ
పుష్కర స్నానం పరమ పవిత్రం.. సర్వపాప హరణం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే భక్తులు పుష్కరాల వేళ నదిలో పవిత్ర స్నానమాచరించేం దుకు ఆసక్తి చూపుతారు. వచ్చే ఏడాది జూలై నెలలో గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఇందుకోసం గోదారి తీరంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుం డా ఉండేందుకు సకల ఏర్పాట్లు చేస్తోంది. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పవిత్ర గోదావరి పుష్కరాలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఇప్పటికే జిల్లా నుంచి రూ.66 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏ ర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిం చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వినోద్ కెఅగర్వాల్ సోమవారం జిల్లా ఉన్న తాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్‌గా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, హరీష్‌రావు, కేటీఆర్ సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉప సంఘం పుష్క రాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. 18 పుష్కర ఘాట్ల ఏర్పాటు గోదావరి పుష్కరాల కోసం గతంలో జిల్లాలో ఐదు ఘాట్లనే ఏర్పాటు చేశారు. ఈసారి కొత్త గా మరో 13 ఘాట్లు ఏర్పాటు చేయనున్నా రు. ఇందుకోసం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డి విజన్ల పరిధిలోనే పుష్కరఘాట్లను ఏర్పాటు చేసేందుకు పనులను కూడా ప్రారంభించారు. మోర్తాడ్ మండలం తడ్‌పాకల, దోంచంద, గుమ్మిర్యాల, బా ల్కొండ మండలం సావెల్, నందిపేట మండ లం ఉమ్మెడలో గతంలో పుష్కరాలు నిర్వహించారు. ఆర్మూరు మండలం కో మన్పల్లి, నందిపేట మండలం వన్నెల్ (కె), చిన్నయానం, రెంజల్ మండలం కందకుర్తి, తాడ్‌బిలోలి, బోర్గాం నవీపే ట మండలం కోస్లి, బినోల, తుంగిని, యంచ, నాలేశ్వర్ తదితర ప్రాంతాలలో ను భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణ ప నులు పారదర్శకంగా జరిగేలా చూడాల ని చీఫ్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటీకే సీ ఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లతో హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుష్కరఘాట్ల ఏర్పాటుపై కలెక్టర్‌తో సమీక్షిం చారు. 20 రోజుల వ్యవధిలో చీఫ్ సెక్రెటరీ, సాంస్కృతిక సలహాదారు మూడు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదు ప్రాంతాలకే పరిమితమైన పుష్కర వేడుకలను 11 ప్రాంతాలు, 18 పుష్కరఘాట్లకు విస్తరించారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లా ఉన్నతాధికారులతోపాటు నీటిపారుదల, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో సమావేశమై పుష్కర ఘాట్లలో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనపై సమీక్ష జరిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప ని చేస్తున్న అధికారులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరఘాట్ల మరమ్మతులు, నిర్మాణం, రోడ్డు, రవాణా సౌకర్యం, తాగునీటి వసతి, భక్తులు దుస్తులు మా ర్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి సా రించారు. వైద్య శిబిరాలు, పారిశుధ్య పనులు, పార్కింగ్ స్థలాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర పనుల కోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీలు వేసే విషయమై కూడా చర్చిం చారు. పుష్కరాల సమయంలో ప్రభు త్వ అతిధి గృహాలన్నీ కలెక్టర్ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాలు అధికారులకు కత్తిమీద సాములా మారాయి. ఏర్పాట్లన్నీ సజావుగా సాగేలా వారు చర్యలు తీసుఉంటున్నారు. -
‘పుష్కర’ రహదారులకు రూ.110 కోట్లు..
వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఖమ్మం జెడ్పీసెంటర్: గోదావరి పురష్కరాల నేపథ్యంలో భద్రాచలం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి కోరారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై కలెక్టర్లతో రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ బి.వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 14న ప్రారంభం కానున్న పుష్కరాలకు భద్రాచలానికి కోటి మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ప్రతి ఏడాది భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోందని, అక్కడికి చేరుకునే వంతెన ఇవతల వైపు రద్దీని అదుపు చేసేందుకు బూర్గంపాడు-ఏటూరునాగారం మార్గాన్ని నాలుగు వరుసలుగా వెడల్పు చేయాల్సి ఉందని అన్నారు. అదనంగా స్నానపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. గత పుష్కరాలోల ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాకపోకలకు వేర్వురుగా రహదారుల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్లు వివరించారు. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు రూ.110 కోట్లలో రూ. 65 కోట్లు ఆర్అండ్బీ, రూ.45 కోట్లు పంచాయతీరాజ్ రహదారులకు ఖర్చు అవుతాయన్నారు. భద్రాచలం పినపాక నియోజకవర్గాల పరిధిలో 14 స్నానపు ఘట్టాలు నిర్మాణానికి రూ.34 కోట్లు ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పుష్కరాల పనుల పర్యవేక్షణకు ఒక ప్రత్యేకాధికారిని నియిమించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఆర్అండ్బీ ఎస్ఈ సతీష్, దేవాదాయ ఏసీ రాజేంధర్ తదితరులు పాల్గొన్నారు. -
అంచనాలు కుదించండి
సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన రూ.131 కోట్ల మేరకే ప్రతిపాదనలను పరి మితం చేసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆ దేశించారు. ఏ శాఖ ఎంత మొత్తానికి పనుల అంచనాలు తయారు చేయాలన్న దానిపై ఈ నెల 18న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనూరాధ ఇచ్చిన నిర్దేశాన్ని దాటరాదని స్ప ష్టం చేశారు. ఎక్కడా అనుబంధ పనులకు తావులేదని, కేవలం పుష్కరాలకు సంబంధించిన సన్నాహాలు, భక్తులకు అవసరమైన వసతులకే ప్రతిపాదనలు పరిమితం కావాలని కచ్చితంగా చెప్పారు. పుష్కర పనుల అంచనాలపై తుది నివేదికలు తీసుకునేందుకు కలెక్టర్ శుక్రవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో రూ.142 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చిన ఆర్అండ్బీ శాఖ ఇప్పుడు రూ.70 కోట్ల కు కుదించింది. ప్రతిపాదించిన పనులను ఆ శాఖ ఎస్ఈ సీఎస్ఎన్మూర్తి వివరించారు. పుష్కరాల్లో కీలకమైన రాజమండ్రి- కొవ్వూరు రోడ్‌కం రైలు వంతెన మరమ్మతులకు రైల్వే శాఖ సహకరించడం లేదనడంతో సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యుత్తు శాఖ అధికారులు తమ శాఖ నిధులతో చేపట్టే రూ.30 కోట్లు వ్యయమయ్యే పనుల ప్రతిపాదనలిచ్చారు. రాజమండ్రిలో ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రూ.59 కోట్లు అవసరమన్న దేవాదాయ శాఖ రాజమండ్రి సహా జిల్లాలోని వివిధ ఆలయాల మరమ్మతులు, భక్తులకు వసతులు, పుష్కర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ రూ.59.24 కోట్ల తో ప్రతిపాదనలు అందిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎస్ఈ ఆర్.జి.కృష్ణారెడ్డి రూ.30 కోట్లకు అంచనాలు సమర్పించారు. జిల్లాలోని 137 స్నానఘట్టాల్లో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని 13 పోను మిగిలిన చోట్ల బారికేడ్లు, ఇతర ఏర్పాట్లకు రూ.ఆరు కోట్లకు ప్రతిపాదనలు ఇస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి ఎల్.శ్రీధర్‌రెడ్డి చెప్పారు. బారికేడింగ్ పనులు ఇరిగేషన్ శాఖ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీరాజ్ శా ఖ పుష్కరాలు జరిగే గ్రామాల్లో రహదారుల అ భివృద్ధి, ఇతర పనులకు రూ.13.63 కోట్ల ప్రతి పాదనలివ్వగా రూ.6 కోట్లకు కుదించాలని కలెక్టర్ సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ రూ.కోటి, ఆర్టీసీ రూ.70 లక్షలు, రవాణా శాఖ రూ.5 ల క్షలు, ట్రాఫిక్ పోలీస్ విభాగం రూ.8 లక్షలు వ్య యమయ్యే ప్రతిపాదనలు ఇచ్చాయి. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ముత్యాల రాజు, సబ్ కలెక్టర్ విజయరామరాజు పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులు పుష్కరాలకే .. ఈ ఏడాది, వచ్చే ఏడాది జిల్లాలో వివిధ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా వెచ్చించే (సీఎస్ఆర్) సుమారు రూ.25 కోట్లను పుష్కరాల పనులకే వెచ్చిస్తామని కలెక్టర్ విలేకరులకు తెలిపారు. కొన్ని శాఖలకు అవసరం అనుకుంటే మరో రూ.కోటి లేదా రెండు కోట్ల వరకూ అదనపు నిధులు రప్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులు మిగిలిపోతే రెండో దశ అంచనాల్లో పరిశీలిస్తామన్నారు. రంపచోడవరం డివిజన్లో విలీనం అయిన నాలుగు ఖమ్మం జిల్లా మండలాల్లోని ఐదు ఘాట్ల అభివృద్ధి పనులను కూడా సంబంధిత శాఖలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
అంతంతమాత్రమే
పుష్కరాలు వస్తున్నాయంటే ఇక్కడి ప్రజలు ఎంతో సంబరపడిపోతారు. గుళ్లూ గోపురాల్లో పండగ సందడి నెలకొంటుందని, ఎక్కడెక్కడో నివసిస్తున్న చుట్టాలొస్తారనేది ఒకటైతే, ఊరు కొంతైనా బాగుపడుతుందనేది మరో ప్రధాన కారణం. ప్రజాప్రతినిధులు ఏర్పాట్ల గురించి ఎంత గొప్పగా చెబుతున్నా ఈసారి పుష్కరాలను ‘మరమ్మతుల’ స్థాయిలోనే కానిచ్చేద్దామని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తుండడం ప్రజల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టుగా ఉంది. సాక్షి, రాజమండ్రి : వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలపై పాలకులు చేసిన, చేస్తున్న వ్యాఖ్యలివి. ఈ హడావిడి చూసి జిల్లా జనం ఔరా అనుకున్నారు. ఈ పుష్కరాలు రాజమండ్రి చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతాయనుకున్నారు. ప్రభుత్వ చేతలు చూస్తే మాత్రం అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. కుంభమేళా అంటే పుష్కరాల కన్నా చవకగా జరిగి పోతాయనుకున్నారేమో అని జనం పెదవి విరుస్తున్నారు. కేవలం సదుపాయాలే.. పుష్కరాల పేరు చెప్పి రాజమండ్రికి శాశ్వత ప్రయోజనం చేకూరుతుందని ప్రజలు ఆశ పడ్డారు. రోడ్లు మెరుగుపడతాయని సంబరపడ్డారు. కానీ ఎక్కడా, ఏ విధమైన కొత్త నిర్మాణాలకు తావు లేదంటూ అధికారులకు కలెక్టర్ సంకేతాలిచ్చారు. రోడ్లు కూడా కేవలం మరమ్మతులతో సరిపుచ్చాలని కలెక్టర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. కొత్త ఘాట్ల నిర్మాణాల కన్నా, పాతవాటిని అభివృద్ధి చేసేందుకే ప్రాధాన్యమివ్వాలని సూచించినట్టు సమాచారం. తొలుత భారీ నిర్మాణాలను చేపట్టకుండా, పుష్కరాల సమయంలో భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లపైనే వివిధ శాఖల అధికారులు దృష్టి పెట్టాలన్నదే కలెక్టర్ సూచనల సారాంశం. వీవీఐపీ ఘాట్ అనుమానమే.. ప్రధానితో పుష్కరాలు ప్రారంభింపజేస్తామని మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వీవీఐపీ ఘాట్ నిర్మించాల్సి ఉందని అధికారులు భావించారు. ఇందుకు ఇరిగేషన్ అధికారులు కూడా సుమారు రూ.77 కోట్లతో ఘాట్ల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణాలకు ప్రతిపాదించారు. రూ.30 కోట్లతో గట్టు రోడ్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు చేశారు. తొమ్మిది కొత్త ఘాట్లు కూడా అవసరమన్నది వారి అంచనా. వీవీఐపీ ఘాట్ కోసం ముందుగా కాతేరు శివారులో గోదావరి గట్టున స్థల పరిశీలన చేసిన అధికారులు, చివరకు ధవళేశ్వరంలో ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ సమీపంలో నిర్మించాలని నిర్ణయించారు. రెండు రోజుల క్రితం రాజమండ్రి వచ్చిన కలెక్టర్ కొత్త ఘాట్ల నిర్మాణం కన్నా, అందుబాటులో ఉన్న వాటినే అభివృద్ధి చేసుకోవడం మేలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. దీంతో ఈ సారి కూడా గౌతమ ఘాట్నే వీవీఐపీ ఘాట్‌గా వినియోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగరాభివృద్ధిపై ‘అనుమాన’ నీడలు ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్న రాజ మండ్రిలో ‘పుష్కరాల’ అభివృద్ధి వెల్లివిరుస్తుందని ప్రజలు భావించగా, ఈ వంకతో భారీగా పనులు ఉంటాయని కార్పొరేటర్లు ఆశపడ్డారు. ఇప్పుడు పుష్కర పనుల్లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు నిమిత్తమాత్రులు కాగా, మంత్రుల కమిటీ పర్యవేక్షణలో సూక్ష్మంలో మోక్షాన్ని ప్రసాదించే మార్గాలు అన్వేషిస్తున్నారు. రూ.100 కోట్ల టోకెన్ గ్రాంటులోనే పనులు చేయాలని యోచిస్తున్నారు. రాజమండ్రి గౌతమ ఘాట్ సమీపంలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో పుష్కరాలకు గుర్తుగా రూ.4 కోట్లతో ఓ కన్వెన్షన్ సెంటర్ నిర్మిస్తామని గతంలో ఆర్థిక మంత్రి, ఇటీవల కలెక్టర్ వెల్లడించారు.