పుష్కర స్నానం పరమ పవిత్రం.. సర్వపాప హరణం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే భక్తులు పుష్కరాల వేళ నదిలో పవిత్ర స్నానమాచరించేం దుకు ఆసక్తి చూపుతారు. వచ్చే ఏడాది జూలై నెలలో గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఇందుకోసం గోదారి తీరంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుం డా ఉండేందుకు సకల ఏర్పాట్లు చేస్తోంది. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పవిత్ర గోదావరి పుష్కరాలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఇప్పటికే జిల్లా నుంచి రూ.66 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏ ర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిం చింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వినోద్ కెఅగర్వాల్ సోమవారం జిల్లా ఉన్న తాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్‌గా మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, హరీష్‌రావు, కేటీఆర్ సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉప సంఘం పుష్క రాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని వెల్లడించింది.
18 పుష్కర ఘాట్ల ఏర్పాటు
గోదావరి పుష్కరాల కోసం గతంలో జిల్లాలో ఐదు ఘాట్లనే ఏర్పాటు చేశారు. ఈసారి కొత్త గా మరో 13 ఘాట్లు ఏర్పాటు చేయనున్నా రు. ఇందుకోసం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డి విజన్ల పరిధిలోనే పుష్కరఘాట్లను ఏర్పాటు చేసేందుకు పనులను కూడా ప్రారంభించారు. మోర్తాడ్ మండలం తడ్‌పాకల, దోంచంద, గుమ్మిర్యాల, బా ల్కొండ మండలం సావెల్, నందిపేట మండ లం ఉమ్మెడలో గతంలో పుష్కరాలు నిర్వహించారు.
ఆర్మూరు మండలం కో మన్‌పల్లి, నందిపేట మండలం వన్నెల్ (కె), చిన్నయానం, రెంజల్ మండలం కందకుర్తి, తాడ్‌బిలోలి, బోర్గాం నవీపే ట మండలం కోస్లి, బినోల, తుంగిని, యంచ, నాలేశ్వర్ తదితర ప్రాంతాలలో ను భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణ ప నులు పారదర్శకంగా జరిగేలా చూడాల ని చీఫ్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు.
మౌలిక వసతుల కల్పనపై దృష్టి
వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటీకే సీ ఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్‌లతో హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుష్కరఘాట్ల ఏర్పాటుపై కలెక్టర్‌తో సమీక్షిం చారు. 20 రోజుల వ్యవధిలో చీఫ్ సెక్రెటరీ, సాంస్కృతిక సలహాదారు మూడు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదు ప్రాంతాలకే పరిమితమైన పుష్కర వేడుకలను 11 ప్రాంతాలు, 18 పుష్కరఘాట్లకు విస్తరించారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లా ఉన్నతాధికారులతోపాటు నీటిపారుదల, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో సమావేశమై పుష్కర ఘాట్లలో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనపై సమీక్ష జరిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప ని చేస్తున్న అధికారులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు.
పుష్కరఘాట్ల మరమ్మతులు, నిర్మాణం, రోడ్డు, రవాణా సౌకర్యం, తాగునీటి వసతి, భక్తులు దుస్తులు మా ర్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి సా రించారు. వైద్య శిబిరాలు, పారిశుధ్య పనులు, పార్కింగ్ స్థలాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర పనుల కోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీలు వేసే విషయమై కూడా చర్చిం చారు. పుష్కరాల సమయంలో ప్రభు త్వ అతిధి గృహాలన్నీ కలెక్టర్ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాలు అధికారులకు కత్తిమీద సాములా మారాయి. ఏర్పాట్లన్నీ సజావుగా సాగేలా వారు చర్యలు తీసుఉంటున్నారు.
పుష్కర శోభ
Published Tue, Dec 23 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement
Advertisement