godawari river
-
దినదిన గండం
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత గ్రామాలతో పాటు గోదావరి నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా గోదావరి నదిలో పలుచోట్ల అడ్డుకట్టలు వేయడమే ఇందుకు కారణం. ఈ ఏడాది వరదొస్తే తమ పరిస్థితి ఏంటని 19 నిర్వాసిత గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటిమట్టం పెరిగిందని, స్టోరేజ్ ఉందని నిర్వాసితులు చెబుతున్నారు. ప్రహసనం.. పునరావాసం : 2019 జూన్ నాటికి కాఫర్‌డ్యామ్ నిర్మించి గ్రా విటీ ద్వారా నీటిని విడుదల చేస్తామని, నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కాఫర్‌డ్యామ్ నిర్మాణ పనులు పూర్తికాలే దు. అలాగే స్పిల్‌వే పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. పోలవరం మండలంలో రెండో విడత 19 గ్రామాల్లో 3,300 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. వీరికి ఇప్పటివరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు కాలేదు. పునరావాస గ్రామాల్లో నిర్వాసితులకు గృహనిర్మాణాలు పూర్తి కాలేదు. పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, గోపాలపురం మండలాల్లో గృహనిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. జూన్ నాటికి గృహనిర్మాణాలు పూర్తిచేసి నిర్వాసితులను తరలించకపోవడంతో పాత గ్రామాల్లోనే నిర్వాసితులు ఉంటున్నారు. వరదలు వస్తే ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గం వరద ముంపునకు గురవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి పోలవరం రావాలంటే తా మంతా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఉంటాయని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. మార్గాలున్నాయి వరదలు వచ్చినా కాఫర్‌డ్యామ్ పైనుంచి దిగువకు యథావిధిగా వరదనీరు వెళుతుందని, మరోవైపు స్పిల్‌వే మీదుగా కూడా వరదనీరు వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేస్తామని, ఎప్పటికప్పుడు నీరు దిగువకు వెళ్లిపోవడం వల్ల పెద్దగా ముంపు ఉండే అవకాశాలు తక్కువ అని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. రాకపోకలకూ ఇబ్బందే.. వరదలు వస్తే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కాఫర్‌డ్యామ్ నిర్మాణం వల్ల ఎగువన ఉన్న చీడూరు గ్రామం ముంపునకు గురయ్యే పరిస్థితి ఉంది. మా ఊరికి చెందిన నిర్వాసితులకు పునరావాసంలో భాగంగా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదు. వరదలు వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి. రోడ్డు మార్గం పూర్తిగా వరద ముంపునకు గురవుతుంది. రాకపోకలు సాగే పరిస్థితి ఉండదు. దీంతో ఇబ్బందులు తప్పవు. – మామిడి సురేష్‌రెడ్డి, చీడూరు గోదావరి నీటి మట్టం పెరిగింది జూన్ నాటికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదు. గోదావరికి వరదల సమయం వచ్చేసింది. వరదలు వస్తే మా గ్రామాలు ముంపునకు గురవుతాయనే భయం వెంటాడుతోంది. మా గ్రామాలకు రోడ్డు మార్గాలు కూడా ఉండవు. ఇప్పటికే గోదావరి నీటిమట్టం కూడా పెరిగింది. – ఇండెల రామ్‌గోపాల్‌రెడ్డి, కొరుటూరు -
తెలంగాణ: ఉప్పొంగిన ముసలమ్మ వాగు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. గోదావరి నదికి వరద ఉధృతి భారీగా పెరగడంతో భద్రాచలం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 43.4 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోదావరి నది ఉధృతి నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు సబ్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ (08743-232444) ఏర్పాటు చేశారు. ఉప్పొంగిన ముసలమ్మ వాగు భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలంలో వాగుకు గండి పడి సర్వాయి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అత్యవసర సేవల కోసం పోలీస్ శాఖ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. మంగపేట మండలం కమలాపురం రమణక్కపేట వద్ద ముసలమ్మ వాగు ఉప్పొంగి ప్రధాన రహదారి ధ్వంసమైంది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు పెట్టారు. ఏటూరునాగారం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్ళల్లోకి చేరిన వర్షపు నీరు. డ్రైనేజీ లోపమేనని అంటున్న గ్రామస్థులు. రహదారులు పూర్తిగా ధ్వంసమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోనూ.. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద కల్లూరు వాగు ప్రదాన రహారి బ్రిడ్జిని ఆనుకుని నీరు ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఓపెన్ కాస్ట్‌లపై ప్రభావం చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ లోని ఓపెన్ కాస్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నాలుగు ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రోజుకి 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై భారీ యంత్రాలను పైకి తీసుకువచ్చారు. ఇక, సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, చెరువులు, కుంటలు నిండిపోయాయి.వర్షపు నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరడంతో ఒక్క కోదాడ పట్టణంలోనే 100 ఇళ్లు నీటమునిగాయి. ఎర్రకుంట చెరువు నిండటంతో ఆ నీరు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరడంతో ఇంట్లోని సామాన్లన్ని నీళ్లలో తడిసిపోయాయి. ప్రాజెక్టులవారీగా వరద ఉధృతి వివరాలు.. భద్రాద్రి: తాలిపేరు ప్రాజెక్ట్ 14 గేట్లు ఎత్తివేత ఇన్‌ఫ్లో 44 వేలు, ఔట్‌ఫ్లో 72వేల క్యూసెక్కులు తాలిపేరు ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం 72.30 మీటర్లు శ్రీపాదకు కొనసాగుతున్న వరద పెద్దపల్లి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఇన్‌ఫ్లో 16924 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 32,340 క్యూసెక్కులు పూర్తిస్థాయి 20.175 టీఎంసీలు, ప్రస్తుతం 18.925 టీఎంసీలు మంచిర్యాల: పొంగిపొర్లుతున్న సుద్దాల, గొర్లపల్లి వాగులు చెన్నూర్, వేమనపల్లి మండలాల్లో 35 గ్రామాలకు రాకపోకలు బంద్ సాగర్ ప్రాజెక్ట్ ఔట్‌ఫ్లో 7వేల క్యూసెక్కులు నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద ప్రాజెక్ట్ సామర్ధ్యం 590, ప్రస్తుత నీటిమట్టం 542.70 అడుగులు ఇన్‌ఫ్లో 2 లక్షల 8వేల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 7వేల క్యూసెక్కులు నల్లగొండ: మూసీ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం ఇన్‌ఫ్లో 950 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 60 క్యూసెక్కులు భూపాలపల్లి జిల్లాల్లో భూపాలపల్లి: మహదేవ్పూర్, పలిమెల, మల్హర్ మండలాల్లో భారీ వర్షం ఉధృతంగా ప్రవహిస్తున్న దౌత్పల్లి, పంకేన, సర్వాయిపేట, తీగల వాగులు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీరు, నిలిచిన బొగ్గు ఉత్పత్తి -
పుష్కర శోభ
పుష్కర స్నానం పరమ పవిత్రం.. సర్వపాప హరణం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే భక్తులు పుష్కరాల వేళ నదిలో పవిత్ర స్నానమాచరించేం దుకు ఆసక్తి చూపుతారు. వచ్చే ఏడాది జూలై నెలలో గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయి. ఇందుకోసం గోదారి తీరంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుం డా ఉండేందుకు సకల ఏర్పాట్లు చేస్తోంది. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పవిత్ర గోదావరి పుష్కరాలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూలైలో నిర్వహించే ఈ వేడుకల కోసం ఇప్పటికే జిల్లా నుంచి రూ.66 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. భక్తకోటికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైన ఏ ర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారిం చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సాంస్కృతిక సలహాదారు రమణాచారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వినోద్ కెఅగర్వాల్ సోమవారం జిల్లా ఉన్న తాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చైర్మన్‌గా మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, హరీష్‌రావు, కేటీఆర్ సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ ఉప సంఘం పుష్క రాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. 18 పుష్కర ఘాట్ల ఏర్పాటు గోదావరి పుష్కరాల కోసం గతంలో జిల్లాలో ఐదు ఘాట్లనే ఏర్పాటు చేశారు. ఈసారి కొత్త గా మరో 13 ఘాట్లు ఏర్పాటు చేయనున్నా రు. ఇందుకోసం జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్, బోధన్ రెవెన్యూ డి విజన్ల పరిధిలోనే పుష్కరఘాట్లను ఏర్పాటు చేసేందుకు పనులను కూడా ప్రారంభించారు. మోర్తాడ్ మండలం తడ్‌పాకల, దోంచంద, గుమ్మిర్యాల, బా ల్కొండ మండలం సావెల్, నందిపేట మండ లం ఉమ్మెడలో గతంలో పుష్కరాలు నిర్వహించారు. ఆర్మూరు మండలం కో మన్పల్లి, నందిపేట మండలం వన్నెల్ (కె), చిన్నయానం, రెంజల్ మండలం కందకుర్తి, తాడ్‌బిలోలి, బోర్గాం నవీపే ట మండలం కోస్లి, బినోల, తుంగిని, యంచ, నాలేశ్వర్ తదితర ప్రాంతాలలో ను భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటి నిర్మాణ ప నులు పారదర్శకంగా జరిగేలా చూడాల ని చీఫ్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు సూచించారు. మౌలిక వసతుల కల్పనపై దృష్టి వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటీకే సీ ఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లతో హైదరాబాద్‌లో ఓ సమావేశం నిర్వహించారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పుష్కరఘాట్ల ఏర్పాటుపై కలెక్టర్‌తో సమీక్షిం చారు. 20 రోజుల వ్యవధిలో చీఫ్ సెక్రెటరీ, సాంస్కృతిక సలహాదారు మూడు పర్యాయాలు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఐదు ప్రాంతాలకే పరిమితమైన పుష్కర వేడుకలను 11 ప్రాంతాలు, 18 పుష్కరఘాట్లకు విస్తరించారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లా ఉన్నతాధికారులతోపాటు నీటిపారుదల, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులతో సమావేశమై పుష్కర ఘాట్లలో మౌలిక వసతులు, సదుపాయాల కల్పనపై సమీక్ష జరిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో ప ని చేస్తున్న అధికారులతో వీడియో కా న్ఫరెన్స్ నిర్వహించారు. పుష్కరఘాట్ల మరమ్మతులు, నిర్మాణం, రోడ్డు, రవాణా సౌకర్యం, తాగునీటి వసతి, భక్తులు దుస్తులు మా ర్చుకునే గదులు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటుపై దృష్టి సా రించారు. వైద్య శిబిరాలు, పారిశుధ్య పనులు, పార్కింగ్ స్థలాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ తదితర పనుల కోసం ఉన్నతాధికారులతో కూడిన కమిటీలు వేసే విషయమై కూడా చర్చిం చారు. పుష్కరాల సమయంలో ప్రభు త్వ అతిధి గృహాలన్నీ కలెక్టర్ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోదావరి పుష్కరాలు అధికారులకు కత్తిమీద సాములా మారాయి. ఏర్పాట్లన్నీ సజావుగా సాగేలా వారు చర్యలు తీసుఉంటున్నారు.