అంచనాలు కుదించండి
సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన రూ.131 కోట్ల మేరకే ప్రతిపాదనలను పరి మితం చేసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆ దేశించారు. ఏ శాఖ ఎంత మొత్తానికి పనుల అంచనాలు తయారు చేయాలన్న దానిపై ఈ నెల 18న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనూరాధ ఇచ్చిన నిర్దేశాన్ని దాటరాదని స్ప ష్టం చేశారు. ఎక్కడా అనుబంధ పనులకు తావులేదని, కేవలం పుష్కరాలకు సంబంధించిన సన్నాహాలు, భక్తులకు అవసరమైన వసతులకే ప్రతిపాదనలు పరిమితం కావాలని కచ్చితంగా చెప్పారు.
పుష్కర పనుల అంచనాలపై తుది నివేదికలు తీసుకునేందుకు కలెక్టర్ శుక్రవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో రూ.142 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చిన ఆర్‌అండ్‌బీ శాఖ ఇప్పుడు రూ.70 కోట్ల కు కుదించింది. ప్రతిపాదించిన పనులను ఆ శాఖ ఎస్‌ఈ సీఎస్‌ఎన్‌మూర్తి వివరించారు. పుష్కరాల్లో కీలకమైన రాజమండ్రి- కొవ్వూరు రోడ్‌కం రైలు వంతెన మరమ్మతులకు రైల్వే శాఖ సహకరించడం లేదనడంతో సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యుత్తు శాఖ అధికారులు తమ శాఖ నిధులతో చేపట్టే రూ.30 కోట్లు వ్యయమయ్యే పనుల ప్రతిపాదనలిచ్చారు. రాజమండ్రిలో ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
రూ.59 కోట్లు అవసరమన్న దేవాదాయ శాఖ
రాజమండ్రి సహా జిల్లాలోని వివిధ ఆలయాల మరమ్మతులు, భక్తులకు వసతులు, పుష్కర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ రూ.59.24 కోట్ల తో ప్రతిపాదనలు అందిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎస్‌ఈ ఆర్.జి.కృష్ణారెడ్డి రూ.30 కోట్లకు అంచనాలు సమర్పించారు. జిల్లాలోని 137 స్నానఘట్టాల్లో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని 13 పోను మిగిలిన చోట్ల బారికేడ్లు, ఇతర ఏర్పాట్లకు రూ.ఆరు కోట్లకు ప్రతిపాదనలు ఇస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి ఎల్.శ్రీధర్‌రెడ్డి చెప్పారు. బారికేడింగ్ పనులు ఇరిగేషన్ శాఖ చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
పంచాయతీరాజ్ శా ఖ పుష్కరాలు జరిగే గ్రామాల్లో రహదారుల అ భివృద్ధి, ఇతర పనులకు రూ.13.63 కోట్ల ప్రతి పాదనలివ్వగా రూ.6 కోట్లకు కుదించాలని కలెక్టర్ సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ రూ.కోటి, ఆర్‌టీసీ రూ.70 లక్షలు, రవాణా శాఖ రూ.5 ల క్షలు, ట్రాఫిక్ పోలీస్ విభాగం రూ.8 లక్షలు వ్య యమయ్యే ప్రతిపాదనలు ఇచ్చాయి. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ముత్యాల రాజు, సబ్ కలెక్టర్ విజయరామరాజు పాల్గొన్నారు.
సీఎస్‌ఆర్ నిధులు పుష్కరాలకే ..
ఈ ఏడాది, వచ్చే ఏడాది జిల్లాలో వివిధ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా వెచ్చించే (సీఎస్‌ఆర్) సుమారు రూ.25 కోట్లను పుష్కరాల పనులకే వెచ్చిస్తామని కలెక్టర్ విలేకరులకు తెలిపారు. కొన్ని శాఖలకు అవసరం అనుకుంటే మరో రూ.కోటి లేదా రెండు కోట్ల వరకూ అదనపు నిధులు రప్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులు మిగిలిపోతే రెండో దశ అంచనాల్లో పరిశీలిస్తామన్నారు. రంపచోడవరం డివిజన్‌లో విలీనం అయిన నాలుగు ఖమ్మం జిల్లా మండలాల్లోని ఐదు ఘాట్‌ల అభివృద్ధి పనులను కూడా సంబంధిత శాఖలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.