nitu prasad
-
అంచనాలు కుదించండి
సాక్షి, రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో వివిధ శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన రూ.131 కోట్ల మేరకే ప్రతిపాదనలను పరి మితం చేసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆ దేశించారు. ఏ శాఖ ఎంత మొత్తానికి పనుల అంచనాలు తయారు చేయాలన్న దానిపై ఈ నెల 18న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనూరాధ ఇచ్చిన నిర్దేశాన్ని దాటరాదని స్ప ష్టం చేశారు. ఎక్కడా అనుబంధ పనులకు తావులేదని, కేవలం పుష్కరాలకు సంబంధించిన సన్నాహాలు, భక్తులకు అవసరమైన వసతులకే ప్రతిపాదనలు పరిమితం కావాలని కచ్చితంగా చెప్పారు. పుష్కర పనుల అంచనాలపై తుది నివేదికలు తీసుకునేందుకు కలెక్టర్ శుక్రవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలో రూ.142 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చిన ఆర్అండ్బీ శాఖ ఇప్పుడు రూ.70 కోట్ల కు కుదించింది. ప్రతిపాదించిన పనులను ఆ శాఖ ఎస్ఈ సీఎస్ఎన్మూర్తి వివరించారు. పుష్కరాల్లో కీలకమైన రాజమండ్రి- కొవ్వూరు రోడ్‌కం రైలు వంతెన మరమ్మతులకు రైల్వే శాఖ సహకరించడం లేదనడంతో సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. విద్యుత్తు శాఖ అధికారులు తమ శాఖ నిధులతో చేపట్టే రూ.30 కోట్లు వ్యయమయ్యే పనుల ప్రతిపాదనలిచ్చారు. రాజమండ్రిలో ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సమకూరుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రూ.59 కోట్లు అవసరమన్న దేవాదాయ శాఖ రాజమండ్రి సహా జిల్లాలోని వివిధ ఆలయాల మరమ్మతులు, భక్తులకు వసతులు, పుష్కర ఏర్పాట్లకు దేవాదాయ శాఖ రూ.59.24 కోట్ల తో ప్రతిపాదనలు అందిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. రాజమండ్రి నగరపాలక సంస్థ ఎస్ఈ ఆర్.జి.కృష్ణారెడ్డి రూ.30 కోట్లకు అంచనాలు సమర్పించారు. జిల్లాలోని 137 స్నానఘట్టాల్లో రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని 13 పోను మిగిలిన చోట్ల బారికేడ్లు, ఇతర ఏర్పాట్లకు రూ.ఆరు కోట్లకు ప్రతిపాదనలు ఇస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి ఎల్.శ్రీధర్‌రెడ్డి చెప్పారు. బారికేడింగ్ పనులు ఇరిగేషన్ శాఖ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీరాజ్ శా ఖ పుష్కరాలు జరిగే గ్రామాల్లో రహదారుల అ భివృద్ధి, ఇతర పనులకు రూ.13.63 కోట్ల ప్రతి పాదనలివ్వగా రూ.6 కోట్లకు కుదించాలని కలెక్టర్ సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ రూ.కోటి, ఆర్టీసీ రూ.70 లక్షలు, రవాణా శాఖ రూ.5 ల క్షలు, ట్రాఫిక్ పోలీస్ విభాగం రూ.8 లక్షలు వ్య యమయ్యే ప్రతిపాదనలు ఇచ్చాయి. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ముత్యాల రాజు, సబ్ కలెక్టర్ విజయరామరాజు పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులు పుష్కరాలకే .. ఈ ఏడాది, వచ్చే ఏడాది జిల్లాలో వివిధ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా వెచ్చించే (సీఎస్ఆర్) సుమారు రూ.25 కోట్లను పుష్కరాల పనులకే వెచ్చిస్తామని కలెక్టర్ విలేకరులకు తెలిపారు. కొన్ని శాఖలకు అవసరం అనుకుంటే మరో రూ.కోటి లేదా రెండు కోట్ల వరకూ అదనపు నిధులు రప్పించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులు మిగిలిపోతే రెండో దశ అంచనాల్లో పరిశీలిస్తామన్నారు. రంపచోడవరం డివిజన్లో విలీనం అయిన నాలుగు ఖమ్మం జిల్లా మండలాల్లోని ఐదు ఘాట్ల అభివృద్ధి పనులను కూడా సంబంధిత శాఖలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
స్ట్రాంగ్‌రూంలను రోజూ సందర్శించండి
సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను ఆయా జిల్లాల కలెక్టర్లు రోజూ సందర్శించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఈ నెల 16న జరిగే ఓట్ల లెక్కింపునకు సంబంధించి సూచనలు చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు ఆర్వోలను, కలెక్టర్లను, ఎన్నికల సిబ్బందిని అభినందించారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఇరవైనాలుగు గంటలూ భద్రత ఉండేలా చూడాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించుకునేందుకు వీలుగా షామియానాల వంటివి ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట రీ పోలింగ్‌ను నెల 12 న నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుందన్నారు. లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్‌కు మైక్రో అబ్జర్వర్లుగా కేంద్ర ఉద్యోగులను, కౌంటింగు సూపర్వైజర్లుగా గెజిటెడ్ అధికారులను, కౌంటింగ్ సహాయకులుగా ఇతర ఉద్యోగులను నియమించుకోవాలన్నారు. కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామన్నారు. లెక్కింపు సిబ్బందికి ఈ నెల 14న, మైక్రో అబ్జర్వర్లకు 15న శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈవీఎంల నిమిత్తం గొడౌన్ నిర్మాణానికి ఇంతవరకూ రూ.50 లక్షలు ఖర్చు చేశామని, ఇంకా రూ.50 లక్షలు అవసరం వుందన్నారు. నిధులు ఇస్తే జూలై నెలాఖరు నాటికి పూర్తి కాగలదన్నారు. ఎన్నికల తనిఖీల్లో ఇంతవరకూ రూ.9.12 కోట్ల నగదు, రూ.2 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. -
పోలింగ్‌కు సర్వం సిద్ధం
సాక్షి, కాకినాడ : జిల్లాలో బుధవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లంతా నిర్భయంగా ఓటేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ కోర్టు హాల్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎవరైనా ప్రలోభపెడితే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ విజయకుమార్, డీఆర్ఓ యాదగిరి, డీపీఆర్ఓ వి.రామాంజనేయులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజవర్గానికి సంబంధం లేని వారు లాడ్జిలు, గెస్టుహౌస్‌లు ఖాళీ చేసి తమ స్వస్థలాలకు వెళ్లి పోవాలని, ఎవ రైనా పట్టుబడితే అదుపులోకి తీసుకుంటారన్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో సైతం మద్యం సరఫరా ఉండకూదన్నారు. ఈ నిబంధన జిల్లాతో పాటు యానాం పరిధిలోనూ అమలులో ఉంటుందన్నారు. ప్రచారం ముగిసే సమయానికి జిల్లాలో రూ. 9.46 కోట్ల నగ దు పట్టుకున్నామన్నారు. రూ.20 లక్షల పైబడి విలు వ కలిగిన 90 వేల లీటర్ల లిక్కర్, రూ.95 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, రూ.11.66 లక్షల చీరలు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, 9 వేల కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు.1680 కేసుల్లో 852 మందిని అరెస్టు చేశారన్నారు. సమస్యలుంటే ప్రజలు 1800 425 3077 లేదా 1077 టోల్ ఫ్రీ నంబర్లకు, లేకుంటే 0884 2365424 నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. ఫ్యాక్సు ద్వారా అయితే 0884 2376184 కు ఫిర్యాదు పంపించవచ్చన్నారు. 37.73 లక్షల మంది ఓటర్లు జిలాల్లో 37 లక్షల 73 వేల 322 మంది ఓటర్లు ఉన్నార న్నారు. పురుషులు 18 లక్షల 91 వేల 351 మంది, మహిళలు 18 లక్షల 81 వేల 718 మంది, ఇతరులు 253 మంది ఉన్నారన్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు వరకు సమయం ఉండగా, ఒక్క రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఓట్లు వేసేందుకు జిల్లాలో మొత్తం 2268 ప్రాంతాల్లో 4056 పోలింగ్ స్టేషన్లు నెలకొల్పారు. వీటిలో సెన్సిటివ్ ప్రాంతాలుగా 1590 పోలింగ్ స్టేషన్లు, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలుగా1276 పోలింగు స్టేషన్లను గుర్తించగా 2750 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఓటర్లలో సోమవారం సాయంత్రానికి 32 లక్షల ఏడు వేల 324 మందికి ఓటర్ స్లిప్పుల (85 శాతం) పంపిణీ పూర్తయింది. ఎపిక్ కార్డులు 4 లక్షల 82 వేల 36 (75 శాతం) పంపిణీ చేశారు. సిబ్బంది నియామకం జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పీఓలు, ఏపీఓలు, ఓపీఓలుగా 28 వేల 885 మంది, మైక్రో అబ్జర్వర్లుగా 519 మందిని, సెక్టోరల్ ఆఫీసర్లుగా 354 మందిని నియమించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 60, అదనపు బృందాలు 19, స్టాటిక్ సర్వీలెన్స బృందాలు 61, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు బృందాలు 57 పోలింగ్ ముగిసే వరకూ నిరంతరాయంగా పని చేస్తాయి. ఓటర్లకు మంచినీరు అందించేందుకు, క్యూ విధానం సక్రమంగా పాటించేందుకు మొత్తం 4581 మందిని వినియోగిస్తున్నారు. పోలిం గ్‌కు 815 వాహనాలు వినియోగిస్తున్నారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విధుల నిర్వహణకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టరేట్లో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి నీతూ ప్రసాద్ నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో అబ్జర్వర్ల సమక్షంలో ఈ మేరకు ర్యాండమైజేషన్ ప్రక్రియ ముగించి 19 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగు అధికారులకు ఆదేశాలిచ్చారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది మంగళవారం ఉదయం ఆరు గంటలకు కేటాయించిన నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. ఏ పోలింగు కేంద్రంలో డ్యూటీ పడిందో తెలుస్తుందని అక్కడి నుంచి ఎన్నికల సరంజామా తీసుకుని కేటాయించిన పోలింగ్ స్టేషన్‌కు వెళ్లాలన్నారు. బుధవారం ఉదయం 6 గంటలకే విధుల్లోకి చేరి మాక్ పోలింగ్ నిర్వహించుకోవాలన్నారు. -
ప్రకటనలిస్తే చెప్పాలి
సాక్షి, కాకినాడ: రాజకీయ పార్టీలు, లేదా అభ్యర్థులు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటనలను ఇవ్వదలిస్తే మూడు రోజుల ముందుగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ)కి తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. కమిటీ అనుమతి పొందిన తరువాత మాత్రమే ప్రసారం అయిందోలేదో కమిటీ పరిశీలిస్తుందన్నారు. కలెక్టరేట్ కోర్టుహాల్లో మంగళవారం ఎంసీఎంసీ ద్వారా రాజకీయ పార్టీలకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు,ప్రచురణ కర్తలకు సంయుక్తంగా నిర్వహించిన అవగాహనా సమావేశంలో మాట్లాడారు. అలాగే ప్రింట్ మీడియాలో నగదు లేదా వస్తువుల చెల్లింపుల ద్వారా వచ్చే వార్తలు లేదా విశ్లేషణలపై ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వచించిన మేరకు పరిశీలన సాగుతుందన్నారు. పార్లమెంటు నియోజకవర్గానికో కమిటీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికీ ఒక ఎంసీఎంసీ కమిటీ వేయనున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితా ప్రకటించినప్పటినుంచి అన్ని చానెళ్లలో వచ్చే అనుమానిత చెల్లింపుల వార్తలపై కమిటీలు దృష్టిసారిస్తాయన్నారు. ఆయా మీడియా సంస్ధలకు అభ్యర్ధులు చెల్లింపు చేశారా లేదాన్న అంశంతో సంబంధం లేకుండా సంబంధిత వార్తకు డీఐపీఆర్,డీఏవీపీ రేట్లను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తం ఎంతో సంబంధిత ఆర్వోకు నివేదిస్తుందన్నారు. దీనిని అభ్యర్ధి ఖర్చు ఖాతాలో ఎందుకు చేర్చకూడదో 96 గంటలలోపు నోటీసు ఇస్తారన్నారు. దానికి 48 గంటలలోపు జవాబు రాకుంటే కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. అనంతరం జరిగే ప్రక్రియలపై భారత ఎన్నికల సంఘం నిర్ణయమే తుది నిర్ణయంగా వుంటుందన్నారు. పెయిడ్ న్యూస్ ఐటంలకు సంబంధించి మాత్రం కమిటీలు మీడియా సంస్ధలకు గానీ రాజకీయ పార్టీలకు గానీ నోటీసులు ఇవ్వవని ఎన్నికల సంఘం పరిశీలించి పీసీఐ,ఎన్బీఏలకు తెలియజేస్తుందన్నారు. ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, చేతి బిల్లులు, ఇతర డాక్యుమెంట్లపై ప్రింటర్ పేరు, చిరునామా, ఫోన్నంబర్తో పాటు ఎన్ని కాపీలు ముద్రించినదీ పేర్కొనాలని, వీటిని ఉల్లంఘిస్తే కేసులు తప్పవని కలెక్టర్ నీతూ ప్రసాద్ హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం రానున్న మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని మునిసిపాలిటీలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు,పోస్టల్ బ్యాలెట్లు పంపామని సాధారణ బ్యాలట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని కలెక్టర్ నీతూప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌నుంచి రాష్ట్ర ఎన్నికల కమీషన ర్ రమాకాంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే మొదటి విడత శిక్షణా తరగతులు పూర్తి చేయడంతోపాటు రెండో విడతను ఈ నెల 27న నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల సిబ్బందిని విధులకు నియమించడంతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లు,పోలింగ్,కౌటింగ్ సెంటర్లు గుర్తించడం వంటి పనులు పూర్తయ్యాయన్నారు. ఇదిలా ఉండగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 4,500 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా 3,500 సిద్ధంగా ఉన్నాయని, ఇంకా వెయ్యి బాక్సులు కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కౌంటింగ్, పోలింగ్ సిబ్బందికి ఈ నెల 28న మొదటి విడత, ఏప్రిల్ 1న రెండవ విడత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. 2,376 సెన్సిటీవ్, హైపర్సెన్సిటీవ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఇక్కడ మైక్రో అబ్జర్వులు, వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీకి చర్యలు చేపట్టామన్నారు. ఎస్పీ విజయ్‌కుమార్ పాల్గొని మాట్లాడుతూ 4,359 ఆయుధాలు, రూ.3.92లక్షలు విలువ చేసే లిక్కర్, రూ.ఐదులక్షలు నగదు స్వాధీనంచేసుకోవడంతోపాటు 750 బెల్ట్‌షాపులు సీజ్ చేశామన్నారు. అర్బన్ ఎస్పీ రవికుమార్‌మూర్తి, మున్సిపల్ అధికారులు, డిపీవో శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.