పోలింగ్‌కు సర్వం సిద్ధం
సాక్షి, కాకినాడ : జిల్లాలో బుధవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లంతా నిర్భయంగా ఓటేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నీతూ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఎన్నికల నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్ కోర్టు హాల్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఎవరైనా ప్రలోభపెడితే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ విజయకుమార్, డీఆర్‌ఓ యాదగిరి, డీపీఆర్‌ఓ వి.రామాంజనేయులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజవర్గానికి సంబంధం లేని వారు లాడ్జిలు, గెస్టుహౌస్‌లు ఖాళీ చేసి తమ స్వస్థలాలకు వెళ్లి పోవాలని, ఎవ రైనా పట్టుబడితే అదుపులోకి తీసుకుంటారన్నారు.
పోలింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో సైతం మద్యం సరఫరా ఉండకూదన్నారు. ఈ నిబంధన జిల్లాతో పాటు యానాం పరిధిలోనూ అమలులో ఉంటుందన్నారు. ప్రచారం ముగిసే సమయానికి జిల్లాలో రూ. 9.46 కోట్ల నగ దు పట్టుకున్నామన్నారు. రూ.20 లక్షల పైబడి విలు వ కలిగిన 90 వేల లీటర్ల లిక్కర్, రూ.95 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు, రూ.11.66 లక్షల చీరలు, ఇతర గిఫ్ట్ ఆర్టికల్స్, 9 వేల కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నామన్నారు.1680 కేసుల్లో 852 మందిని అరెస్టు చేశారన్నారు. సమస్యలుంటే ప్రజలు 1800 425 3077 లేదా 1077 టోల్ ఫ్రీ నంబర్లకు, లేకుంటే 0884 2365424 నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. ఫ్యాక్సు ద్వారా అయితే 0884 2376184 కు ఫిర్యాదు పంపించవచ్చన్నారు.
37.73 లక్షల మంది ఓటర్లు
జిలాల్లో 37 లక్షల 73 వేల 322 మంది ఓటర్లు ఉన్నార న్నారు. పురుషులు 18 లక్షల 91 వేల 351 మంది, మహిళలు 18 లక్షల 81 వేల 718 మంది, ఇతరులు 253 మంది ఉన్నారన్నారు. బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు వరకు సమయం ఉండగా, ఒక్క రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ఓట్లు వేసేందుకు జిల్లాలో మొత్తం 2268 ప్రాంతాల్లో 4056 పోలింగ్ స్టేషన్లు నెలకొల్పారు. వీటిలో సెన్సిటివ్ ప్రాంతాలుగా 1590 పోలింగ్ స్టేషన్లు, హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలుగా1276 పోలింగు స్టేషన్లను గుర్తించగా 2750 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న ఓటర్లలో సోమవారం సాయంత్రానికి 32 లక్షల ఏడు వేల 324 మందికి ఓటర్ స్లిప్పుల (85 శాతం) పంపిణీ పూర్తయింది. ఎపిక్ కార్డులు 4 లక్షల 82 వేల 36 (75 శాతం) పంపిణీ చేశారు.
సిబ్బంది నియామకం
జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పీఓలు, ఏపీఓలు, ఓపీఓలుగా 28 వేల 885 మంది, మైక్రో అబ్జర్వర్లుగా 519 మందిని, సెక్టోరల్ ఆఫీసర్లుగా 354 మందిని నియమించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 60, అదనపు బృందాలు 19, స్టాటిక్ సర్వీలెన్‌స బృందాలు 61, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్టు బృందాలు 57 పోలింగ్ ముగిసే వరకూ నిరంతరాయంగా పని చేస్తాయి. ఓటర్లకు మంచినీరు అందించేందుకు, క్యూ విధానం సక్రమంగా పాటించేందుకు మొత్తం 4581 మందిని వినియోగిస్తున్నారు. పోలిం గ్‌కు 815 వాహనాలు వినియోగిస్తున్నారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
సాక్షి, కాకినాడ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విధుల నిర్వహణకు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి నీతూ ప్రసాద్ నిర్వహించారు. కలెక్టరేట్ ఆవరణలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌లో అబ్జర్వర్ల సమక్షంలో ఈ మేరకు ర్యాండమైజేషన్ ప్రక్రియ ముగించి 19 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగు అధికారులకు ఆదేశాలిచ్చారు. విధుల్లో పాల్గొనే సిబ్బంది మంగళవారం ఉదయం ఆరు గంటలకు కేటాయించిన నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. ఏ పోలింగు కేంద్రంలో డ్యూటీ పడిందో తెలుస్తుందని అక్కడి నుంచి ఎన్నికల సరంజామా తీసుకుని కేటాయించిన పోలింగ్ స్టేషన్‌కు వెళ్లాలన్నారు. బుధవారం ఉదయం 6 గంటలకే విధుల్లోకి చేరి మాక్ పోలింగ్ నిర్వహించుకోవాలన్నారు.