godawari waters
-
ఫౌండేషన్ స్టోన్ మాదే
నర్సంపేట, (వరంగల్): గోదావరి జలాలను నర్సంపేటకు తరలించాలలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిధులు మంజూరు చేయగా ఫౌండేషన్ స్టోన్ వేసింది తామేనని, పనులు ప్రారంభించింది కూడా తామేనని ఏఐసీసీ సభ్యుడు, తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తూ పెద్ది సుదర్శన్‌రెడ్డి జలయాత్ర పేరుతో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులను తరలించి అబద్దపు ప్రచారంతో లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు. వాస్తవానికి 2008–09లోనే ఫేజ్–3 ప్యాకేజీ–5 కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.330 కోట్లను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఈ పనులు జరుగుతున్న క్రమంలోనే 2014లో టీఆర్ఎస్ ప్రభ్వుం ఏర్పాటయ్యాక రీడిజైన్ పేరుతో స్వార్థం కోసం రైతులకు నష్టం కలిగే పనులు చేశారని ఆరోపించారు. జూరాల–పాకాల వాగ్దానం ఏమైందని, ప్రస్తుతం ఆ మాటను ఎందుకు దాటేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు గోదావరి–పాకాల అంటూ ఓట్ల కోసం రాజకీయం చేస్తున్నారని, దీనిని రైతులు గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి పథకానికి లబ్ధిదారులను గ్రామసభల ద్వారానే ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ టీఆర్ఎస్ కార్యకర్తలకే మేలు జరుగుతున్న విషయమై కలెక్టర్ చొరవ తీసుకుని పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజవర్గ కన్వీనర్ ఖానాపురం ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మండల అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పెండెం రామానంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హింగె మురళీ, కౌన్సిలర్ పుల్లూరి స్వామి, పట్టణ యూత్ అధ్యక్షుడు కోల చరణ్, వైనాల కార్తీక్, నియోజకవర్గ యూత్ నాయకులు వేముల ఇంద్రదేవ్‌తోపాటు పాల్గొన్నారు. -
'కేసీఆర్ జగమొండి.. ప్రాణాలైనా బలిపెడతాడు'
హైదరాబాద్: 'కేసీఆర్ జగమొండి. అవసరమైతే ప్రాణాలు బలిపెడతాడు కానీ వెనక్కి వెళ్లడు. ఆరునూరైనా 2018లో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి.. ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతా' అని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గోదావరి జలాలపై మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చిన ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తే.. వారిపై కేసులు పెట్టి జైలుకూడు తినిపిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఆకుపచ్చగా మారుతుంటే కాంగ్రెస్ నేతలు కళ్లలో నిప్పులో పోసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంకా సీఎం కేసీఆర్ ఏమన్నారంటే.. టాప్ కామెంట్స్.. గోదావరి జలాలపై మహారాష్ట్రతో ఒప్పందాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. కాళేశ్వరం, ఎల్లంపల్లి పూర్తయితే తెలంగాణ సస్యశామలం అవుతుంది ఏడాదిన్నర కష్టపడి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నాం తెలంగాణ ప్రజల గోసకు, బాధలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. తమ్మిడిహెట్టిపై ఒప్పందం జరిగి ఉంటే.. ఆరేళ్లయినా ఎందుకు తట్టెడు మట్టి తీయలేదు? మేం ప్రాజెక్టులు నిర్మిస్తామంటుంటే.. కాంగ్రెస్ నేతలు డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేశాయి. గతంలోనే 98 లక్షల ఎకరాలకు నీరు అంది ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చేది రెండేళ్లలో మా అవినీతి రహిత పాలన చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతల ఆరోపణలు గోదావరి నికర జలాలు 1480 టీఎంసీలు ఉంటే.. అందులో తెలంగాణ వాటా 950 టీఎంసీలు మొత్తం నీటి లభ్యత మూడువేల టీఎంసీల్లో 1500 టీఎంసీల మిగులు జలాలున్నాయి అందులో మా వాటా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం తెలంగాణలోని కోటి ఎకరాలకు కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చితీరుతాం ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు త్వరలో తెలంగాణ బస్సుయాత్ర నిర్వహిస్తా -
రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తా: కేసీఆర్
హైదరాబాద్: గోదావరి జలాల విషయమై మహారాష్ట్రతో చేసుకున్న చారిత్మాత్మక ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర పజలందరూ ఈ ఒప్పందంపై సంతోషంగా ఉన్నా.. కాంగ్రెస్ సన్నాసులు మాత్రం నల్లజెండాలు ప్రదర్శిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు అంతు, ఆధారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి కలెక్టరేట్ వద్ద ధర్నాలో అబద్ధాలు మాట్లాడారని, 152 మీటర్లకు తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్రంతో ఒప్పందం కుదిరిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారని అన్నారు. 'ఇంకా 40 నిమిషాలపాటు నేను బేగంపేట ఎయిర్‌పోర్టులోనే ఉంటాను. నీకు దమ్ముంటే ఆ ఒప్పంద కాగితాన్ని తీసుకొని ఎయిర్‌పోర్ట్‌కు రా. నేను ఇక్కడి నుంచే రాజ్‌భవన్‌కు వెళ్లి నా రాజీనామా సమర్పిస్తాను. రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను' అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలను దారుణంగా మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు.