Godfrey Phillips India
-
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు
పాపులర్ సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ మరింత తీవ్రమైంది.బోర్డ్ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్మెంట్పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. -
గాడ్ఫ్రే ఫిలిప్స్ భళా- హెచ్ఏఎల్ బోర్లా
సానుకూల ప్రపంచ సంకేతాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలలో కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన టొబాకొ ప్రొడక్టుల దిగ్గజం గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయానికి తాజాగా ఫ్లోర్ ధరను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్ఏఎల్ నష్టాలతో కళ తప్పింది. ఇతర వివరాలు చూద్దాం.. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా దేశీయంగా మాల్బోరో బ్రాండ్ సిగరెట్ల తయారీ, విక్రయాలకు ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకోనున్నట్లు గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న మార్కెట్లలో సొంత బ్రాండ్లను పెంచుకునేందుకు చూస్తున్నట్లు తెలియజేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 1092ను అధిగమించింది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా కంపెనీలో 10 శాతం వాటాను ప్రమోటర్ కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. అధిక స్పందన లభిస్తే అదనంగా 5 శాతం వాటాను సైతం అమ్మివేయనుంది. ఇందుకు ఫ్లోర్ ధర రూ. 1,001కాగా.. ఇది బుధవారం ముగింపు ధర రూ. 1178తో పోలిస్తే 15 శాతం తక్కువ. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 89.97 శాతం వాటా ఉంది. వాటా విక్రయం ద్వారా రూ. 5020 కోట్లవరకూ సమీకరించనుంది. ఫ్లోర్ ధరలో రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 5 డిస్కౌంట్ లభించనుంది. ఈ నేపథ్యంలో హెచ్ఏఎల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 14 శాతం పడిపోయి రూ. 1014 వద్ద ట్రేడవుతోంది. -
కల్పతరు అప్- గాడ్ఫ్రే ఫిలిప్స్ డౌన్
విదేశీ స్టాక్ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీయంగా ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. తదుపరి మరికొంత బలపడ్డాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 171 పాయింట్లు ఎగసి 35,087కు చేరగా.. నిఫ్టీ 51 పాయింట్లు పుంజుకుని 10,353 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆర్డర్లను సంపాదించినట్లు వెల్లడించడంతో కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాలు నిరాశపరచడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి కల్పతరు లాభాలతో సందడి చేస్తుంటే.. గాడ్ఫ్రే ఫిలిప్స్ కళ తప్పింది. వివరాలు చూద్దాం.. కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతోపాటు దేశీ కంపెనీల నుంచి తాజాగా కాంట్రాక్టులు పొందినట్లు మౌలిక సదుపాయాల సంస్థ కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్ పేర్కొంది. వీటితోపాటు అనుబంధ సంస్థ ద్వారా యూరోప్‌లోనూ విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగంలో ఆర్డర్లను దక్కించుకున్నట్లు తెలియజేసింది. వీటి సంయుక్త విలువను రూ. 956 కోట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో కల్పతరు పవర్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 3 శాతం పెరిగి రూ. 223 వద్ద ట్రేడవుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన పొగాకు ఉత్పత్తుల సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 39 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 20 శాతం తక్కువకాగా.. మొత్తం ఆదాయం మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 622 కోట్లను అధిగమించింది. ఈ నేపథ్యంలో గాడ్ఫ్రే ఫిలిప్స్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం పతనమై రూ. 987 వద్ద ట్రేడవుతోంది. -
నిబంధనలకు లోబడే నడుచుకుంటాం: గాడ్ఫ్రే ఫిలిప్స్
న్యూఢిల్లీ: సిగరెట్ ప్యాకెట్స్‌పై హెచ్చరికల గుర్తులకు సంబంధించి.. కొత్త నిబంధనలకు లోబడే నడుచుకుంటామని గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా తెలిపింది. పొగాకు ఉత్పత్తులు వాటి ప్యాకేజింగ్ స్పేస్‌లో 85 శాతాన్ని కచ్చితంగా పెద్ద హెచ్చరికల గుర్తుల ప్రదర్శనకు ఉపయోగించాలనే ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనల అమలుకు కసరత్తు జరుగుతోందని గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా బీఎస్ఈకి నివేదించింది. ఈ అంశమై సిగరెట్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశామని పేర్కొంది.