godhavari water
-
భద్రాచలం ప్రజలకు ఒణుకు పుటిస్తున్నగోదావరి నది
-
గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలకు హైఅలర్ట్
అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు. ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
నగరానికి మంజీరా పరుగులు
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులకు శుభవార్త. సుమారు ఆరునెలలుగా నగరానికి నిలిచిపోయిన మంజీరా జలాల పంపింగ్ ఆదివారం మొదలైంది. తొలివిడతగా ఈ జలాశయం నుంచి 16 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నీటి తరలింపుతో లింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు గోదావరి జలాల రివర్స్ పంపింగ్ కష్టాలు తీరినట్లు తెలిపాయి. కాగా ఇటీవలి భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండల్లా మారడంతో ఈ రెండు జలాశయాల నుంచి నగర తాగునీటి అవసరాలకు నిత్యం 120 ఎంజీడీల నీటిని తరలించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది. సింగూరు, మంజీరా జలాల తరలింపుతో కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి గ్రేటర్‌కు తరలిస్తున్న గోదావరి జలాల పంపింగ్‌ను 86 ఎంజీడీల నుంచి 28 ఎంజీడీలకు క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. తద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయాలని జలమండలి నిర్ణయించింది. -
ఎంతో రుచిరా.. ఇదేమి రుచిరా?
కృష్ణా, గోదావరి నదుల నీటి రుచిలో తేడాలు ఉన్నాయంటున్న నగర వాసులు.. రెండింటి నీటిపై ప్రయోగశాలలో పరీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరం దాహార్తిని తీర్చుతున్నది కృష్ణా, గోదావరి నదులే. వందల కిలోమీటర్ల దూరం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు తరలివస్తున్న ఆ నదుల నీరే ఇక్కడి ప్రజలకు ఆధారం. కానీ ఈ రెండు నదుల నీటి రుచిలో చాలా తేడా ఉంటోందని నగరవాసులు అంటున్నారు. కృష్ణా నీళ్లు సరఫరా అవుతున్న కొన్ని ప్రాంతాల వారికి కొంతకాలంగా గోదావరి నీళ్లు సరఫరా చేస్తుండడంతో ఈ తేడాను గుర్తించినట్లు చెబుతున్నారు. గోదావరి జలాలు రుచిలో కఠినంగా ఉంటున్నాయని, కృష్ణా నది జలాలు మృదువుగా అనిపిస్తున్నాయని అంటున్నారు. రోజూ కృష్ణా మూడు దశల పథకాల నుంచి 260 మిలియన్ గ్యాలన్లు, గోదావరి నది నుంచి 86 మిలియన్ గ్యాలన్ల నీటిని జల మండలి సేకరించి హైదరాబాద్ నగరం నలుమూలలకు సరఫరా చేస్తోంది. ఈ నీటి రుచిలో తేడాలుంటున్నాయని నగరవాసులు పేర్కొంటున్న నేపథ్యంలో... కృష్ణా, గోదావరి జలాలను ‘సాక్షి’ బృందం సేకరించి ఐఎస్వో 9001:2008 గుర్తింపు పొందిన శ్రీమహీంద్ర ప్రయోగశాల(చైతన్యపురి)లో పరీక్షించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. గోదావరి ‘గాఢత’ అధికమే..! కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి 186 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు తరలిస్తున్న గోదావరి జలాల గాఢత కాస్త అధికంగా ఉన్నట్లు తేలింది. సాధారణంగా ‘ఐఎస్ 10500-2012’ ప్రమాణాల ప్రకారం లీటరు నీటి గాఢత 6.5 పీహెచ్‌కు మించరాదు. కానీ గోదావరి జలాల గాఢత 7.28 పీహెచ్‌గా నమోదైంది. ఇక నీటి కాఠిన్యత లీటరు నీటిలో 200 మిల్లీగ్రాములకు మించరాదు. కానీ కొద్దిగా ఎక్కువగా 202 మిల్లీగ్రాములుగా నమోదైంది. నీటిలో కరిగిన మట్టి, ఇసుక రేణువులు 200 మిల్లీగ్రాములకు మించరాదు.. కానీ 256 మిల్లీగ్రాములున్నట్లు తేలింది. లీటర్ నీటిలో సోడియం 38.42 మిల్లీగ్రాములు ఉంది. దీంతో ఈ నీరు తాగినపుడు రుచి కొంత కఠినంగా ఉన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. గోదావరి జలాలను శుద్ధిచేసేందుకు కొండపాక నీటిశుద్ధి కేంద్రం వద్ద పూర్తిస్థాయిలో ఫిల్టర్‌బెడ్స్ అందుబాటులోకి రాకపోవడంతో ఈ నీటి గాఢత కొంత అధికంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నీటివల్ల పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ ఉండవని... కాచి చల్లార్చి, వడబోసి తాగితే సురక్షితమేనని వైద్యులు చెబుతున్నారు. కృష్ణా నీళ్లు మృదువుగా.. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగ్య నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్నారు. ముందుగా నగర శివార్లలోని సాహెబ్‌నగర్ వరకు నీటిని చేర్చుతున్నారు. అక్కడి నుంచి మెయిన్ పైపులైన్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ నీటి గాఢత 6.25 పీహెచ్‌గా, కాఠిన్యత ప్రతి లీటరు నీటిలో 180 మిల్లీగ్రాములుగా నమోదైంది. దీంతో ఈ నీరు తాగడానికి మృదువుగా,తేలికగా, రుచిగా ఉన్నట్లు వాటిని వినియోగిస్తున్నవారు చెబుతున్నారు. ఇక ఈ నీటిలో కరిగిన మట్టి, ఇసుక రేణువులు కూడా ప్రమాణాల మేరకే ఉన్నాయి. ఫిల్టర్ చేసుకొని తాగాలి.. ‘‘నీటిలో కరిగే పలు పదార్థాలు, గాఢత, ఇతర లవణాలు అధికంగా ఉంటే రుచి మారుతుంది. తాగినపుడు నీళ్లు మందంగా అనిపిస్తాయి. అందువల్ల నల్లా నీటిని కాచి, చల్లార్చి, వడబోసుకోవడం లేదా ఫిల్టర్ చేసుకొని తాగితే జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్యాక్టీరియా నశిస్తుంది. నేరుగా తాగితే డయేరియా, జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు..’’ - డాక్టర్ బి.రవిశంకర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కృష్ణా, గోదావరి నీటిని పరీక్షించగా వచ్చిన ఫలితాలు.. పరీక్ష పరిమితి కృష్ణా నీరు గోదావరి నీరు గాఢత 6.50 పీహెచ్ 6.25 పీహెచ్ 7.28 పీహెచ్ కాఠిన్యత 200 మిల్లీగ్రాములు 180 మిల్లీగ్రాములు 202 మిల్లీగ్రాములు సోడియం ఉండరాదు లేదు 38.42 మిల్లీగ్రాములు సిలికా ఉండరాదు లేదు 5.48 మిల్లీగ్రాములు -
నదీ జలాల వినియోగానికే ప్రాజెక్టుల రీ డిజైన్
కాళేశ్వరం వద్ద ప్రాజెక్టుతో 180 టీఎంసీలు అందుబాటులోకి.. 'ప్రాణహిత'కు జాతీయహోదాపై కేంద్రం వివక్ష రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తోందని రోడ్లు,భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గత పాలకుల హయూంలో తెలంగాణ ప్రజలకు నిధుల కేటాయింపు, నీటి వినియోగం, నియామకాల విషయంలో జరి గిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. మంత్రి శనివారం ఆర్డీవో కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం వద్ద నిర్మించే ప్రాజెక్టుతో 180 టీఎంసీల గోదావరి నీరు వినియోగంలోకి వస్తుందన్నారు. ఈవిషయంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలోని ఏడు జిల్లాలలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి(ఢిల్లీ)వేణుగోపాలాచారి మాట్లాడుతూ ఉత్పత్తి ప్రాజెక్టుల పేరుతో హడావుడిగా కాలువల తవ్వకం చేపట్టి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేశారని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తదితరులున్నారు.