GODIWADA
-
కొడాలి కుమార్తెలకు జగన్ ఆశీస్సులు
గుడివాడ : శుక్రవారం జరిగిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కుమార్తెల నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అధినేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్.జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. కొడాలి నాని కుమార్తె విజయదుర్గకు కొడాలి నాని సోదరుడు చిన్న కుమార్తె శ్రీఅఖిలాండేశ్వరిదేవికి ఆయన ఆశీస్సులందజేశారు. జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్సీపీ ప్రముఖులు హాజరయ్యారు. గుడివాడకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు జగన్‌ను కలిసి కరచాలనం చేశారు. జగన్మోహన్రెడ్డి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధా,పేర్ని నాని, కైకలూరు నియోజక వర్గ పార్టీ కన్వీనర్ దూలం నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు తెనాలి పార్లమెంటు మాజీ సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటిశశిభూషణ్, పాలేటి చంటి, నందివాడ మండల పార్టీ కన్వీనర్ పెయ్యల ఆదాం, గుడివాడ పట్టణ పార్టీ మహిళా విభాగం కన్వీనర్ కాటాబత్తుల రత్నకుమారి, మున్సిపల్ కౌన్సిలర్లు అడపా బాబ్జీ, మేరుగు మరియకుమారి, గొర్ల శ్రీనివాసరావు, నెరుసు చింతయ్య, పొట్లూరి కృష్ణారావు వెంపల హైమావతితోపాటు జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులున్నారు. -
అమ్మమ్మ ఇంట్లో మనవడి దొంగతనం
గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : స్వయానా అమ్మమ్మ ఇంట్లో మనవడు లక్ష రూపాయల నగదు, ఆరు కాసుల బంగారం, పోస్టల్ సేవింగ్స్ పత్రాలు అపహరించిన సంఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకా రం.. స్థానిక సత్యనారాయణపురానికి చెం దిన మట్లపూడి ఆదమ్మ ఉదయం ఇంట్లో ఉంది. ఆమెతో ఉంటున్న ఆమె కుమార్తెలు ఆళ్ల వెంకటరమణ, సిరసాని సత్యవతి ఉదయం గుడికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన సత్యవతి కుమారుడు సిరసాని శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న ఆదమ్మ నోట్లో వస్త్రం కుక్కి, చేతులు కట్టివేశాడు. ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదు, పోస్టల్ సేవింగ్స్ పత్రాలు, ఆరు కాసుల బంగారు వస్తువులు తీసుకుని పరారయ్యాడు. గుడి నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు తల్లి సత్యవతి, పిన్ని వెంకటరమణమ్మలు ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. వారు అందించిన సమాచారంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. శ్రీనివాసరావు గతంలో కొంతకాలం పాటు పోస్టాఫీసులో ఎన్‌ఎంఆర్‌గా పనిచేశాడు. ప్ర స్తుతం ఓ ప్రైవేటు వైద్యుని వద్ద కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీలక్ష్మి, అత్త తణుకులో ఉంటారని, తరచూ డబ్బులు తెస్తేనే ఇంటికి రావాలని వారిద్దరూ ఒత్తిడి తేవడంతో ఈ చోరీకి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.