అమ్మమ్మ ఇంట్లో మనవడి దొంగతనం | Grandmother and grandchild in the house theft | Sakshi
Sakshi News home page

అమ్మమ్మ ఇంట్లో మనవడి దొంగతనం

Published Mon, Jun 9 2014 2:26 AM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM

Grandmother and grandchild in the house theft

గుడివాడ టౌన్, న్యూస్‌లైన్ : స్వయానా అమ్మమ్మ ఇంట్లో మనవడు లక్ష రూపాయల నగదు, ఆరు కాసుల బంగారం, పోస్టల్ సేవింగ్స్ పత్రాలు అపహరించిన సంఘటన ఆదివారం పట్టణంలో జరిగింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకా రం.. స్థానిక సత్యనారాయణపురానికి చెం దిన మట్లపూడి ఆదమ్మ ఉదయం ఇంట్లో ఉంది. ఆమెతో ఉంటున్న ఆమె కుమార్తెలు ఆళ్ల వెంకటరమణ, సిరసాని సత్యవతి ఉదయం గుడికి వెళ్లారు.

ఇదే అదనుగా భావించిన సత్యవతి కుమారుడు సిరసాని శ్రీనివాసరావు ఇంట్లో ఉన్న ఆదమ్మ నోట్లో వస్త్రం కుక్కి, చేతులు కట్టివేశాడు. ఇంట్లో ఉన్న లక్ష రూపాయల నగదు, పోస్టల్ సేవింగ్స్ పత్రాలు, ఆరు కాసుల బంగారు వస్తువులు తీసుకుని పరారయ్యాడు. గుడి నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు తల్లి సత్యవతి, పిన్ని వెంకటరమణమ్మలు ఆ దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. వారు అందించిన సమాచారంతో పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు.

శ్రీనివాసరావు గతంలో కొంతకాలం పాటు పోస్టాఫీసులో ఎన్‌ఎంఆర్‌గా పనిచేశాడు. ప్ర స్తుతం ఓ ప్రైవేటు వైద్యుని వద్ద కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీలక్ష్మి, అత్త తణుకులో ఉంటారని, తరచూ డబ్బులు తెస్తేనే ఇంటికి రావాలని వారిద్దరూ ఒత్తిడి తేవడంతో ఈ చోరీకి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement