Godowns construction
-
ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటు.. కేంద్రం కీలక నిర్ణయం..
ఆహార భద్రతను పటిష్ఠం చేయడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోదాంల ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల నిల్వ కోసం గోదాంలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వెచ్చించనున్నట్లు పేర్కొంది. దీంతో రైతుల ధాన్యం పాడవకుండా, కొనుగోళ్లలో రైతుల ఇబ్బందుల తప్పించడానికి సులభమవుతుందని ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గోదాంల ఏర్పాటుకు పలు మంత్రిత్వ శాఖల భాగస్వామ్యం కోసం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దేశంలో ఎంపిక చేసిన పది జిల్లాలలో ప్రయోగాత్మకంగా గోదాంల ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో గోదాంల ఏర్పాటు జరగనుందని తెలిపింది. దీంతో రానున్న ఐదేళ్లలో 700 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంపొందుతాయని పేర్కొంది. ప్రతి మండలంలో 2 వేల టన్నుల ధాన్యం నిలువచేసుకునేలా గోదాంలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలో ప్రస్తుతం 3,100 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నట్లు ఠాకూర్ తెలిపారు. కానీ 1,450 లక్షల టన్నుల ధాన్యం నిలువ చేసుకునే వెసులుబాటు మాత్రమే ప్రస్తుతం ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గోదాంల ఏర్పాటుతో ధాన్యం నిలువచేసుకునే సామర్థ్యం 2,150 లక్షల టన్నులకు చేరుతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని మించి ధాన్యం నిలువ చేసుకునే సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. ఇదీ చదవండి:Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి! -
40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనపు గోదాములు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం ఉన్న గోదాములకు అదనంగా మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు సామర్థ్యంతో మరిన్ని గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. వీటి నిర్మాణానికి ఇప్పటికే మార్కెటింగ్ శాఖ పూర్తిస్థాయి నివేదికను ఇచ్చిందని, త్వరలోనే ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపి పనులు వేగవంతం చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సోమవారం టీఆర్ఎస్ సభ్యులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ అడిగిన ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాలు చాలా చోట్ల గుర్తించడంతో భూముల సమస్య లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 4.17లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు 176 మాత్రమే ఉండేవని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17.20 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 452 గోదాములను నిర్మించినట్లు వివరించారు. దీంతోపాటు మరో 40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని, ప్రతి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
గోదాములు.. వైకుంఠ ధామాలు
సాక్షి, హైదరాబాద్ : ప్రతీ గ్రామంలో తప్పనిసరిగా వైకుంఠధామం (శ్మశానం) ఏర్పాటు, గోదాముల నిర్మాణం చేస్తామని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.శ్మశాన వాటికలకు స్థలం దొరకని చోట అవసరమైతే గ్రామపంచాయతీ ద్వారా కొనుగోలు చేయనున్నట్టు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుందని తెలిపారు.పల్లెల్లో కూడా తగిన వసతులతో స్వర్గధామాలు కూడా లేకపోవడంతో.. ఏర్పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి ఈ చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. సచివాలయంలో శుక్రవారం పీఆర్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామస్వరాజ్యం సాధనకు సంబంధించి, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల అవసరాలు, అభివృద్ధి పనులతో ముడిపడిన కీలకంగా మారిన పంచాయతీ రాజ్.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అత్యంత కీలకంగా మారిందన్నారు.ఈ నేపథ్యంలో ప్రతీ గ్రామపంచాయతీకి సొంత భవన నిర్మాణం, రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈజీఎస్ ద్వారా గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, చెట్ల పెంపకం, పారిశుధ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రతి ఊళ్లో గోదాంలు... గ్రామ స్థాయిలోనే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతీ ఊళ్లో గోదాంల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వీటితో పాటు ఫుడ్ ప్రాసె సింగ్ యూనిట్లను కూడా ఐకేపీ సెంటర్లు, గ్రూపుల ద్వారా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పనలో భాగంగా మూడునెలల పాటు వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించి, వివిధ ప్రైవేట్సంస్థలు, ఆయా రంగా లకు సంబంధించి అవకాశాలు ఉన్న చోట్ల ఉద్యోగ,ఉపాధి కల్పించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు.మిషన్ భగీరథలో భాగంగా వచ్చేనెలాఖరుకల్లా అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు.ఏప్రిల్ చివరకల్లా గ్రామాల్లోని అన్ని ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసేట్టు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్కిల్ బిల్డింగ్ నిర్మాణ మంజూరుపై తొలి సంతకం తనకు పెద్ద బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు తాను రుణపడి ఉంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నల్లగొండ పంచాయతీ రాజ్ సర్కిల్ బిల్డింగ్ నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.మంత్రి పదవి ఇస్తానని చెప్పి గతంలో చంద్రబాబు తనను మోసం చేశారని ఎర్రబెల్లి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో పొందని ఆనందం మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తాను పొందానన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి మల్లా రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,రాజయ్య, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి,శంకర్ నాయక్ , పెద్ది సుదర్శన్, గాంధీ, ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్, కంచర్ల భూపాల్‌రెడ్డి,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, గుండు సుధారాణి, పీఆర్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకూ పార్టీ సమన్వయ బాధ్యతలే.. మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగుతూ పార్టీ సంస్థాగత విషయాలు, రాష్ట్రస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయం వంటి వాటిపై ఇప్పటివరకు దృష్టి పెట్టిన తనకు పీఆర్ శాఖ వంటి ప్రజలతో నిత్యం సంబంధముండే గురుతర బాధ్య తను సీఎం కేసీఆర్ తనపై ఉంచారన్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎంకు, ఈ శాఖపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలున్నాయన్నారు. వాటిని కచ్చితంగా పూర్తిచేసే దిశగా తన కార్యాచరణ ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పష్టంచేశారు. విధులు,బాధ్యతలపై దృష్టి పెట్టాలి.. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా సర్పంచ్‌లకు అధికారాలతో విధులు, బాధ్యతలు కూడా ఉన్నందున వాటి నిర్వహణపై కొత్త సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. సర్పంచ్‌లు తమ తమ గ్రామాల్లోనే ఉంటూ రోజువారి విధులు నిర్వహించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చట్టంలో నిర్దేశించిన విధంగా నెలకోసారి గ్రామపంచాయతీ సమావేశం, మూడునెలలకోమారు సర్వసభ్య సమావేశం నిర్వహించడం, వంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని కోరారు. -
'సీఎం హామీని రెండు నెలల్లో పూర్తి చేశా'
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా 8 కొత్త మార్కెట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, రెండు నెలల్లో 13 వ్యవసాయ మార్కెట్లు జిల్లాకు ఇచ్చామని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామంలో సోమవారం రూ. 3 కోట్లతో నిర్మించే గోదాములకు హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటికి 25 వ్యవసాయ మార్కెట్లు ఉండగా మరో 13 నూతనంగా మంజూరు చేశామన్నారు. అందులో పెద్దపల్లి నియోజకవర్గంలో జూలపెల్లి, కాల్వశ్రీరాంపూర్ ఉందన్నారు. నియోజకవర్గంలో పదిన్నర కోట్లతో శంకుస్థాపన చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు గోదాముల్లో ధాన్యాన్ని ఆరు నెలల వరకు నిల్వ చేసినా వడ్డీ లేని రూ. 2లక్షల వరకు రుణాలను బ్యాంకు ఇస్తుందన్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులకు ప్రమాదబీమా సైతం రూ. లక్ష ఇవ్వడం జరగుతుందన్నారు. రైతు బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మత్తు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల పెన్షన్లు గత ప్రభుత్వం అందిస్తే మా ప్రభుత్వం 37లక్షల మందికి పెన్షన్లు అందించామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైస్‌మిల్లులు కరెంట్ లేకుండా జనరేటర్‌తో నడిచి నెలకు రూ. 3 లక్షలు నష్టం వాటిల్లుతుందని తమ దృష్టికి తేగా నేడు కరెంట్ కొరత లేని విధంగా అందిస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ 2 ఫేస్‌లో నెల రోజుల్లో టెండర్ పిలుస్తామని చెప్పడంతో పాటు మినీ ట్యాంకుబండ్, సీసీ రోడ్లు, మూత్రశాలలు, రైతులకు విశ్రాంతి గది నిర్మిస్తామని చెప్పారు. -
గోదాముల నిర్మాణానికి రూ.972.78 కోట్లు
హైదరాబాద్ : రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి రూ.972.78 కోట్ల రుణం మంజూరు చేసేందుకు నాబార్డు అంగీకరించిన నేపథ్యంలో 330 గోదాముల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సి.పార్థసారధి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెటింగ్ విభాగం ప్రతిపాదనల మేరకు నాబార్డు వేర్‌హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద రుణ వితరణ కు అంగీకరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 330 చోట్ల 17.075 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ద్యం వున్న గోదాములు నిర్మించనున్నారు. 2014-15లో నాబార్డు వేర్‌హౌజింగ్ స్కీం కింద 1037 ప్రాంతాల్లో 12.6 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో గోదాములు నిర్మిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ , సహకార శాఖలు సంయుక్త ప్రతిపాదనలు అందజేశాయి. అయితే తాము రుణం తిరిగి చెల్లించే పరిస్థితిలో లేమంటూ సహకార శాఖ చివరి నిముషంలో ప్రతిపాదనలను విరమించుకుంది. దీంతో గతంలో పంపిన ప్రతిపాదనలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం తిరిగి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసి నాబార్డుకు సమర్పించింది. రుణ మంజూరుకు నాబార్డు అంగీకరించడంతో ప్రభుత్వం నూతన గోదాముల నిర్మాణానికి తాజాగా పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. -
'తెలంగాణలో రూ.1000 కోట్లతో గోదాంల నిర్మాణం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో రూ. 21.5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాం కొరత ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. శుక్రవారం మార్కెటింగ్ శాఖపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. నాబార్డ్ సహకారంతో 1000 కోట్ల రూపాయలతో గోదాంల నిర్మాణం చేపడతామన్నారు. త్వరలో గోదాంల నిర్మాణం కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ లు తయారు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 76 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసినట్టు చెప్పారు. రైతులకు మూడు రోజుల్లో చెల్లింపులు అందేలా చర్యలు చేపడుతామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలో 51 మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరకు కూరగాయల అమ్మే సౌలభ్యం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.