'తెలంగాణలో రూ.1000 కోట్లతో గోదాంల నిర్మాణం' | Telangana Minister Harish Rao Speech on Godowns | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో రూ.1000 కోట్లతో గోదాంల నిర్మాణం'

Published Fri, Dec 19 2014 8:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM

Telangana Minister Harish Rao Speech on Godowns

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో రూ.  21.5 లక్షల మెట్రిక్ టన్నుల గోదాం కొరత ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. శుక్రవారం మార్కెటింగ్ శాఖపై  తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా  హరీష్ రావు మాట్లాడుతూ.. నాబార్డ్ సహకారంతో 1000 కోట్ల రూపాయలతో గోదాంల నిర్మాణం చేపడతామన్నారు. త్వరలో గోదాంల నిర్మాణం కోసం ప్రాజెక్ట్ రిపోర్ట్ లు తయారు చేయనున్నట్టు ఆయన తెలిపారు.

ఇప్పటివరకు 76 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసినట్టు చెప్పారు. రైతులకు మూడు రోజుల్లో చెల్లింపులు అందేలా చర్యలు చేపడుతామని చెప్పారు.  జీహెచ్ఎంసీ పరిధిలో త్వరలో 51 మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరకు కూరగాయల అమ్మే సౌలభ్యం కల్పిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement