Going Home
-
ఊరెళ్దాం.. పల్లె బాట పట్టిన మహానగరం..
ఊరెళ్దాం.. పల్లెందాలను ఆస్వాదిద్దాం . మట్టి పరిమళాలను ఆఘ్రాణిద్దాం.. సంక్రాంతి భోగి భాగ్యాలను ఆహ్వానిద్దాం.. రంగవల్లులు, గొబ్బెమ్మలతో మైమరిచిపోదాం.. గరికపోచలు, పిండిమొగ్గలు, రేగిపండ్లు, నవధాన్యాల కోసం బాల్యంలోకి పరుగులు పెడదాం.. పసందైన అరిసెలు, సకినాలు, లడ్డూలు, గారెలు ఆరగిద్దాం,... పొలంగట్లు, పంటచేలలో స్వేచ్ఛా విహంగాలై విహరిద్దాం.. పిల్లల్లో పిల్లలమై కేరింతలతో పతంగులు ఎగరేద్దాం ఊరూవాడా చుట్టేద్దాం.. దోస్తులతో ముచ్చటిద్దాం పల్లెకు పోదాం చలో చలో.. పండగ చేద్దాం చలో అంటూ .. పట్నం మూటా ముల్లే సర్దుకొని పల్లెకు బైలెల్లింది.. సంక్రాంతి, కనుమ తర్వాత తిరిగొస్తామంటూ బస్కెక్కింది.. సాక్షి, హైదరాబాద్: మహానగరం పల్లె బాట పట్టింది. ఏడాది పాటు కోవిడ్‌తో తీవ్ర ఒత్తిడికి గురైన నగరవాసులు సొంత ఊళ్లలో సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. గత వారం రోజులుగా సంక్రాంతి ప్రయాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. పండగ మరో రెండు రోజులే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు లక్షలాది మంది తరలి వెళ్లారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా సీట్లు, బెర్తుల సామర్ధ్యం మేరకే రైళ్లలో ప్రయాణం చేసేందుకు అనుమతినిస్తున్నారు. దీంతో నిర్ధారిత టికెట్లు లభించక లక్షలాది మంది వెయిటింగ్ లిస్టులోనే పడిగాపులు గాస్తున్నారు. చదవండి: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం! ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..4900 ► ఈసారి సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 4900 కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే సుమారు 3500 బస్సులకు ఇవి అదనం. ► ఇప్పటి వరకు సుమారు 1500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగనుంది. ► ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు, ట్రావెల్స్ సంస్థలకు చెందిన మ్యాక్సీ క్యాబ్‌లలోనూ జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 12 లక్షల మంది ఊళ్లకు వెళ్లినట్లు రవాణా వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: సంక్రాంతికి సొంతూరు వెళ్లడం కష్టమే! రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు.. ► నిర్ధారిత టికెట్ మేరకే అనుమతినివ్వడం వల్ల వెయిటింగ్ లిస్టు జాబితా భారీగా నమోదవుతోంది. దీంతో వివిధ మార్గాల్లో రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ► ఇప్పటి వరకు సుమారు 50 ప్రత్యేక రైళ్లను నడిపారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, మచిలీపట్నం,బెంగళూర్, చెన్నై, భువనేశ్వర్, తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ► కోవిడ్ నిబంధనల దృష్ట్యా రైళ్ల సంఖ్య పరిమితంగా ఉండడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. టికెట్లు ఉన్నవాళ్లనే రైల్వేస్టేషన్లకు అనుమతివ్వడం వల్ల సాధారణ ప్రయాణికులు జనరల్ బోగీల్లో వెళ్లలేకపోతున్నారు. గతేడాది కంటే రైళ్లలో వెళ్లే ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో సాధారణ డిమాండ్‌తోనే రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ► ‘జనరల్ బోగీల్లో 75 మంది కూర్చొంటే కనీసం మరో 75 మంది నించొని ప్రయాణం చేస్తారు. ప్రస్తుతం కోవిడ్ దృష్ట్యా అందుకు అనుమతి లేకపోవడం వల్ల సీట్ల సామర్ధ్యం మేరకే అన్ని రైళ్లు బయలుదేరుతున్నాయి.’ అని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఒక్క రోజే 500 ప్రత్యేక బస్సులు.. ► రైళ్లు పరిమితంగా ఉండడంతో బస్సులకు డిమాండ్ కనిపిస్తోంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో జనం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. ► సోమవారం ఒక్క రోజే 500 బస్సులను అదనంగా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ► ఉప్పల్, ఎల్బీనగర్, జేబీఎస్, ఎంజీబీఎస్, మెహదీపట్నం తదితర ప్రాంతాలు ప్రయాణికులతో పోటెత్తాయి. ► మరోవైపు సొంత కార్లు, బైక్‌లపైన సైతం తరలి వెళ్లారు.ఇమ్లీబన్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ -
అబ్బాయిలూ చూశారా? అమ్మాయి నమ్మింది!
‘ఉంది’ అని ఆమె నమ్ముతున్న ప్రపంచాన్ని ఆమెకు ఇవ్వగలమా? ‘గోయింగ్ హోమ్’ అనే ఐదు నిమిషాల లఘుచిత్రం పూర్తయ్యాక తెరపై కనిపించే ప్రశ్న ఇది. ఆమె అంటే స్త్రీ. ప్రధానంగా భారతీయ స్త్రీ. ఆమె నమ్ముతున్న ప్రపంచం అంటే? ఎలాంటి ప్రపంచం అది? ఎలాంటిదో తెలుసుకోవాలని ఉన్నా, లేకున్నా ఒక బాధ్యతగా ఈ ‘గోయింగ్ హోమ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌ని మీరు (ముఖ్యంగా అబ్బాయిలు, పురుషులు) చూసి తీరాలి. యూ ట్యూబ్‌లో ఈ చిత్రాన్ని ఇప్పటికే ఇరవై లక్షలమందికి పైగా చూశారు. వికాస్ బల్ దర్శకత్వంలో ‘వోగ్ ఇండియా’ సంస్థ ‘వోగ్ ఎంపవర్’ పేరిట తను నిర్వహిస్తున్న నిరంతర సామాజిక చైతన్య కార్యక్రమంలో భాగంగా ‘గోయింగ్ హోమ్’ చిత్రాన్ని సమర్పించింది. ఇందులో ఆలియా భట్ ప్రధాన పాత్రధారి. చిత్రం ఇలా మొదలవుతుంది: ఆలియా ఒంటరిగా కారులో ప్రయాణిస్తుంటుంది. అప్పటికే బాగా పొద్దుపోయి ఉంటుంది. చుట్టూ చీకటి. రోడ్డంతా నిర్మానుష్యం. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ వస్తుంది. తన కోసం ఆందోళనగా ఎదురుచూస్తున్న తల్లితో, ‘‘మామ్, ఇంకో పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను’’అని ఫోన్ చేసి చెబుతుంది ఆలియా. అలా చెప్పిన కొద్ది క్షణాలకే ఆమె కారు ఫెయిల్ అవుతుంది! ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ అవదు. అదే సమయానికి ఒక ఎస్.యు.వి. (పెద్ద కారు)లో ఐదుగురు యువకులు అటుగా వెళుతూ ఆలియాను చూసి కారు స్లో చేస్తారు. వారి కళ్లు మెరుస్తాయి. అందమైన అమ్మాయి! ఒంటరిగా... అసహాయంగా! ఇకనేం, కారును ఆ ఆమ్మాయి సమీపానికి తెచ్చి ఆపుతారు. కారులోంచి దిగకుండా తననే తినేసేలా చూస్తుంటారు. వాళ్ల ముఖాలు చూస్తుంటే వారి బుర్రల్లో ఏదో ప్లాన్ తయారవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే వారింకా కారు దిగకుండానే, ఆలియానే తిన్నగా నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చేస్తుంది! ‘‘ కారు ట్రబుల్ ఇచ్చింది, ప్లీజ్ ఓసారి చూస్తారా’’ అని అడుగుతుంది. ఆ మాటతో వాళ్లు కిందికి దిగి, ఆలియా కారు దగ్గరికి వస్తారు. వాళ్లకీ అది స్టార్ట్ అవదు. చివరికి ఆలియానే వారిని అడుగుతుంది తనను వారి కార్లో ఇంట్లో దింపమని! అలా అడుగుతున్నప్పుడు ఆమెలో ఎలాంటి సంకోచమూ ఉండదు. భయం ఉండదు. చాలా మామూలుగా, అదొక మామూలు విషయం అన్నట్లుగా అడుగుతుంది! వెంటనే ఆ ఐదుగురూ ఉత్సాహంగా ఆమెను కార్లో ఎక్కించుకుంటారు. ఇక అక్కడి నుంచి మనలో (వీక్షకులలో) టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఏ క్షణంలో వారు ఆ అమ్మాయిని ఏం చేస్తారో, ఎటు తీసుకుపోతారోనని. ఆలియాకు లేని టెన్షన్ మనకు ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం ఎన్ని అఘాయిత్యాల గురించి వినలేదు? ‘నిర్భయ’ ఘటన దగ్గర్నుంచి ఇవాళ్టి వరకూ ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కదా, అందుకు. ఆలియాకు ఎందుకు టెన్షన్‌గా లేదంటే ఆమె ఒక ప్రపంచాన్ని నమ్ముతోంది. ఆ ప్రపంచంలో పురుషులంతా మంచివారు. సో... తన కూల్‌గా ఉంది. ఇంతకీ చివరికి ఏమౌతుంది? ఆలియా నమ్మకం నిజం అవుతుంది. ఆ ఐదుగురూ ఆ అమ్మాయిని క్షేమంగా ఇంటి దగ్గర దింపుతారు. వారికి ఆమె థ్యాంక్స్ చెబుతుంది. చిరునవ్వుతో వారి దగ్గర సెలవు తీసుకుంటూ ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా కృతజ్ఞత తెలుపుతుంది. ఆఖరికి అందరికీ కలిపి ఓ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. తర్వాత స్క్రీన్‌పైన ముందు ప్రస్తావించుకున్న ప్రశ్న కనిపిస్తుంది... ఆమె నమ్ముతున్న ప్రపంచాన్ని ఆమెకు ఇవ్వగలమా? అని. లెదర్ స్కర్ట్‌లో ఆలియా ఐదుగురు అబ్బాయిలకూ బాగా సెక్సీగా కనిపిస్తుంటుంది. వారి కళ్లలోని కోరిక వీక్షకులకు కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయినా ఏం జరగదు. ‘రెచ్చిపోయే మనస్తత్వాలు ఉంటాయి తప్ప, రెచ్చగొట్టే దుస్తులు ఉండవు’ అని ఆలియా చేత ఇలాంటి దుస్తులు తొడిగించడం ద్వారా దర్శకుడు సమాజానికి చెప్పదలిచారు. రెచ్చిపోయే మనస్తత్వాలు ఉంటాయి తప్ప, రెచ్చగొట్టే దుస్తులు ఉండవు. - వికాస్ బల్, ‘గోయింగ్ హోమ్’ చిత్ర దర్శకుడు