టీడీపీకి గణేశ్‌రెడ్డి గుడ్‌బై
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : టీడీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. అధినేత చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గోక గణేశ్‌రెడ్డి పార్టీ పదవితోపాటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు, జిల్లా అధ్యక్షుడు నగేశ్‌కు పంపారు. ఆ పత్రులను మీడియూ వారికి విడుదల చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బాబు తీరును నిరసిస్తూనే పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ ద్రోహులుగా మిగలకుండా పార్టీని వీడాలని హితవు పలికారు. కాగా 1995లో టీడీపీలో చేరిన గోక గణేశ్‌రెడ్డి తలమడుగు మండల అధ్యక్షుడిగా, జిల్లా అధికార ప్రతినిధిగా, కార్యనిర్వాహక కార్యదర్శిగా, టెలికాం అడ్వైజరీ సభ్యుడిగా, రెండుసార్లు రైల్వే అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా, 1996,1998,2004,2009 ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలకంగా వ్యవహరించారు.