గోకులాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గోకులాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ పరమాత్ముడు బోధించిన ధర్మ, కర్మ సిద్ధాంతాలు మనమంతా ధర్మమార్గంలో నడిచేలా ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయన్నారు. ప్రజలంతా శాంతిసౌఖ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్ మంగళవారం ట్వీట్ చేశారు.
Greetings on the auspicious occasion of Gokulashtami. May Lord Krishna's timeless teachings of Dharma & Karma, inspire us to follow the path of virtue & righteousness. Wishing you all good health, peace & prosperity. #KrishnaJanmashtami
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 11, 2020
గవర్నర్ శుభాకాంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవద్గీత ద్వారా కృష్ణుడు బోధించిన సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సామరస్యపూర్వక సమాజ స్థాపనకై ఈ పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ ట్వీట్ చేశారు.
On occasion of Sri #krishnajanmashtami I extended my warm greetings & best wishes. This festival reminds us of eternal message of Lord Sri #Krishna through Bhagvad #Gita, affirming the foundation for building a harmonious society. pic.twitter.com/NrDBLQpCnj
— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) August 11, 2020