గోకులాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | CM YS Jagan Wishes People On Gokulashtami Over Twitter | Sakshi
Sakshi News home page

ప్రజలకు సీఎం జగన్‌, గవర్నర్‌ శుభాకాంక్షలు

Published Tue, Aug 11 2020 8:56 AM | Last Updated on Tue, Aug 11 2020 12:26 PM

CM YS Jagan Wishes People On Gokulashtami Over Twitter - Sakshi

సాక్షి, అమరావతి: గోకులాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణ పరమాత్ముడు బోధించిన ధర్మ, కర్మ సిద్ధాంతాలు మనమంతా ధర్మమార్గంలో నడిచేలా ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూనే ఉంటాయన్నారు. ప్రజలంతా శాంతిసౌఖ్యాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం జగన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు.

గవర్నర్‌ శుభాకాంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భవద్గీత ద్వారా కృష్ణుడు బోధించిన సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సామరస్యపూర్వక సమాజ స్థాపనకై ఈ పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్‌ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement