gokulastami
-
నాచగిరి.. శ్రావణ సందడి
ఓ వైపు సత్యనారాయణవ్రతాలు మరోవైపు ఉట్లోత్సవ వేడుకలు కిటకిటలాడిన పుణ్యక్షేత్రం నాచారంగుట్ట(వర్గల్):శ్రావణమాసం చివరి ఆదివారం వారాంతపు సెలవురోజు నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రావణమాసంలో పుణ్యక్షేత్రం సందర్శించి పూజల్లో పాల్గొంటే విశేష పుణ్యం లభిస్తుందని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయం నుంచే క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది. ఓవైపు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు, మరోవైపు సత్యనారాయణస్వామి వ్రతమండపంలో దంపతుల సామూహిక వ్రతాలు, గర్భగుడిలో నారసింహుని దర్శనార్థం బారులు తీరిన భక్తులతో నాచగిరిలో ఎటు చూసినా భక్తుల రద్దీ కన్పించింది. సాయంత్రం వరకు 80 సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిసాయి. ఉట్లోత్సవ సంబరం నాచగిరిలో గోకులాష్టమి వేడుకలు ఆదివారం సాయంత్రం ఉట్లోత్సవంతో ముగిసాయి. లక్ష్మీసమేతులైన స్వామి వారు ఉట్లోత్సవం తిలకించేందుకు పల్లకిపై ఆలయ ఉత్తర ద్వారం వైపు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఉట్లు కొట్టె కార్యక్రమం తిలకించారు. చప్పట్లు, కేరింతల మధ్య కొనసాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని ఆనందపరవశులయ్యారు. స్వామి వారిని దర్శించుకుని తరించారు. తులు -
గోవిందుని ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఆస్థానం ఘనంగా జరిగింది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారే ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆలయంలో జన్మాష్టమి వేడుకలు నిర్వహించటం సంప్రదాయం. ఇందులో భాగంగా రాత్రి 8 నుండి 10 గంటల నడుమ బంగారు వాకిలి చెంత ఉత్సవమూర్తులైన ఉగ్రశ్రీనివాసమూర్తి, శ్రీదేవి , భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణ స్వామికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ద్వాదశ తిరువారాధనం, అభిషేక నివేదన అనంతరం ఉగ్రశ్రీనివాసమూర్తి దేవేరులతో కూడి ఆనంద నిలయంలోకి వేంచేపు చేశారు. బంగారు సర్వభూపాల వాహనంలో వెన్నముద్ద ధరించిన శ్రీకష్ణస్వామిని శయనించినట్లుగా అలంకరించి దివ్యప్రబంధంతో పారాయణం నివేదించారు. సేవాకాలం ముగిసిన తర్వాత తులసితో అర్చించారు. ఇదే సందర్భంగా శ్రీ మద్భాగవతంలోని తృతీయ అధ్యాయంలోని శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని అర్చకులు పురాణ పఠనం, పూజా నివేదనలతో ఆస్థానం ఘనంగా నిర్వహించారు. అలాగే గోకులాష్టమిని పురస్కరించుకుని ఆలయం వెలుపల ఉన్నగోగర్భం ఉద్యానవనంలోని ఖాళీయ మర్థనునికి శాస్త్రోక్తంగా అభిషేకం, పూజలు, ఉట్లోత్సవం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం వేళ ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది. -
వీ వాంట్ లడ్డూస్..!
- శ్రీవారి లడ్డూల కోసం భక్తుల నిరసన - అదనపు లడ్డూలు ఇవ్వాలని నినాదాలు సాక్షి,తిరుమల: తిరుమలలో శ్రీవారి లడ్డూల కోసం బుధవారం భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్లో భక్తుల రద్దీని బట్టి రూ.25 ధరతో రూ.50కి రెండు, రూ.100కి నాల్గు చొప్పన లడ్డూలు విక్రయిస్తారు. ఉదయం వేళ సుమారు 2 వేల లడ్డూలు మాత్రమే కేటాయించారు. తర్వాత కౌంటర్ మూసివేశారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము క్యూలో నిరీక్షిస్తున్నా లడ్డూలు ఇవ్వకుండా కౌంటర్ మూసివేయటం తగదంటూ ఆలయం వద్ద నినాదాలు చేశారు. ‘‘వీ వాంట్ లడ్డూస్..వీ వాంట్ లడ్డూస్’’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తమై వారిని వారించి పంపించేశారు. రోజూ 3 నుండి 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నా డిమాండ్ రెట్టింపు స్థాయిలో ఉండటమే లడ్డూల కొరతకు ప్రధాన కారణంగా ఉందని ఆలయ అధికారులు చెబుతున్నారు. అదనపు లడ్డూలు తయారు చేయటానికి ఆలయ పోటులో స్థలం సరిపోదని చెబుతున్నారు. నేడు గోకులాష్టమి తిరుమలలో శ్రీవారి ఆలయంలో గురువారం గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. రాత్రి 8 నుండి 10 గంటల వరకు బంగారు వాకిలిలో వైదికంగా ఈ ఆస్థాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహిస్తారు. 26వ తేదిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప సమక్షంలో ఆలయ పురవీధుల్లో ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార ఆర్జిత సేవలు టీటీడీ రద్దు చేసింది.