Golconda police station
-
బడిలోనే అత్యాచారమా?
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేట్ పాఠశాలలో నాలుగున్నర ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన ఘటనపై హైకోర్టు స్పందించింది. అభంశుభం తెలియని చిన్నారిని పాఠశాల శానిటేషన్ సూపర్వైజర్ అత్యాచారం చేశాడని, సదరు స్కూల్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలన్న కేసులో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి స్కూళ్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని న్యాయ మూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి అభిప్రాయ పడ్డారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్నారిపై పాఠశాలలో పనిచేసే శానిటేషన్ సూపర్వైజర్ అత్యాచారం చేశాడని, ఈ పాఠశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మిర్ యూసఫ్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. శుక్రవారం దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ప్రతివాదులై న స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, రాష్ట్ర విద్యా శాఖ ము ఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు. అనం తరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
నైజీరియన్ తో సహజీవనం, విదేశీ మహిళ మృతి
నైజీరియా యువకుడితో సహజీవనం చేస్తున్న ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురువారం నగరంలోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... నైజీరియాకు చెందిన అల్బర్టో కోరర్ (38) అక్బర్పురాలో ఉంటూ యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ డిగ్రీ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు. కానగా, టూరిస్ట్ వీసాపై భారతదేశం వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన మార్గెరేట్ లిండా (53)కు ఏడాదిన్నర క్రితం అల్బర్టోతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ అక్బర్ పురాలో ఓ అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు. లిండా ఆస్తమా వ్యాధిగ్రస్తురాలు. కొంతకాలంగా ఆమె ఆస్తమాతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. గురువారం తాను ఉంటున్న ఫ్లాట్‌లోనే లిండా మృతి చెందింది. భవన యజమాని, నైజీరియన్ విద్యార్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లిండా అస్తమా డోస్ ఎక్కువగా తీసుకుందని అల్బర్టో పోలీసులకు తెలిపాడు. ఈ కేసులో పోలీసులు భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అస్తమాకు తీసుకున్న డోస్ ఎక్కువైందా...? లేక లిండాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా...? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. -
దూసుకొచ్చిన లారీ: కానిస్టేబుల్ మృతి
-
పోలీసులపైకి దూసుకొచ్చిన లారీ: కానిస్టేబుల్ మృతి
హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దేవ్‌గూడలో సోమవారం అర్ధరాత్రి పోలీసు చెక్‌పోస్టుపైకి లారీ దూసుకొచ్చింది. ఈ దుర్ఘటనలో రాహుల్ యాదవ్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతిచెందారు. కానిస్టేబుళ్లు సైదులు, పవన్, వీరేంద్రలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పవన్, వీరేంద్రల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వీరిని చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా సైదులుకు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ యాదగిరి రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.