Gold and silver jewelery
-
దివాళీ ఎఫెక్ట్ : తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే
ధంతేరస్, దీపావళి ఎఫెక్ట్ బంగారం, వెండి ధరలపై పడింది. దీంతో అక్టోబర్ 30న గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. భక్తులు ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి రోజున ధన త్రయోదశి (ధంతేరస్)ని జరుపుకుంటారు. ఈ ఏడాది నవంబర్ 2న ధంతేరస్ రానుంది. దీపావళి పండుగని ధంతేరస్ తో ప్రారంభింస్తారు. ముఖ్యంగా ఈ పండుగ పర్వదినం సందర్భంగా భక్తులు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలా కొనుగోలు చేసిన ఆభరణాల్ని పూజించడం వల్ల అవి రెట్టింపు అవుతాయని గాఢంగా నమ్ముతారు. అందుకే దనత్రయోదశి ప్రారంభం కంటే రెండు, మూడు రోజుల ముందు నుంచే ఈ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక మరో 3రోజుల్లో రానున్న ధనత్రయోదశి కారణంగా దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, కేరళ, వైజాగ్‌లలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బెంగళూరు సిటీలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.44,850 చేరగా.. 10 క్యారెట్ల 24 క్యారెట్ల బంగారం ధర రూ..110 తగ్గి రూ.48,930కి చేరింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.44,850కి చేరగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.48,930కి చేరింది. విశాఖలో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి..రూ.44,850కి చేరగా.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 తగ్గి రూ.48,930కి చేరింది. కేరళలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.44,850కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరిగి రూ.48,930కి చేరింది. ఇక హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లలో కిలో వెండి ధర 68,800 ఉండగా బెంగళూరులో రూ.64,600గా ఉంది. -
బంగారం ధరలు: మరింత ప్రియం!
Gold Rates Increase: బంగారం ధర ఆకాశాన్నంటింది. దీంతో కొనుగోళ్లు లేక అమ్మకందారులు గత 6 నెలల నుంచి అందోళన చెందుతున్నారు. దీనికి తోడు వివిధ షాపింగ్ మాల్స్‌లో రెడిమెడ్ బంగారు అభరణాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. శ్రావణమాసంలో అనేక పెండ్లిళ్లు శుభకార్యాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయని ఊహించిన అమ్మకందారులు నిరాశ చెందుతున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా, లాక్డౌన్, ఆన్‌సీజన్ తదితర కారణాలతో బంగారు అమ్మకాలు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో గత ఐదు రోజుల నుంచి జిల్లా బులియన్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 ఉంది. వెండి రూ. కిలో 64,100 నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడిరేటు పైకి చేరడంతో దేశీయ మార్కెట్లోను ఇదే ట్రెండ్ కొనసాగుతుందని బులియన్‌మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులు బంగారంపై తక్కువ రేటుకు రుణాలుస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు రూ. తులం 50వేలు చేరుకునే అవకాశం ఉందని అమ్మకందారులు చెబుతున్నారు. తగ్గిన అమ్మకాలు 2020 మార్చిలో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధి కోల్పొగా... కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు తనాఖ పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. మరికొంత మంది శుభకార్యాల కోసమని తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారు. దీంతో అమ్మకాలు ఆశించిన విధంగా జరుగక వ్యాపారులు అందోళన చెందుతున్నారు. పెరిగే అవకాశం ఉంది బులియన్ మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో రానున్న దసరా, దీపావళి పండుగకు 10గ్రాముల, 24 క్యారెట్ల బంగారం రూ. 50వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. పండుగలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ బాగా ఉంది. – చిలుక ప్రకాష్, బంగారం వ్యాపారి, కుమార్గల్లి అవసరానికే కొనుగోళ్లు కరోనా, ఈ మధ్య కాలంలో శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. షాపింగ్‌మాల్స్‌లలో రెడిమెడ్ బంగారు అభరణాలు లభిస్తుండటంతో అవసరానికి అక్కడ అభరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ వృత్తిని నమ్ముకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – శ్రీనివాస్, బంగారం అమ్మకందారుడు రెడీమేడ్ ఆర్నమెంట్స్‌పై మక్కువ బంగారాన్ని కొనుగోలు చేసి అభరణాలను తయారుచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది ఆర్నమెంట్ బంగారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడం అందోళన కలుగజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రిచాలి. పెరుగుతున్న ధరలను తగ్గించాలి. – శారద, గృహిణి, ప్రగతినగర్ చదవండి : యస్.. మేం ఆన్లైన్ బానిసలం -
తగ్గిన బంగారం ధరలు.. వారం రోజులుగా!
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. జులై 29, 30 తేదీల్లో పెరిగిన బంగారం.. జులై 31నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా గత రెండు రోజుల్లో బంగారం ధర మరింత తగ్గడంతో ఔత్సాహికులు బంగారం కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు.ఇండియన్ మార్కెట్లో శుక్రవారం 22క్యారెట్ల బంగారం ధర పై రూ.200 తగ్గగా, అదే 22 క్యారెట్ల బంగారం శనివారానికి రూ.750కి తగ్గడంతో రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచానా వేస్తున్నారు. ఇక శనివారం రోజు మార్కెట్ లో బంగారం, వెండిధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈరోజు 22 క్యారెట్ల 1గ్రాము బంగారం ధర రూ.4,570 ఉండగా.. 24 క్యారెట్ల 1 గ్రాముల బంగారం ధర రూ.4,670 గా ఉంది. ఈరోజు 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.36,560 ఉండగా.. 24 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర రూ.37,360గా ఉంది. ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700గా ఉంది. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లోని బంగారం ధరలు ♦హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,570 గా ఉంది. ♦విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,570గా ఉంది. ♦విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,570 గా ఉంది. ♦ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,900 గా ఉంది. ♦బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,660 గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,570గా ఉంది. ఇక దేశంలో వివిధ ప్రాంతాల్లోని వెండి ధరలు ♦ హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700గా ఉంది ♦ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,600 ♦ చెన్నైలో కిలో వెండి ధర రూ.71,700 ♦ ముంబైలో కిలో వెండి ధర రూ.66,600 ♦ కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.66,600 ♦ బెంగళూరులో కిలో వెండి ధర రూ.66,600 ♦ హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700 ♦ విజయవాడలో కిలో వెండి ధర రూ.71,700 -
సమ్మెకు విరామం
విజయనగరం మున్సిపాలిటీ/అర్బన్: సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా వ్యాప్తంగా బంగారం, వెండి ఆభరణాల వర్తకుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించారు. 12 రోజులుగా సమ్మెలో ఉన్న వారు శుక్రవారం నుంచి దుకాణాలు తెరిచేందుకు నిర్ణయించారు. ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూవలరీ ఫెడరేషన్(జెజెఎఫ్) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 10 వరకు సమ్మె కొనసాగుతున్నప్పటికీ ఏపీ బులియన్ మార్కెట్ నిర్ణయం మేరకు సమ్మెకు తాత్కాలిక విరమణ ప్రకటించినట్లు జిల్లా బంగారం, వెండి ఆభరణాల వర్తకుల సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు విజయ్‌కుమార్, ఎన్.వి.మాధవకృష్ణలు తెలిపారు. వ్యాపారులకు, వినియోగదారులకు భారంగా పరిణమించే 1 శాతం సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గించే వరకు పోరాటం సాగిస్తామని వెల్లడించారు. నిలిచిపోయిన రూ. 30కోట్ల లావాదేవీలు జిల్లా వ్యాప్తంగా 229 బంగారం, వెండి ఆభరణాల దుకాణాలు ఉండగా వాటిలో సగటున రోజుకు రూ. 2.5 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ లెక్కన గత 12 రోజుల్లో సుమారు రూ. 30 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయాయి. అంతేగాకుండా ఈ దుకాణాల్లో ఉపాధి పొందుతున్న సుమారు 1000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వాణిజ్య బంద్ సంపూర్ణం బంగారం, వెండి వర్తకుల ఆందోళనకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు గురువారం చేపట్టిన బంద్ సంపూర్ణమయింది. వాణిజ్య మండలి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపునకు జిల్లాలోని వివిధ పట్టణాల పరిధిలోని వ్యాపారులు బంద్ పాటించారు. ఈ బంద్‌వల్ల రూ. 25 కోట్లమేర వ్యాపార లావాదేవీలు స్తంభించాయి. జిల్లా కేంద్రంలో వాణిజ్యమండలి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ వాణిజ్యపన్నులశాఖ ఇటీవల జారీ చేసిన నిబంధనలపై వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బంగారు వర్తకుల ఆందోళనకు తమ సంఘీభావం ఉంటుందని తెలిపారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎం.నాయక్‌కు అందజేశారు. కలెక్టర్‌ను కలసిన వారిలో విజయనగరం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఎం.వి.చలం, కార్యదర్శి పి.కృష్ణ, కోశాధికారి ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కె.ప్రకాష్, మేకాకాశీ విశ్వేశ్వరుడు, ఆరిశెట్టి శ్రీనివాస్, రేపాక రామారావు, ముచ్చిరామలింగ, ఎలక్ట్ ప్రెసిడెంట్ పీ.ఎస్.సీ.నాగేశ్వరరావు, సహకార్యదర్శి కె.నరసింహం, కె.శ్రీనివాస్, జి.బ్రహ్మాజీ, పూర్వాధ్యక్షులు వి.చంద్రశేఖరరావు, క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఎల్‌నరసింహారావు, పూర్వాధ్యక్షులు పి.వి.రామారావు, ఫర్నిచర్ డీలర్స్ అధ్యక్షుడు ఏ.నరసింగరావు, వివిధ ట్రేడర్ల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.