gold hunt
-
‘బంగారం’లాంటి కలగన్నాడు.. మృత్యువు ఒడికి చేరాడు!
ప్రతీ మనిషి కల కంటాడు. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అవి నెరవేరితే.. సంతోషం. నెరవేరకపోతే!. అయితే.. ఆ కల ఆధారంగా అత్యాశకి పోతేనే అసలు సమస్య మొదలయ్యేది. ఆ ప్రయత్నంలో.. ప్రాణం కూడా పోవచ్చు. అలాంటిదే ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన. పేరాశకు పోయి ప్రాణం పొగొట్టుకున్నాడు ఇక్కడో పెద్దాయన. ఆయన వయసు ఏడు పదులపైనే. ఓరోజు నిద్రలో తన ఇంటి నేల కింద బంగారం ఉన్నట్లు కలగన్నాడట. అంతే.. అప్పటి నుంచి వంట గదికే పరిమితం అయ్యాడు. ఏడాది కాలం అదే పనిగా ఆ గదిలో తవ్వుకుంటూ పోయాడు. అలా.. 130 అడుగుల లోతుదాకా పోయాడు. ఈ మధ్యలో రాళ్లు అడ్డుపడితే డైనమెట్లను కూడా ఉపయోగించాడట. దీంతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిసింది. అది ప్రమాదకరమని హెచ్చరించినా.. అధికారులతో చెప్పించినా ఆ పెద్దాయన వినలేదు. చివరకు.. ఆ భారీ గొయ్యిలోనే అదుపు తప్పి పడిపోయి ప్రాణం విడిచాడు. దాదాపు 12 అంతస్థుల భవనం లోతు ఉన్న గొయ్యలో పడి తల పగిలి.. కాళ్లు చేతులు విరిగి అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అలా.. కలను నిజం చేసుకోవాలని.. అదీ ఈ వయసులో అత్యాశకు పోయి ప్రాణం విడిచిన ఆ పెద్దాయన పేరు జోయో పిమెంటా. ఊరు.. బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్. అందుకే.. పేరాశ ప్రాణాంతకం అని ఈయనలాంటి పెద్దలు ఊరికే అనలేదు. ఇదీ చదవండి: మాల్దీవులు-భారత్ వివాదం.. ఇదే మార్గం! -
తమిళనాడులోనూ బంగారం వేట
ఉత్తరప్రదేశ్‌లో వెయ్యి టన్నుల బంగారు నిధుల కోసం ఇప్పటికే తవ్వకాలు జరుపుతుండగా.. తాజాగా తమిళనాడు ప్రభుత్వం బంగారం కోసం వేట మొదలు పెట్టింది. యూపీలో మాదిరిగా తవ్వకాలు తతంగం మాత్రం కాదు. 400 కిలో బంగారం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీని విలువ 120 కోట్ల రూపాయలు. ఒక్కోటి నాలుగు గ్రాముల బరువుండేలా 22 కేరట్ల స్వచ్ఛమైన లక్ష బంగారు నాణేలు సేకరించనుంది. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు పథకాల కల్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలకు బంగారు నాణేలు అందజేయనున్నారు. వీటికోసం తమిళనాడు సాంఘిక సంక్షేమ పౌష్టికాహార భోజన పథకం డైరెక్టరేట్ బుధవారం టెండర్లు పిలిచింది. వచ్చే నెల 22 లోపు బంగారు నగల దుకాణదారులు, డీలర్లు టెండర్లు దాఖలు చేయవచ్చు. టెండరు పొందిన వారు 30 రోజుల్లోపు నాణేలు ప్రభుత్వానికి అందజేయాలి. కాగా ఇంత భారీ స్థాయిలో బంగారు నిల్వలు అందుబాటులో ఉండటం సాధారణ విషయం కాదని, ప్రభుత్వానికి నాణేలు అందజేయడం సవాల్‌తో కూడిన పనేనని మద్రాస్ బంగారు, వజ్రాల వర్తకుల సంఘం అధ్యక్షుడు జయంతిలాల్ చల్లాని అన్నారు.