ఏడోసారి జాతీయ అవార్డు అందుకున్న సంస్థ
వంటనూనెల తయారీ సంస్థ గోల్డ్‌డ్రాప్ తన ఉత్పత్తుల్లో నాణ్యాత ప్రమాణాలు పాటించినందుకు జాతీయ అవార్డు అందుకున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈమేరకు గోల్డ్‌డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియాకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ (సీఐటీడీ) అవార్డును ప్రదానం చేశారు. గోల్డ్‌డ్రాప్ సంస్థ ఈ అవార్డు అందుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం.అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించడం, పరిశుభ్రత, పోషకాల పరంగా మెరుగైన వంట నూనెగా గోల్డ్‌డ్రాప్ నిబద్ధత చాటుకుంటోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మితేష్ లోహియా మాట్లాడుతూ ‘మరోసారి ఈ జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. సంస్థ ఉత్పత్తుల్లో నాణ్యతను పాటించడం, కొత్తగా ఆవిష్కరణలు చేయడం పట్ల దృష్టి సారిస్తున్నాం’ అన్నారు.ఇదీ చదవండి: అందుబాటు ధరల్లో ఇళ్లు... విలువ రూ. 67 లక్షల కోట్లుఆహార ఉత్పత్తుల తయారీలో నిబంధనల ప్రకారం భద్రత, సరైన నాణ్యత పాటించే సంస్థలకు కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ ఇండియా (సీఐటీడీ) అవార్డులు అందిస్తోంది. గోల్డ్ డ్రాప్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1984 ఏప్రిల్ 28న స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఇది ఉత్పత్తులను తయారు చేస్తోంది. సన్‌ప్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్, పామోలిన్ నూనె.. వివిధ ఆయిల్ ఉత్పత్తులను అందిస్తోంది.