గుంజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: డీసీపీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రఖ్యాత పర్యాటక స్థలం కుతుబ్‌షాహీ సమాధుల వద్ద యువతీ యువకులతో పోలీసులు గుంజీలు తీయించిన ఉదంతంపై విచారణ జరుగుతోందని హైదరాబాద్ పశ్చిమ మండల డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. గుంజీలు తీయించడం మానవహక్కుల ఉల్లంఘనేనని, బాధితులు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, యూట్యూబ్ విజువల్స్ ఆధారంగానే ఆసిఫ్‌నగర్ ఏసీపీ వినోద్‌కుమార్‌కు విచారణ బాధ్యతలు అప్పగించామని తెలిపారు.