golkonda hotel
-
గొల్కొండ హోటల్లో కెనరా బ్యాంక్ గ్రహక్ మిలన్
-
గోల్కొండ హోటల్లో అసఫ్‌జాహీ ఫుడ్ ఫెస్టివల్
-
పండగ వచ్చిందే పిల్లా...
సరికొత్త వస్త్ర డిజైన్లతో క్వాయిష్ డిజైనర్ ఎగ్జిబిషన్ సిటీవాసుల ముందుకొస్తోంది. ఈ నెల 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్ కర్టన్‌రైజర్ శనివారం మాసబ్‌ట్యాంక్ హోటల్ గోల్కొండలో జరిగింది. ల్యాక్మే ఫ్యాషన్ వీక్ డిజైనర్లు వివేక్ కుమార్, సయంతన్ సర్కార్, అమల్‌రాజ్ సేన్‌గుప్తా తమ లేటెస్ట్ కలెక్షన్స్ ఇందులో ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలిపారు. విభిన్న డ్రెస్సులతో పాటు జ్యువెలరీ, షూస్, హోమ్ ఫర్నిషింగ్స్, డెకరేషన్ ఐటెమ్స్ వంటివన్నీ ఒకే చోట లభ్యమయ్యే ప్రదర్శన ఇదన్నారు. ఈ కర్టెన్‌రైజర్‌లో నిరుపేద చిన్నారులతో ఉగాది వేడుకలు, మహిళ సాధికారత సంబరాలను నిర్వహించారు. చిన్నారులు శారీల్లో సంప్రదాయ సిరులు ఒలికించారు. -
బ్యూటీ ట్రెండ్జ్
గోల్కొండ హోటల్లో శనివారం మిస్ ఇండియా ఎర్త్ తన్వీ వ్యాస్, టాలీవుడ్ భామ రిచాతనై తళుక్కుమన్నారు. హెల్త్, బ్యూటీ, ఫ్యాషన్ కాన్సెప్ట్‌తో వస్తున్న డైలీ ట్రెండ్జ్ వెబ్సైట్, మేగజైన్‌ను లాంచింగ్‌లో వీరు పాల్గొన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో అప్డేట్ అవుతున్న నయా ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడూ వెబ్సైట్ ద్వారా అందిస్తామంటున్నారు నిర్వాహకులు. హెల్దీ టిప్స్‌తో పాటు బ్యూటీ కాన్షియస్నెస్ కల్పిస్తామని చెబుతున్నారు. -
ఫ్యాషన్ దివాస్
తెలుగమ్మాయి పాటలో వెలిగిన అమ్మాయి... ర్యాంప్‌పై మెరిసింది. న్యూయార్క్‌కు చెందిన అంతర్జాతీయ బ్రాండ్ దివాజియా నగరంలో తమ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా... మాసబ్‌ట్యాంక్ గోల్కొండ హోటల్లో కర్టన్‌రైజర్ కార్యక్రమం నిర్వహించింది. సినీనటి సలోని సెంటరాఫ్ అట్రాక్షన్. ఈ ఈవెంట్లో బ్రాండ్‌కు చెందిన డిజైనర్ దుస్తులు, ఫుట్‌వేర్ , యాక్సెసరీస్‌ను మోడల్స్‌తో కలసి ఆమె ప్రదర్శించింది. - సాక్షి, సిటీ ప్లస్