Golla Kurma Yadavs Welfare
-
మావి ఓట్ల రాజకీయాలు కాదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలోని ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పం. గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజాసంక్షేమమే మా ధ్యేయం. మేం రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించినం. అప్పుడు ఏ ఎన్నికలున్నయి?..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తమది ఎన్నికల విధానం కాదని.. తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్నామని.. ఇప్పుడు పల్లెపల్లెనా పంట పొలాలు పచ్చగ మెరుస్తున్నాయని చెప్పారు. రూ.6 వేలకోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ, యూనిట్ ధర పెంపుపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మరింత పట్టుదలతో ఈ అభివృద్ధి కొనసాగిస్తామని పేర్కొన్నారు. గొర్రెల పెంపకం కోసం గ్రామాల్లో షెడ్ల నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. యాదవులు, గొల్ల కురుమలకు ఇప్పaటికే ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గొర్రెల సంఖ్యలో ఇప్పుడు తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుందన్నారు. గొర్రెలిచ్చిన సీఎం కేసీఆరే.. ఇప్పటిదాకా తామిచ్చిన గొంగడి కప్పుకుని, గొర్రెపిల్లను పట్టుకుపోయిన పాలకులను చూశామే తప్ప.. తమకు గొర్రెపిల్లలు ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆరేనని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు కొనియాడారు. గొల్లకుర్మల అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం ఈ దేశంలోనే కేసీఆర్ ఒక్కరేనని పేర్కొన్నారు. సీఎంను కలిసినవారిలో సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, నాయకులు కె.నర్సింహ, అరుణ్ కుమార్, నగేశ్, ప్రకాశ్ తదితరులు ఉన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన కురుమ సంఘం నేతలు -
‘మంత్రి తలసాని అడగకుండానే వరమిచ్చారు’
సాక్షి, సిద్దిపేట : గొల్ల, కుర్మలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అడగకుండానే వరమిచ్చారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంఘానికి కావలసిన నిధులు మంత్రి విడుదల చేయడం సంతోషకరమని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లలు పంపిణీ చేశారని తెలిపారు. అదే విధంగా విజయ డైరీ పాల ద్వారా రావాల్సిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల, కుర్మల అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేశారని తెలిపారు. పశు వైద్యశాలను ప్రస్తుతం ఉన్న చోటనే ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రైతులకు పశువులు, గొర్రె పిల్లల షెడ్డుల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామని, గొల్ల, కుర్మలు అందరూ కలిసి షెడ్లు నిర్మించుకోవాలని సూచించారు. -
గొల్లకురుమల సంక్షేమానికి పెద్దపీట
♦ గొల్లకురుమ యాదవ శంఖారావంలో హరీశ్‌రావు ♦ త్వరలో సబ్సిడీపై ఆవులు, బర్రెలు, మేకలు ♦ కేసీఆర్ మరో పదేళ్లు సీఎంగా ఉండాలని మల్లన్నను మొక్కండి సాక్షి, మెదక్: ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ నేతల మైండ్ బ్లాంక్ అవుతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గొల్లకురుమలకు బడ్జెట్లో రూ.4 వేల కోట్లతో గొర్రె పిల్లలు ఇస్తామంటే కాంగ్రెస్ నాయకులు హేళన చేశారని మండిపడ్డారు. గొర్రె పిల్లలే కాదు సీఎం కేసీఆర్ త్వరలో గొల్లకురుమ యాదవులకు ఆవులు, బర్రెలు, మేకలు సబ్సిడీపై అందజేయనున్నట్లు ప్రకటించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అఖిలభారత యాదవ సంఘం ఉపాధ్యక్షుడు మురళీయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన గొల్లకురుమ యాదవ శంఖారావ సభలో మంత్రి మాట్లాడారు. కులవృత్తులను బలోపేతం చేస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్లో అన్ని కులవృత్తులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారన్నారు. మేకలు, గొర్రెలకు వైద్యం చేసేందుకు వీలుగా ప్రతి నియోజకవర్గానికి సంచార అంబులెన్స్‌లు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు. గొల్లకురుమల యాదవుల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్ కలకాలం ఆరోగ్యంగా ఉండాలని, మరో పదేళ్లు అధికారంలో ఉండాలని మల్లన్న, బీరప్ప దేవుళ్లను ప్రార్థించాలని గొల్లకురుమ యాదవులను మంత్రి హరీశ్‌రావు కోరారు. గొల్లకురుమలను హేళన చేశారు శాసనసభలో కాంగ్రెస్ నాయకులు గొల్లకురు మలను హేళన చేసేలా మాట్లాడారని పశుసంవర్థక, పాడిపరిశ్రమశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు గొల్లకురు మల సంక్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దయామ యుడని, గొల్లకురుమల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. çసబ్బండవర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్ఎస్ మినహా రాష్ట్రంలో ఇక ఏ పార్టీ అధికారంలోకి రాదని మంత్రి జోస్యం చెప్పారు. విజయ డెయిరీ ద్వారా సేకరించే పాలకు వెనువెంటనే ప్రోత్సాహక డబ్బులు రూ.4 అందజేయనున్నట్లు తెలి పారు. కార్య క్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, చింతా ప్రభాకర్, బాబూ మోహన్, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సమాఖ్య చైర్మన్ రాజయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.