లక్నో-న్యూఢిల్లీ మధ్య త్వరలో డబుల్ డెకర్
లక్నోతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు సెప్టెంబర్ నెల నుంచి దేశరాజధాని నగరం ఢిల్లీకి డబుల్ డెకర్ రైలులో వెళ్లే అవకాశముంది. ఈ నెలలో ఈ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
లక్నో: లక్నో వాసులకు శుభవార్త. ఇక్కడి నుంచి దేశ రాజధాని నగరానికి త్వరలో డబుల్ డెకర్ రైలు నడపనుంది. ఇందుకోసం ఈ నెలలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఈ రైలు ప్రస్తుతం స్థానిక గోమతినగర్ స్టేషన్లో ఉం ది. దీనిని నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతి ఇచ్చారు. రైలు వేగపరిమితికి సంబంధించి రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ (ఆర్డీఎస్ఓ) కూడా అనుమతి లభిం చింది.
ఈ విషయమై డివి జనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ ప్రయోగాత్మక పరుగు నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఉత్తర రైల్వే విభాగానికి విన్నవించాం. ఆలమ్‌నగర్ సెక్షన్... ఢిల్లీ-లక్నో సెక్షన్ పరిధిలో ఉంది. అందువల్ల ఉత్తర రైల్వే విభాగం అనుమతి తప్పనిసరి. అందువల్ల అనుమతి లభించగానే ప్రయోగాత్మక పరుగు నిర్వహిస్తాం. ప్రయోగాత్మక పరుగును ఆగస్టులో ముగించి సెప్టెంబర్‌లో దీనిని పట్టాలు ఎక్కించాలని భావిస్తున్నాం’ అని అన్నారు. కాగా ఉదయం ఐదు గంటలకు లక్నోలో బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.