పుష్కరాలు పుణ్యఫలితాన్నిస్తాయి
జోగుళాంబను దర్శించుకున్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ
మానవపాడు/అలంపూర్‌రూరల్ : పుష్కరాలు పుణ్యఫలితాలను ఇస్తాయని, అందుకే భక్తులు పెద్దఎత్తున పుష్కరస్నానాలు ఆచరిస్తారని సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన కుటుంబ సమేతంగా అలంపూర్ ఆలయాలను దర్శించుకునేందుకు వచ్చారు. దీంతో ఆలయ ఈఓ గురురాజ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ టి. నారాయణరెడ్డి, టీడీపీ తాలూకా ఇన్చార్జ్ ఎస్. ఆంజనేయులు, సర్పంచ్ జయరాముడు ఆలయ అర్చకులతో కలసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. మొదటగా బాలబ్రహ్మేశ్వరుడిని దర్శించి అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం వారు శేషవస్త్రాలు, అమ్మవారి జ్ఞాపికలు, ప్రసాదాలను అందజేశారు.
భక్తులతో ఆత్మీయ పలకరింపు
అమ్మవారి, స్వామివారి దర్శనానికి క్యూలో నిలబడిన భ క్తులను ఎక్కడి నుంచి వచ్చారంటూ కరచలనం చేస్తూ ఆ ప్యాయంగా పలకరించారు. అనంతరం టీడీపీ కార్యకర్త లు విశ్వం, గోపాల్, స్వామి, రామును అభినందిస్తూ పు ష్కరాల్లో భక్తులకు సేవలందించాలని ప్రోత్సహించారు.
అభిమానులుగా మారిన భక్తులు
అమ్మవారి దర్శనం కోసం క్యూలో పెద్ద ఎత్తున నిల్చున్న భక్తులు ఒక్కసారి గా క్యూలో నుంచి బయటకు దూకి బాలకృష్ణను కలసిందేకు గుమిగూడారు. దీంతో ఒక్కసారిగా క్యూలైన్ ఖాళీ అయింది.
బాలకృష్ణకు స్వాగతం పలికిన మంత్రి
సోమశిల నుంచి సాక్షి బృందం : సప్తనదుల సంగమమైన సోమశిల పుష్కరఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం 11గంటల సమయంలో సోమశిల వీఐపీ ఘాట్‌కు చేరుకున్నారు. ఆయనకు మంత్రి జూపల్లి కృష్ణారావు సాదరంగా స్వాగతం పలికారు. పుణ్యస్నానాల సందర్భంగా సినీనటుడు బాలకృష్ణ భద్రత దృష్ట్యా గట్టి ఏర్పాట్లు చేయాలని అక్కడున్న పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈయనతోపాటు జెడ్పీటీసీ హన్మంతునాయక్, ఎంపీపీ నిరంజన్‌రావు, పెద్దకొత్తపల్లి ఎంపీపీ వెంకటేశ్వర్రావు, కొల్లాపూర్ సింగిల్‌విండో అధ్యక్షుడు తదితరులు ఉన్నారు.