ఎంజీయూ (నల్లగొండ రూరల్) : యూనివర్సిటీలో పూర్తిస్థాయిలో అధ్యాపకులను నియమించడం ద్వారా మెరుగైన ఫలితాలు లభిస్తాయని న్యాక్ బృందం చైర్మన్ కౌశిక్ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలను న్యాక్ బృందం బుధవారం పరిశీలించింది. అనంతరం యూనివర్సిటీ అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త కోర్సులు, కొత్త భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. యూజీసీ గ్రాంట్ కోసం తగిన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. యూనివర్సిటీ ఏర్పడిన ప్రథమార్ధంలోనే న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నించడం అభినందనీయమని పేర్కొన్నారు. యూనివర్సిటీ పరిస్థితులను వీసీ అల్తాఫ్‌హుస్సేన్, రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్ వివరించారు. ఈ సమావేశంలో రవి, శ్రీదేవి, అన్నపూర్ణ, అరుణప్రియ, అంజిరెడ్డి, ప్రశాంతి, జయంతి తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపకుల నియామకంతో మెరుగైన ఫలితాలు
Published Wed, Aug 24 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
Advertisement