నిలిచిన గూడ్స్ రైలు: రైళ్ల రాకపోకలకు అంతరాయం
మెదక్: మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట సమీపంలో గూడ్స్ రైలు సాంకేతికలోపంతో నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో గూడ్స్ రైలు సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
సాంకేతిక లోపాన్ని సరి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గూడ్స్ రైలు నిలిచిపోవడంతో ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. దాంతో ఆ రైళ్లలోని ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.