ఆసుస్ కొత్త ట్యాంగో 3డీ స్మార్ట్ ఫోన్
లాస్ వెగాస్ :. తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఆసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 3డీ ట్యాంగో టెక్నాలజీ ఆధారిత జెన్ ఫోన్ ఏఆర్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను బుధవారం విడుదల చేసింది. వినియోగదారులకు అగ్ మెంటెడ్ ,వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించనుంది. ఇండోర్ మ్యాపింగ్, అగ్ మెంటెడ్ రియాలిటీ టాంగో కంప్యూటింగ్ ప్లాట్ ఫాం లో ఇది రెండవ మొబైల్. ట్యాంగో టెక్నాలజీ ఆధారిత మొదటి డివైస్ ను గత ఏడాది చైనా సంస్థ లెనోవో ఫ్యాబ్ 2 లాంచ్ చేసింది. మన చుట్టూ ఉన్న పరిసరాలను 3డీ స్కానింగ్ చేయగలగడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు
జెన్ ఫోన్ ఏఆర్ ఫీచర్స్:
ఆండ్రాయిడ్ నౌగట్ 7.0
5.7- అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్
క్వాల్కం స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్,
8జీబీర్యామ్
23 ఎంపీ కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
లాస్ వెగాస్ లో నిర్వహించిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో సీఈఎస్-2017లో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్టు అసుస్ ఛైర్మన్ జానీ షిస్ తెలిపారు. టాంగో, గూగుల్ డే డ్రీమ్ ఆధారిత మొబైల్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ రంగంలో ఇది మరో సంచలనమని మార్కెటింగ్ చీఫ్ ఎరిక్ హెర్మాన్ సన్ చెప్పారు. మరోవైపు డజన్ల కొద్దీ ట్యాంగో ఆధారిత యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో లీడర్ జానీ లీ వెల్లడించారు.