google founder
-
నీతోని నాకు కుదరదు, గుడ్‌బై!
వివాహా బంధం విచ్చినమైతే చివరకు తీసుకునేది విడాకులే. అయితే సెలబ్రిటీల విడాకుల వ్యవహరం ఎప్పుడూ చర్చనీయాంశమే. బ్లూంబర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న వ్యక్తి విడాకులకు సిద్ధమయ్యాడు. దీంతో భరణం ఎంత చెల్లించవ్చు? ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనే అంశం చర్చకు వస్తోంది. గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సెర్జెబ్రిన్ ఈ ఏడాది జనవరిలో విడాకులకు దరఖాస్తు చేశారు. తన భార్య నికోల్ షెనహాన్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. తమిద్దరి మధ్య పరిష్కరించుకోలేనంతగా భేదాభిప్రాయాలు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ దంపతులకు రెండేళ్ల కూతురు ఉండగా.. కోర్టును జాయింట్ కస్టడికి ఇవ్వాలని కోరారు. సెర్జెబ్రిన్, నికోల్ షనహాన్లు 2015 నుంచి డేటింగ్లో ఉన్నారు. చివరకు 2018 నవంబరులో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. అయితే కాపురం నాలుగేళ్లకు మించి పటిష్టంగా ఉండలేక పోయింది. ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపడంతో వ్యవహరాం విడాకులకు దారి తీసింది. న్యాయవాదిగా పని చేసిన నికోల్ షెనహాన్ ఎంట్రప్యూనర్గానూ పలు ప్రాజెక్టులు చేపట్టారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం సెర్జెబ్రిన్ ఆస్తుల విలువ 96 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో భరణంగా సెర్జెకు భారీ మొత్తం దక్కవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఈ దంపతులు భారీగా ఉమ్మడి ఆస్తులు కొనుగోలు చేశారు. వాటిని సైతం చెరి సమానంగా పంచాల్సి ఉంటుంది. అయితే కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఆస్తుల పంపకం వివరాలు ఇంకా బహిర్గం కాలేదు. ఇటీవల కాలంలో జెఫ్‌బేజోస్ - మెకెంజీ స్కాట్, బిల్‌గేట్స్ - మిలిందా , ఎలాన్‌మస్క్ - రైలీ దంపతుల విడాకులు కాస్ట్లీ వ్యవహారంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుటు వాటి జాబితాలో సెర్జెబ్రిన్ - నికోల్ షెనహాన్ చేరవచ్చని అమెరికన్ మీడియా అంచనా వేస్తోంది. చదవండి: మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా! కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు! -
గూగుల్ పుట్టినరోజు కానుక...
గూగుల్ మరో కొత్త సెర్చ్ ఇంజన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. వెబ్ యూజర్స్ దీని ద్వారా మరింత త్వరగా కావలసినవాటిని వెతుక్కోవడానికి ఈ సెర్చ్ ఇంజన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంటర్నెట్ యూసేజ్‌లో మార్పులు తీసుకురావాలని భావించిన గూగుల్, సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కొన్నిసెర్చ్ టూల్స్ కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఉండటంతో, సంప్రదాయంగా వస్తున్న బూలియన్ లేదా కీవర్డ్ బేస్ట్ సిస్టమ్ వాడకం క్రమేపీ తగ్గుతోంది. అందుకు కారణం... ఇచ్చిన పదాలతో కావలసిన కాన్సెప్ట్ మ్యాచ్ కాకపోవడమే. హమ్మింగ్‌బర్డ్ ద్వారా గూగుల్ కంపెనీ పడిన శ్రమకు తగిన ఫలితం లభించిందని సింఘాల్ అన్నారు. గూగుల్ వ్యవస్థాపకులైన ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్... మెన్లో పార్క గ్యారేజ్ నుంచే తమ కొత్త సెర్చ్ ఇంజన్ని ప్రారంభించారు. 1998లో ఏ విధంగా సెర్చ్ చేశామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పెద్ద కంప్యూటర్ని ముందుగా బూట్ చేసి, మోడెమ్‌ని ఆన్ చేసి, కొన్ని కీవర్డ్సని టైప్ చేసి, వెబ్సైట్లకి సంబంధించిన పది బ్లూ లింక్‌లను ఓపెన్ చేస్తేనే కాని కనెక్ట్ కాలేకపోయేవారమని సింఘాల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ప్రపంచం చాలా మారింది. ఇప్పుడు బిలియన్ల కొద్దీ ప్రజలు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. వెబ్ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మనకు కావలసిన ఏ అంశాన్నయినా పాకెట్లో ఉన్న డివైస్ మీద చిన్న క్లిక్ ద్వారా పొందుతున్నాం’ అని... సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్ అన్నారు. గూగులా? మజాకానా? హోమ్ పేజీ తయారు చేయడానికే 200 మంది పనిచేశారంటేనే అర్థం అవుతోంది... గూగుల్ అందరికీ ఎందుకు చేరువయ్యిందనేది.