గూగుల్‌ పుట్టినరోజు కానుక... | Google releases new search engine | Sakshi
Sakshi News home page

గూగుల్‌ పుట్టినరోజు కానుక...

Published Fri, Sep 27 2013 3:45 PM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

గూగుల్‌ పుట్టినరోజు కానుక...

గూగుల్‌ పుట్టినరోజు కానుక...

గూగుల్‌ మరో కొత్త సెర్చ్ ఇంజన్‌ని కొత్తగా ప్రవేశపెట్టింది. వెబ్‌  యూజర్స్ దీని ద్వారా మరింత త్వరగా కావలసినవాటిని వెతుక్కోవడానికి ఈ సెర్చ్ ఇంజన్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంటర్నెట్‌ యూసేజ్‌లో మార్పులు తీసుకురావాలని భావించిన గూగుల్‌, సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కొన్నిసెర్చ్ టూల్స్ కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఉండటంతో, సంప్రదాయంగా వస్తున్న బూలియన్‌ లేదా కీవర్డ్  బేస్ట్ సిస్టమ్‌ వాడకం క్రమేపీ తగ్గుతోంది.

 

అందుకు కారణం... ఇచ్చిన పదాలతో కావలసిన కాన్సెప్ట్ మ్యాచ్‌ కాకపోవడమే. హమ్మింగ్‌బర్డ్ ద్వారా గూగుల్‌ కంపెనీ పడిన శ్రమకు తగిన ఫలితం లభించిందని సింఘాల్‌ అన్నారు. గూగుల్‌ వ్యవస్థాపకులైన ల్యారీ పేజ్‌, సెర్జీ బ్రిన్‌... మెన్లో పార్‌‌క గ్యారేజ్‌ నుంచే తమ కొత్త సెర్చ్ ఇంజన్‌ని ప్రారంభించారు. 1998లో ఏ విధంగా సెర్చ్ చేశామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పెద్ద కంప్యూటర్‌ని ముందుగా బూట్‌ చేసి, మోడెమ్‌ని ఆన్‌ చేసి, కొన్ని కీవర్‌‌డ్సని టైప్‌ చేసి, వెబ్‌సైట్లకి సంబంధించిన పది బ్లూ లింక్‌లను ఓపెన్‌ చేస్తేనే కాని కనెక్ట్ కాలేకపోయేవారమని సింఘాల్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు.
 
‘ప్రపంచం చాలా మారింది. ఇప్పుడు బిలియన్ల కొద్దీ ప్రజలు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. వెబ్‌ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మనకు కావలసిన ఏ అంశాన్నయినా పాకెట్‌లో ఉన్న డివైస్‌ మీద చిన్న క్లిక్‌ ద్వారా పొందుతున్నాం’ అని... సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ సింఘాల్‌ అన్నారు. గూగులా? మజాకానా? హోమ్‌ పేజీ తయారు చేయడానికే 200 మంది పనిచేశారంటేనే అర్థం అవుతోంది... గూగుల్‌ అందరికీ ఎందుకు చేరువయ్యిందనేది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement