amit singhal
-
వైస్‌ప్రెసిడెంట్‌ను వెళ్లిపొమ్మన్న దిగ్గజ కంపెనీ
కార్యాలయంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ విభాగ వైస్‌ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్‌పై ఉబెర్ వేటు వేసింది. గత నెలలో సింఘాల్ ఉబెర్‌లో చేరారు. అంతకుముందు సింఘాల్ గూగుల్, ఆల్ఫాబెట్ లాంటి కంపెనీల్లో పని చేశారు. సింఘాల్ ఆ కంపెనీల్లో నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆల్ఫాబెట్ కంపెనీ అతనిపై ఉన్న ఆరోపణలను ఉబెర్ దృష్టికి తీసుకువచ్చింది. దీంతో సింఘాల్‌ను పదవి నుంచి ఎలా తప్పించాలనే విషయంపై మల్లగుల్లాలు పడ్డ ఉబెర్.. చివరికి కంపెనీలో మహిళలపై జరగుతున్న వేధింపులు, గతంలో పనిచేసిన కంపెనీల్లో ఉన్న ఆరోపణలపై ప్రశ్నించినట్లు ఓ టెక్నాలజీ వెబ్సైట్ పేర్కొంది. ఉబెర్ సంధించిన సూటి ప్రశ్నలకు అమిత్ సమాధానం ఇవ్వకపోవడంతో పదవి నుంచి వైదొలగి, ఉద్యోగానికి రాజీనామా చేయాలని సూచించినట్లు చెప్పింది. ఈ విషయంపై స్సందించిన ఉబెర్.. సింఘాల్ కంపెనీని వదిలివెళ్లినట్లు చెప్పింది. అందుకు సంబంధించిన మిగతా విషయాలను వెల్లడించలేదు. -
అమిత్ సింఘాల్ రిటైర్.. గూగుల్‌కు తీరని లోటు
శాన్ఫ్రాన్సిస్కో: గూగుల్ సంస్థలో టెక్నాలజీని అభివృద్ధి పరచడంలో 'అల్పాబెట్' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్(48) పాత్ర మరువలేనిది. అమిత్ ఈ నెల 26న పదవి విరమణతో గూగుల్‌కు వీడ్కోలు పలకనున్నారు. అమిత్ నిష్క్రమణ తమ సంస్థకు తీరని లోటుగా గూగుల్ భావిస్తోంది. ప్రస్తుతం ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్‌లో పనిచేస్తున్న జాన్ గియానేంద్రియా, అమిత్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. భారత్‌కు చెందిన సింఘాల్ 16 ఏళ్ల కిందట గూగుల్లోకి అడుగు పెట్టారు. అమిత్ పదవి విరమణ అనంతరం.. తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్టు తెలిపారు. కార్నెల్ నుంచి ఆయనకు కంప్యూటర్ సైన్స్‌లో డాక్టరేట్ లభించింది. గూగుల్లోకి రాకముందు ఏటీ అండ్ టీ ల్యాబ్స్‌లో ఆయన పనిచేశారు. గూగుల్‌లో చేరిన కొంతకాలంలోనే అల్గారిథమ్‌లను తిరిగిరాయడంలో తొలి విజయం సాధించారు అమిత్. గూగుల్ సెర్చ్ ఇంజిన్ రూపొందించడంలో భాగంగా స్పెల్ చెక్ వంటి ఫీచర్లతో అమిత్ ఎంతగానో కృషి చేశారు. -
గూగుల్ పుట్టినరోజు కానుక...
గూగుల్ మరో కొత్త సెర్చ్ ఇంజన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. వెబ్ యూజర్స్ దీని ద్వారా మరింత త్వరగా కావలసినవాటిని వెతుక్కోవడానికి ఈ సెర్చ్ ఇంజన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇంటర్నెట్ యూసేజ్‌లో మార్పులు తీసుకురావాలని భావించిన గూగుల్, సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. కొన్నిసెర్చ్ టూల్స్ కొద్దిగా కాంప్లికేటెడ్‌గా ఉండటంతో, సంప్రదాయంగా వస్తున్న బూలియన్ లేదా కీవర్డ్ బేస్ట్ సిస్టమ్ వాడకం క్రమేపీ తగ్గుతోంది. అందుకు కారణం... ఇచ్చిన పదాలతో కావలసిన కాన్సెప్ట్ మ్యాచ్ కాకపోవడమే. హమ్మింగ్‌బర్డ్ ద్వారా గూగుల్ కంపెనీ పడిన శ్రమకు తగిన ఫలితం లభించిందని సింఘాల్ అన్నారు. గూగుల్ వ్యవస్థాపకులైన ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్... మెన్లో పార్క గ్యారేజ్ నుంచే తమ కొత్త సెర్చ్ ఇంజన్ని ప్రారంభించారు. 1998లో ఏ విధంగా సెర్చ్ చేశామో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. పెద్ద కంప్యూటర్ని ముందుగా బూట్ చేసి, మోడెమ్‌ని ఆన్ చేసి, కొన్ని కీవర్డ్సని టైప్ చేసి, వెబ్సైట్లకి సంబంధించిన పది బ్లూ లింక్‌లను ఓపెన్ చేస్తేనే కాని కనెక్ట్ కాలేకపోయేవారమని సింఘాల్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ప్రపంచం చాలా మారింది. ఇప్పుడు బిలియన్ల కొద్దీ ప్రజలు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. వెబ్ వాడకం బాగా పెరిగింది. ఇప్పుడు మనకు కావలసిన ఏ అంశాన్నయినా పాకెట్లో ఉన్న డివైస్ మీద చిన్న క్లిక్ ద్వారా పొందుతున్నాం’ అని... సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్ అన్నారు. గూగులా? మజాకానా? హోమ్ పేజీ తయారు చేయడానికే 200 మంది పనిచేశారంటేనే అర్థం అవుతోంది... గూగుల్ అందరికీ ఎందుకు చేరువయ్యిందనేది.