వైస్‌ప్రెసిడెంట్‌ను వెళ్లిపొమ్మన్న దిగ్గజ కంపెనీ
కార్యాలయంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇంజనీరింగ్ విభాగ వైస్‌ప్రెసిడెంట్ అమిత్ సింఘాల్‌పై ఉబెర్ వేటు వేసింది. గత నెలలో సింఘాల్ ఉబెర్‌లో చేరారు. అంతకుముందు సింఘాల్ గూగుల్, ఆల్ఫాబెట్ లాంటి కంపెనీల్లో పని చేశారు. సింఘాల్ ఆ కంపెనీల్లో నుంచి బయటకు వచ్చిన కొద్దిరోజుల్లోనే ఆల్ఫాబెట్ కంపెనీ అతనిపై ఉన్న ఆరోపణలను ఉబెర్ దృష్టికి తీసుకువచ్చింది.
దీంతో సింఘాల్‌ను పదవి నుంచి ఎలా తప్పించాలనే విషయంపై మల్లగుల్లాలు పడ్డ ఉబెర్.. చివరికి కంపెనీలో మహిళలపై జరగుతున్న వేధింపులు, గతంలో పనిచేసిన కంపెనీల్లో ఉన్న ఆరోపణలపై ప్రశ్నించినట్లు ఓ టెక్నాలజీ వెబ్‌సైట్ పేర్కొంది. ఉబెర్ సంధించిన సూటి ప్రశ్నలకు అమిత్ సమాధానం ఇవ్వకపోవడంతో పదవి నుంచి వైదొలగి, ఉద్యోగానికి రాజీనామా చేయాలని సూచించినట్లు చెప్పింది. ఈ విషయంపై స్సందించిన ఉబెర్.. సింఘాల్ కంపెనీని వదిలివెళ్లినట్లు చెప్పింది. అందుకు సంబంధించిన మిగతా విషయాలను వెల్లడించలేదు.