సమస్యల పరిష్కారం
దేవరకద్ర : మండలంలోని గోపన్‌పల్లిలో మంగళవారం పల్లెవికాసం కా ర్యక్రమం నిర్వహించారు. జెడ్పీటీసీ లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓ భాగ్యల క్ష్మీతో పాటు పలువురు మండల అధికారులు గ్రామంలోని పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఇంకా విరివీగా మొక్కలు నాటి హరితహారాన్ని విజ యవంతం చేయాలని ఎంపీడీఓ కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తన వంతు ప్రయత్నంగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనీఖీ చేసి రికార్డులను పరిశీలించా రు. పిల్లల సంఖ్య పెంచడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ శ్రీని వాసరెడ్డి, ఎంపీటీసీ బాల్‌రాజు, సర్పంచ్ ఫకిరన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ సులోచన తదితరులు పాల్గొన్నారు.
అడ్డాకుల : మండల పరిధిలోని మూసాపేటలో మంగళవారం పల్లెవికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి పెద్దమ ందడి శ్రీనివాసులు, ఎంఈఓ నాగయ్య, స్థానిక సర్పంచ్ భాస్కర్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు శెట్టిశేఖర్లు గ్రామంలో పర్యటించా రు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేశారు. పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి వివిధ సమస్యలపై చర్చించారు. వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలపై ఏఓ శ్రీనివాసులు గ్రామస్తులకు అవగహన కల్పించారు. కార్యక్రమంలో సాక్షరభారత్ కోఆర్డినేటర్ రవీందర్‌నాయక్, కార్యదర్శులు పాండురంగయ్య, కుర్మ య్య, క్షేత్ర సహాయకుడు ప్రదీప్‌రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.