గూర్ఖాల్యాండ్ ఉద్యమం ఉధృతం
డార్జిలింగ్: గూర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం కోరుతూ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చేపట్టిన ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వ, గూర్ఖాల్యాండ్ ప్రాదేశిక పరిపాలనా కార్యలయాలను నిరవధికంగా మూసివేయిస్తూ జూన్ 12 నుంచి జీజేఎం డార్జి్జలింగ్లో బంద్ చేపట్టింది.
తాజాగా అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు మిత్రపక్షమైన గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (జీఎన్ఎల్ఎఫ్) ఆ పార్టీతో సంబంధాలను తెంచుకుని జీజేఎంతో చేతులు కలిపింది. పరిస్థితులను సాధారణ స్థితికి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 600 మంది పారామిలిటరీ సిబ్బందిని మంగళవారమే డార్జి్జలింగ్కు పంపింది.