‘నైజాంను మరిపిస్తున్న కేసీఆర్’
ముకరంపుర: సీఎం కేసీఆర్ పాలన నైజాం, రజాకార్లను మరిపిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జైల్లో పెటై్టనా ప్రాజెక్టులు కడుతామని మంత్రులు పేర్కొనడం దౌర్జన్య పాలనకు నిదర్శనమన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్, గౌరవెల్లి, గండిపల్లిలో ఇష్టారీతిన భూసేకరణ చేపడుతున్నారని, నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. ఎంసెట్ –2 పేపర్ లీకేజీకి ప్రభుత్వమే బాద్యత వహించాలన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు శుక్రవారం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని కరీంనగర్‌లోనిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మీస అర్జున్‌రావు, న్యాలకొండ నారాయణ రెడ్డి, ఆదికేశవరావు, చింతల లింగారెడ్డి, పటేల్ దేవేందర్‌రెడ్డి, పెండ్యాల సాయికృష్ణరెడ్డి, వెంకట్‌రెడ్డి, నాగరాజు, శ్రీనాథ్, రంజిత్‌రెడ్డి, నాగేశ్వర్ గాజుల స్వప్న, అయిల ప్రసన్న, గంట సుశీల పాల్గొన్నారు.