కబ్జాలు చేసేవాళ్లు ఎంతటివారైనా వదలం..
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం హైదరాబాద్లో ప్రభుత్వ భూముల కబ్జాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో నివాసం ఉన్నవారు పేదలైతే భూమి పట్టాలు ఇవ్వాలని... ఆక్రమణదారులైతే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ...అధికారులకు సూచించారు. భూకబ్జాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఆక్రమణదారులపై అసవరం అయితే పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. భూ కబ్జాలు చేసేవాళ్లు ఎంతటివారైనా..ఏ పార్టీ వారైనా వదిలిపెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఆక్రమించుకోబడ్డ భూములను కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. అలాగే ఈనెల 9న భూముల రక్షణపై కేసీఆర్ మరోసారి అధికారులతో సమావేశం కానున్నారు. కాగా హైదరాబాద్లో ప్రభుత్వ భూముల రక్షణ కోసం అధికారులతో ఓ కమిటీ వేయనున్నారు.