Government Activity
-
గోపాల.. గోవింద!
వీధినపడ్డ 66 జీవితాలు - చిరుద్యోగులపై బ్రహ్మాస్త్రం - ఏడాది కాలంగా జాలిచూపని ప్రభుత్వం - సమ్మె చేయడమే చేసిన నేరం - భారంగామారిన కుటుంబ పోషణ - వెలుగులోకి రాని త్రిసభ్య కమిటీ నివేదిక - తెరపైకి కొత్త నియామకాలు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా 386 మంది గోపాలమిత్రలు పనిచేస్తుండగా.. ఒక్కొక్కరికి 1500 పశువులకు సంబంధించిన వైద్య సేవల బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు రెండు నుంచి నాలుగు గ్రామాల్లో సేవలందిస్తున్నారు. పశువైద్యాధికారులకు తోడుగా గ్రామాల్లో తమ వంతు పశువైద్యం చేస్తున్నారు. చేసిన సేవలకు గ్రామాల్లో రైతులు ఇచ్చే రూ.100, రూ.200లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మేలుజాతి పశుసంపద అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థ ఏర్పాటయింది. స్వయం ఉపాధి కింద నిరుద్యోగ అభ్యర్థులను గోపాలమిత్రలుగా తీసుకుని శిక్షణనిచ్చారు. ఎలాంటి గౌరవ వేతనం లేకుండా సేవలు అందించాల్సి ఉండటంతో మున్ముందు భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో కాలం నెట్టుకొచ్చారు. తాజాగా అదే చంద్రబాబు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 66 మంది గోపాలమిత్రలను విధుల నుంచి తొలగించింది. ‘బాబు వస్తే జాబులు వస్తాయి’ అంటూ 2014 ఎన్నికల ముందు ఊరూరా గోడరాతలతో ఊదరగొడ్డిన చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత ఉన్న ఉద్యోగాలను తొలగించడం పట్ల గోపాలమిత్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో గౌరవ వేతనం వెట్టిచాకిరితో బతుకులు సాగిస్తున్న గోపాలమిత్రల కష్టాన్ని గుర్తించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తొలుత నెలసరి గౌరవ వేతనం రూ.1500 చేయడంతో ఉపశమనం పొందారు. కొద్ది నెలలకే రూ.2 వేలు.. ఆ తర్వాత రూ.2,500 చేశారు. ప్రస్తుతం గౌరవ వేతనం రూ.3,500 ప్రకారం చెల్లిస్తున్నారు. మళ్లీ చంద్రబాబు సర్కారు రావడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలో తమకు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాదబీమా పెంపుతో ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో 2016 జూన్ నెలలో సమ్మెకు దిగారు. అదే వారికి శాపంగా మారింది. నెలల తరబడి వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోవడంతో చేసేది లేక గోపాలమిత్రలు విధుల్లో చేరిపోయారు. అయితే వరుసగా రెండు నెలల పాటు సమ్మెలో ఉన్న 66 మందిని మాత్రం ఉద్యోగాల నుంచి తొలగించారు. ఈ విషయమై త్రిసభ్య కమిటీతో విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన నివేదిక బహిర్గతం చేయకుండానే కొందరు గోపాలమిత్రలను కొత్తగా చేర్చుకునే ప్రయత్నం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఆత్మహత్యాయత్నంతో ఆందోళన తొలగించిన తమ స్థానాల్లో కొత్త వారిని నియమించి పొట్ట కొడుతున్నారంటూ తలుపుల మండలానికి చెందిన నరసింహులు నాలుగు రోజుల క్రితం పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కదిరిలోని ప్రభుత్వాసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా ఈ నెల 10న అదే మండలానికి చెందిన 11 మంది గోపాలమిత్రలు పురుగు మందులు డబ్బాలతో డీఎల్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడం ఉద్రిక్తతకు కారణమైంది. ఇకపోతే విధి నిర్వహణలో ఆరుగురు గోపాలమిత్రలు చనిపోగా, 14 మంది వరకు ప్రమాదాల్లో క్షతగాత్రులయ్యారు. భారంగా విధి నిర్వహణ ప్రస్తుతం విధుల్లోని గోపాలమిత్రల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పశుసంపద తగ్గిపోయినా లక్ష్యం అధికంగా ఇస్తుండటంతో చేరుకునేందుకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఫర్టిలిటీ క్యాంపులు, గత మూడు సంవత్సరాలుగా ఇన్సెంటివ్‌లు చెల్లించకపోవడం, ఇతరత్రా సదుపాయాలు తగ్గించేయడంతో దినదిన గండంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పొట్ట మీద కొట్టారు అరకొర సంపాదనతో బతుకులీడుస్తున్న గోపాలమిత్రలపై డీఎల్‌డీఏ పాలక వర్గం, అధికారులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఏ తప్పు చేయకున్నా డిమాండ్ల సాధన కోసం చేసిన ఆందోళనల సాకుతో 66 మందిని తొలగించి పొట్టమీద కొట్టారు. వీరిలో చాలా మంది పేదలు కావడంతో బతుకులు దుర్భరంగా ఉన్నాయి. వీలైనంత త్వరగా వీరి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి. - వెంకటేష్, గోపాలమిత్రల అసోసియేషన్ నాయకుడు త్రిసభ్య కమిటీ నివేదికను పాటిస్తాం గతేడాది దీర్ఘకాలిక సమ్మెలోకి వెళ్లడంతో పశుసేవలకు విఘాతం ఏర్పడింది. ఆందోళన విరమించి విధుల్లో చేరాలని పదే పదే చేసిన విజ్ఞప్తి మేరకు చాలా మంది విధుల్లో చేరారు. వరుసగా రెండు నెలల పాటు పనిచేయని 66 మందిని డీఎల్‌డీఏ తీర్మానం, ఏపీఎల్డీఏ సీఈఓ ఆదేశాల మేరకు తొలగించాం. త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం నడచుకుంటాం. - డాక్టర్ ఎన్.తిరుపాలరెడ్డి, డీఎల్‌డీఏ ఈఓ ఆవులు, ఎద్దులు : 6.61 లక్షలు గేదెలు : 3.70 లక్షలు గొర్రెలు : 38.79 లక్షలు మేకలు : 7.85 లక్షలు గోపాలమిత్ర సెంటర్లు : 371 పనిచేస్తున్న గోపాలమిత్రలు : 318 మంది ఖాళీలు : 53 స్థానాలు తొలగింపులు : 66 మంది నెలసరి గౌరవ వేతనం : 3,500 విధి నిర్వహణలో మృతులు : 6గురు ప్రమాదాల్లో క్షతగాత్రులు : 14 మంది -
మిషన్ కాకతీయ రెడీ
⇒ చెరువుల పునరుద్ధరణకు కసరత్తు ⇒ నేడు జెడ్పీటీసీ, ఎంపీపీలకు అవగాహన సదస్సు ⇒ హాజరుకానున్న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు 556 మైనర్ ఇరిగేషన్ చెరువులు 4193 చిన్ననీటి చెరువులు (పంచాయతీరాజ్) 13 అటవీశాఖ పరిధిలో చెరువులు 4762 మొత్తం చెరువుల సంఖ్య మొదటిదశలో చెరువుల మరమ్మతులు ఇలా... ⇒ 952 పునరుద్ధరణ జరిగే చెరువులు ⇒ 185 ఇప్పటి వరకు సర్వే చేసిన చెరువులు ⇒ 102 ప్రభుత్వానికి అంచనావ్యయం సమర్పించిన చెరువుల సంఖ్య ⇒ రూ.83కోట్లు ఖర్చు అంచనా,మంజూరు ఈ-టెండరు ద్వారా పనుల కేటాయింపు నల్లగొండ: చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ కార్యాచరణ సిద్ధమవుతోంది. కబ్జాకోరల్లో చిక్కుకుపోయి, ఆనవాళ్లు కోల్పోయిన ఆనాటి చెరువులకు మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కార్యక్రమాల్లో ‘మిషన్ కాకతీయ’ ప్రధానమైనది. ఈ పథకం అమలు తీరుతెన్నులు సమీక్షించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు జిల్లాల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఆదివారం జిల్లాకు వస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం రెండుగంటలకు జెడ్పీ ప్రత్యేక సర్వసభ్యసమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు కాకతీయమిషన్ ముఖ్య ఉద్దేశాలను మంత్రి వివరిస్తారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. కాకతీయ మిషన్ తీరు జిల్లావ్యాప్తంగా మొత్తం 4,762 చెరువులు, నీటి కుంటలు ఉన్నాయి. దీంట్లో 556 చెరువుల పరిధిలో వంద ఎకరాలపైబడి ఆయకట్టు సాగవుతోంది. మరో 4,193 చెరువుల కింద వందఎకరాల్లోపు ఆయకట్టు ఉంది. అటవీశాఖ పరిధిలో 13 చెరువులు ఉన్నాయి. దీంట్లో చాలా చోట్ల చెరువులు ఆక్రమణకు గురిగాక, చిన్నచిన్న నీటి కుంటలను పూడ్చేసి రియల్ వ్యాపారులు వెంచర్లు చేసి అమ్మేశారు. కోదాడ, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురైనట్లు జిల్లా పంచాయతీ శాఖ గతంలో చేపట్టిన విచారణలో తేలింది. ప్రస్తుతం సాగునీటి పారుదలశాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా చెరువుల సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే పూర్తయిన తర్వాతగానీ ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయనేది తేలుతుంది. అయితే ప్రభుత్వం ముందుగా 20 శాతం చెరువులు అంటే.. 952 చెరువులను 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 185 చెరువులసర్వే పూర్తయ్యింది. దీంట్లో 102 చెరువులకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ పనుల అంచనా విలువ సుమారు రూ.83 కోట్లు. ఈ పనులను ఈ-టెండర్ ద్వారానే చేపడతారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన 15రోజుల్లోగా అగ్రిమెంట్, ఇతర వ్యవహారాలన్నీ పూర్తిచేసి పనులు ప్రారంభించాలి. ఈ నెలాఖరునాటికి సర్వే పూర్తిచేసి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తారు. మొత్తం మీద జనవరి మొదటివారంలో మిషన్ కాకతీయ ఆచరణలోకి వస్తుంది. నీటి నిల్వ ఉన్న చెరువుల పనులు ఆలస్యం... నాగార్జునసాగర్, మూసీ ఆయకట్టు ప్రాంతాలైన హుజూర్నగర్, భువనగిరి, రామన్నపేట, తదితర ప్రాంతాల్లో సుమారు 65 చెర్వుల్లో నీటినిల్వలు వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వరికోతలు పూర్తయిన తర్వాత ఆ చెరువుల పరిధిలో పనులు ప్రారంభిస్తారు. ఇవీ చేపట్టే పనులు అలుగులు రిపేరు, చిన్నచిన్న నీటి కుంటల నుంచి పంట పొలాలకు వెళ్లే కాల్వల మరమ్మతులు, స్లూయీస్ మరమ్మతులు, చెరువుల పూడికతీత, సర్కారు చెట్లు, గుర్రపు డెక్క తొ లగింపు, ఫీడర్‌ఛానల్ మరమ్మతులు, చెరువుల పూడకతీతలో భాగంగా తీసిన మట్టి తో చెరువుల కట్టలు నిర్మిస్తారు.