Government Educational
-
బోధన.. వేదన
కేజీబీవీల్లో ఇంటర్ బోధన యాజమాన్యాలకు వేదనగా మారింది. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామన్న పాలకుల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) పదో తరగతి తర్వాత బాలికలు విద్యను ఆపేస్తున్నారన్న ఉద్దేశంతో ఈఏడాది నుంచి ఇంటర్ విద్యను ప్రారంభించారు. అయితే బోధన, అధ్యాపకుల నియామకం గురించి మరచిపోయారు.కేజీబీవీల్లో పదవ తరగతికి బోధించే ఉపాధ్యాయులతో తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులను మాత్రమే బోధిస్తూ..ఇతర సబ్జెక్టులను అటకెక్కించడంతోవిద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. కడప ఎడ్యుకేషన్: బాలికా విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2004 నుంచి కేజీబీవీలను ప్రారంభించింది. జిల్లాలో 29 కేజీబీవీలు ఉన్నాయి. వీటిల్లో బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంది. కేజీబీవీల్లో పదో తరగతి వరకు విద్య అందించేవారు. అయితే విద్యార్థినులు పదో తరగతి తర్వాత విద్యకు స్వస్తి పలుకుతున్నట్లు తెలియడంతో ప్రభుత్వం బాలికల విద్యను ప్రొత్సహిస్తూ జిల్లాలోని పెద్దముడియం, వీరబల్లి కేజీబీవీల్లో ఈ ఏడాది నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించింది.మౌలిక వసతులు అరకొరే.అధ్యాపకుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను ఇప్పుడు మొదలు పెట్టింది. ఫలితంగా బోధన ఆలసమ్యమవుతోంది. కళాశాలల వివరాలు జిల్లాలోని పెద్దముడియం, వీరబల్లి కేజీబీవీలను ప్రభుత్వం ఈ ఏడాది ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చే సింది. వీరబల్లిలో బైపీసీ గ్రూపును మాత్రమే నిర్వహిస్తున్నారు, బైపీసీకి సంబంధించి 80 మందివిద్యార్థినులు ఉన్నారు. పెద్దముడియంలో బైపీసీ, ఎంపీసీ గ్రూపులు ప్రవేశపెట్టింది. ఇందులో బైపీసీకి సంబంధించి 26 మంది ఎంపీసీ విభాగంలో 35 మంది ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అధ్యాపకులు ఎప్పుడొస్తారో.. ఇంటర్ పాఠ్యాంశాలను బోధించేందుకు కావాల్సిన అధ్యాపకుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీరబల్లికి ఆరుగురు, పెద్దముడియం కేజీబీవీకి ఏడుగురు ఆధ్యాపకుల నియామకం కోసం ఈనెల 8వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభించింది. సంబంధిత ప్రక్రియను 11వ తేదీ వరకు కొనసాగించారు. జాబితాను అధికారులు పరిశీలించి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. ఆయన ఓకే చేసి (సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)కు పంపుతారు. వారు జాబితాను ప్రదర్శిస్తారు. అనంతరం ఎస్ఎస్ఏ వారు జాబితాలో అభ్యంతరాలను కోరతారు. తర్వాత తుదిజాబితాను విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ తతంగమంతా జరగాలంటే ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. దీంతో అధ్యాపకులు ఎప్పుడొస్తారో..పాఠాలు ఎప్పుడు బోధిస్తారోననే దానిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. కేజీబీవీల్లో ఇంటర్‌ను ఎలా పూర్తి చేస్తారో, ఎంతశాతం ఉత్తీర్ణత తెస్తారో వేచి చూడాల్సిందే. త్వరలో సమస్యను పరిష్కరిస్తాం కేజీబీవీల్లో ఇంటర్‌కు సంబంధించి ఆధ్యాపకుల నియామక ప్రక్రియ పూర్తయింది. త్వరలో జాబితా విడుదల కానుంది. జాబి తారాగానే ఎంపికైన వారితో బోధన ప్రారంభిస్తాం. విద్యార్థినులకు సమస్య లేకుండా చూస్తాం. సిలబస్‌ను కూడా సకాలంలో ముగించేలా చర్యలు తీసుకుంటాం. – సుజన, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి -
వీఆర్వో ‘యోగానందరెడ్డి ’
పుట్లూరు, న్యూస్‌లైన్ : ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో పుట్టి.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన యోగానందరెడ్డి (హాల్‌టికెట్ నంబర్ 112103198) గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) పరీక్ష ఫలితాల్లో 99 మార్కులతో రాష్ర్టస్థాయి మూడో ర్యాంకును సాధించాడు. పుట్లూరు మండలం మడుగుపల్లికి చెందిన యోగానందరెడ్డి ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తి చేశాడు. అనంతరం తన తల్లి స్వస్థలం పుట్లూరు మండలం కడవకల్లు జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు చదివాడు. నార్పల ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి పూర్తి చేశాడు. అక్కడే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అనంతపురం ఆర్ట్స కళాశాలలో డిగ్రీ, ఎస్కేయూనివర్సిటీలో పీజీ (ఎమ్మెస్సీ-మ్యాథ్స) చేశాడు. హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్-1కు ప్రిపేరవుతున్నాడు. ఈలోపే వీఆర్వో పరీక్షలో రాణించాడు. కుటుంబ నేపథ్యం మడుగుపల్లికి చెందిన యోగానందరెడ్డిది ఉమ్మడి కుటుంబం. అతడి తండ్రి ఓబుళరెడ్డికి ముగ్గురు సోదరులున్నారు. మొత్తం 16 మంది కుంటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. యోగానందరెడ్డి ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడే తల్లి నాగలక్ష్మమ్మ అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి యోగానందరెడ్డిని, అతడు సోదరుడు రాజేంద్రప్రసాద్‌ను కుటుంబ సభ్యులు ఎంతో అపురూపంగా చూసుకున్నారు. చిన్నతనం నుంచి చదువులో, ఆటపాటల్లో చురుగ్గా ఉండేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రూప్-1 ర్యాంక్‌పైనే దృష్టంతా... వీఆర్వో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి రోజూ 8 గంటలు చదివా. గతంలో గ్రూప్-2కు కష్టపడటం వల్ల వీఆర్వో పరీక్ష రాయడం సులభంగా మారింది. జాబ్ గ్యారెంటీ అనుకున్నాను. కానీ ర్యాంకుపై ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబ సభ్యుల ప్రోత్సహంతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం వీఆర్వో పరీక్షల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరింత కష్టపడి చదివి గ్రూప్-1లో మెరుగైన ర్యాంకు సాధించాలని నా ఆశయం. - యోగనాందరెడ్డి వీఆర్వో పరిక్షల్లో స్టేట్ మూడో ర్యాంకర్ గర్వంగా ఉంది నా కొడుకు రాష్ట్రంలో మూడో ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరు పిల్లలు. వారి చిన్నతనంలోనే నా భార్య మరణించింది. అప్పటి నుంచి చిన్నాన్నలు, చిన్నమ్మలు వారిని ఎంతో అపురూపంగా చూసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించా. యోగానందరెడ్డి ఒక వైపు చదువుతూనే ఇంటి వద్ద ఉన్న సమయంలో పొలం పనులు చేసేవాడు. కష్టపడే తత్వం అతడిలో ఉందని నాకు ముందే తెలుసు. అయితే నాకు ఇంత మంచి పేరు తెచ్చినందుకు గర్వంగా ఉంది. - ఓబుళరెడ్డి, యోగానందరెడ్డి తండ్రి మడుగుపల్లికి మంచిపేరు తెచ్చాడు యోగానందరెడ్డి వీఆర్వో పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి మా గ్రామానికి మంచిపేరు తెచ్చాడు. చిన్నతనం నుంచే అన్ని విషయాల్లో చురుగ్గా ఉండేవాడు. భవిష్యత్‌లో ఇతర పోటీ పరీక్షల్లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించి మా గ్రామానికి, అతడి కుటుంబసభ్యులకు మరింత పేరును తీసుకురావాలి. ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నా. - నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ మడుగుపల్లి