government hospital anantapur
-
సర్వజనాస్పత్రికి జీవం పోసిన వైఎస్ జగన్
ప్రభుత్వ సర్వజనాస్పత్రికి మహర్దశ చేకూరనుంది. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్... ఆస్పత్రి రూపురేఖలు మార్చేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటోంది. రూ.250 కోట్లతో అదనపు భవన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటికే బడ్జెట్లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.30 కోట్లు కేటాయించగా.. తాజాగా చిన్నపిల్లల వార్డుకు కలెక్టర్ రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఇక నుంచి ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు ఉండాల్సిన బాధలు తప్పడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. సాక్షి, అనంతపురం న్యూసిటీ : జిల్లాకే పెద్దదిక్కు అనంతపురంలోని సర్వజనాస్పత్రి. కానీ గత పాలకుల వివక్ష కారణంగా నిధులు లేక మెరుగైన సేవలందించలేకపోతోంది. బోధనాస్పత్రి ఏర్పడి 19 ఏళ్లయినా.. కనీసం పడకలు కూడా అందుబాటులో లేక జనం సతమతమయ్యారు. ఇవన్నీ గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ప్రభుత్వంలోకి వచ్చిన అనతి కాలంలోనే సర్వజనాస్పత్రి అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రిలో ఈ ఏడాది చోటు చేసుకున్న శిశు మరణాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. ఆయన ఆదేశాలతో జూన్ 15న డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని సర్వజనాస్పత్రిని పరిశీలించి, మౌలిక సదుపాయాలపై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. వాటన్నింటినీ ముఖ్యమంత్రికి అందజేయగా.. వెంటనే స్పందిస్తూ అదనపు పడకలు ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగానే రూ.250 కోట్లతో 700 పడకలు ఏర్పాటు చేసేందుకు నూతన భవనం మంజూరు చేశారు. ఈ క్రమంలోనే నూతన నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ బాబ్జి రెండు రోజుల క్రితం ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అంతేకాకుండా వివిధ వార్డులు, బ్లాక్‌లు ఎక్కడ ఏర్పాటు చేయాలో నివేదికను పంపాలని డీఎంఈ సూపరింటెండెంట్ డాక్టర్ బాబూలాల్‌కు ఆదేశించారు. ఆర్అండ్బీ కార్యాలయం అనువైంది ఉన్నతాధికారుల ఆదేశాలతో అదనపు భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించేందుకు గురువారం సూపరింటెండెంట్ బాబూలాల్ తన చాంబర్లో ఆర్ఎంఓ డాక్టర్ లలిత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, ఏఓ డాక్టర్ శ్రీనివాస్శౌరి తదితరులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి ఆవరణలో మరో 700 పడకల భవనం నిర్మించే స్థలం లేదని తేల్చేశారు. అయితే రోగులకు ఇబ్బంది కలుగకుండా స్థలాన్ని పరిశీలించాలని భావించారు. ఈ క్రమంలోనే బోధనాస్పత్రిలో స్థలంలో నిర్మించిన ఆర్అండ్బీ కార్యాలయమైతే బాగుటుందని అందరూ నిర్ణయించారు. అక్కడ 3 నుంచి 5 ఎకరాల స్థలం ఉంటుందని, భవనం ఏర్పాటుకు అనువైన ప్రాంతమని నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్దామన్నారు. ఆస్పత్రిలోని మెడిసిన్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, సర్జరీ, తదితర విభాగాలతో పాటు ఓపీ బ్లాక్, మెడికల్ రికార్డ్ సెక్షన్, ఐసీసీయూలు, డయాగ్నస్టిక్ బ్లాక్ తదితర వాటిని నూతన భవనంలో మార్చితే రోగులకు మెరుగైన సేవలందించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ఇక ‘సూపర్’ వైద్యం అనంతలో వైద్య సదుపాయాలు పెంచాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి.. ఈ మేరకు బడ్జెట్లో అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.30 కోట్లు మంజూరు చేశారు. ఈ ఆస్పత్రిలో 8 సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు ట్రామాకేర్ సెంటర్లో మౌలిక సదుపాయాల కోసం రూ.5 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో వైద్యం అందించేందుకు ట్రాక్కేర్ను మరింత బలోపేతం కానుంది. ఇక చిన్నపిల్లల వార్డుకు కలెక్టర్ రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా మల్టీచానల్ మానిటర్స్, హైఫ్లో నాసల్ క్యాన్యులా, ఫోర్టబుల్ పంప్ సెక్షన్స్, లారింజోస్పోప్స్, సీ పాప్స్, కంప్రెసర్లు తదితర పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. -
సర్వజనాస్పత్రిలో ఉద్రిక్తత
ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు సర్వజనాస్పలో మృతి చెందాడు. వైద్యసేవలు అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే అతడు మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు. డ్యూటీ డాక్టర్‌పై దాడికి యత్నించడం ఉద్రిక్తతకు తారికి తీసింది. సాక్షి, అనంతపురం న్యూసిటీ: ధర్మవరం పట్టణానికి చెందిన కె.శ్రీనివాస్ (20) ఈ నెల నాలుగో తేదీన విషపుద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కలెక్టర్ సత్యనారాయణ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసినపుడు అతడి పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి 9.54 గంటలకు సర్వజనాస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ)లో చేర్చారు. కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని కుటుంబ సభ్యులు మల్లి, నారాయణస్వామి, వెంకటేశ్‌లు డ్యూటీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్‌కు తెలియజేశారు. ఇంతకుముందే చికిత్స మొదలు పెట్టామని, ఏమీ కాదులే అని డాక్టర్ సమాధానమిచ్చారు. అర్ధరాత్రి దాటాక 12.05 గంటల సమయంలో శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్ రమేష్‌ను దుర్భాషలాడారు. శుక్రవారం తెల్లవారుజాము వరకు మృతదేహాన్ని బెడ్‌పై నుంచి తీయకుండా నిరసన తెలిపారు. చివరకు ఔట్‌పోస్టు ఏఎస్ఐలు త్రిలోక్, రాము సర్తి చెప్పడంతో మృతదేహాన్ని మార్చురికీ తరలించారు. వైద్యుడిని నిలదీసిన బంధువులు యువకుడి మృతిపై వివరణ ఇవ్వాలని ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వరరావులు డ్యూటీ డాక్టర్ రమేష్‌కు సూచించారు. డాక్టర్ రమేష్ మెడిసిన్ వార్డు నుంచి ఆర్థో వార్డు వైపుగా వస్తున్నాడు. ఆ సమయంలో మృతుని కుటుంబీకులు ఒక్కసారిగా వైద్యున్ని నిలదీశారు. మీ నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ మృతి చెందాడంటూ మండిపడ్డారు. చివరకు సెక్యూరిటీ మధ్య డాక్టర్ రమేష్‌ను సూపరింటెండెంట్ చాంబర్‌కు తీసుకొచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ రమేష్‌ను విధుల నుంచి తొలగించాలంటూ మృతుని కుటుంబీకులు సూపరింటెండెంట్ చాంబర్ ముందు బైఠాయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాత్రే మెరుగైన వైద్య సేవలందించామని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ తెలిపారు. విషపుద్రావకం చాలా ప్రమాదకరమని, తమవైపు నుంచి అందించాల్సిన వైద్య సేవలందించామని డాక్టర్ రమేష్ తెలిపారు. వీరి సమాధానంతో సంతృప్తి చెందని మృతుని కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేపట్టారు. చివరకు ఎస్ఐ లింగన్న, ఏఎస్ఐ రాము వారిని సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్ వద్దకు తీసుకెళ్లారు. విచారణకు ఆదేశం శ్రీనివాస్ మృతిపై ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామి నాయక్ విచారణకు ఆదేశించారు. చిన్నపిల్లల విభాగం, అనస్తీషియా, ఈఎన్టీ హెచ్ఓడీలు 24 గంటల్లోగా విచారణ చేయాలని సూచించారు. డాక్టర్ రమేష్‌కు మెమో జారీ చేశారు. ఉద్యోగాలు చేయలేం.. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ పట్ల మృతుని కుటుంబీకులు వ్యవహరించిన తీరును ఆస్పత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది తప్పుబడుతున్నారు. వైద్యో నారాయణో హరి అని వైద్యున్ని దేవునిగా పోల్చుతారని, అటువంటిది వైద్యునిపై దాడికి యత్నించడమే కాకుండా నోటికొచ్చినట్లు దుర్భాషలాడడమేంటని వాపోతున్నారు. ప్రాణం పోయాలని చూస్తామే కానీ.. తీయాలని ఎవరికీ ఉండదని పేర్కొన్నారు. తమ తప్పు లేకపోయినా దూషిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇది అపోలో కాదు.. ధర్మాస్పత్రి
చిత్తూరు అర్బన్:‘ఆస్పత్రిని మీకు క్లినికల్ అటాచ్‌మెంట్‌కు మాత్రమే ఇచ్చాం. అంతమాత్రన ఇది అపోలో ఆస్పత్రి అయిపోదు. ఇది ఎప్పటికీ ధర్మాస్పత్రే. డాక్టర్ల కొరత ఉంది. రావట్లేదు అంటే ఎలా..? అది మీ సమస్య. రూ.లక్ష కాకుంటే మరింత ఇవ్వండి. ఇక్కడ సామాన్యుడికి వైద్యం అందాల్సిందే. ఏదైనా జరిగినప్పుడు జ నం ప్రభుత్వం, ధర్మాస్పత్రి, కలెక్టర్‌ను అంటున్నారే తప్ప మిమ్మల్ని కాదు. మీ రు తీరు మార్చుకోవాల్సింది ఉంది..’ అని రాష్ట్ర వైద్యవిధాన్ పరిషత్ జాయిం ట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి అపోలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో డీసీహెచ్ఎస్ డాక్టర్ సరళమ్మతో కలిసి అపోలో వైద్యులు, అధికారులతో పాటు ప్రభుత్వ డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందక పలువురు చనిపోయారంటూ ఆందోళనలు, ధర్నాలు చేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు. మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎం ఓయూ)లో కుదుర్చున్న ఒప్పందం ప్ర కారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అపోలో యాజమాన్యం ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల్సిం దేదన్నారు. ద్విపరిపాలన కుదరదని, ప్రభుత్వ వైద్యులతో కలిసి సమన్వయం చేసుకుని వెళ్లాలన్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టులున్నా ఎందుకు 24 గంటలు ఇక్కడ ఉండటంలేదని అపోలో సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. తాము నెలకు రూ.1.20 లక్షలిస్తామన్నా ఈ పోస్టుకు వచ్చేవాళ్లు రాత్రి విధులు చేయడానికి ఒప్పుకోవడంలేదన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ ఇది తమ సమస్య కాదని, మీ తిప్పలు మీరు పడి గైనకాలజిస్టులకు 24 గంటల పాటు ఉంచాల్సిందేనన్నారు. జి ల్లాలో మదనపల్లె ఆస్పత్రిలో కంటే చి త్తూరులో కాన్పుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అపోలో రావడం వల్ల ప్రజ ల్లో మరింత నమ్మకం పెరగాలే తప్ప.. ఎందుకు వీళ్లకిచ్చారనే నిందలు వేయకూడదన్నారు. జేసీ విచారణ కాగా ఇటీవల ఆస్పత్రిలో ఎస్ఆర్ పురానికి చెందిన గర్భిణి మృతి చెం దడం, యాదమరికి చెందిన అంగన్వాడీ టీచర్ చనిపోవడంపై వైద్యులను జేసీ విచారించారు. టీచర్ పరిస్థితి విషమించడంతో ఇతర ఆస్పత్రికి రెఫర్ చేస్తే వేలూ రుకు వెళుతూ మధ్యలో డబ్బుల్లేవని వ చ్చేశారని అపోలో వైద్యులు పేర్కొన్నా రు. టీచర్‌కు ఎందుకు సీటీ స్కాన్ తీయలేదని జేసీ ప్రశ్నిస్తే.. కేసు తామే చూశామని, సీటీ నిపుణుడు అందుబాటులో ఉండటంలేదని అపోలో వైద్యులు చెప్పా రు. దీనిపై ప్రభుత్వ వైద్యులు స్పందిస్తూ రాత్రి విధులకు అపోలో డాక్టర్లు ఉండకపోవడంతో గర్భిణి మృతి చెందిందన్నా రు. సమావేశంలో ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ పాండురంగయ్య, ఆర్ఎంఓ డాక్టర్ రాజేంద్రబాబు, సీనియర్ వైద్యులు అరుణ్‌కుమార్, హరిప్రసాద్, శిరీష, లత తదితరులు పాల్గొన్నారు. -
ప్రయివేటు తోవ!
ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగంలో పని చేసే ఫిజీషియన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలైతే చాలు అక్కడ ప్రత్యక్షమవుతారు. ప్రైవేట్ ల్యాబ్‌లతో సత్సంబంధాలున్న ఈ డాక్టర్ కొన్ని రకాల పరీక్షలను సైతం అక్కడకు పంపుతుంటారు. ఆరోగ్యం సరిగా లేని కేసులను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోనే ఉన్న రెండు ఆస్పత్రులకు రెఫర్ చేస్తుంటారు. ఆస్పత్రిలో పని చేసే ఓ గైనకాలజిస్ట్ తీరు మరీ ఘోరం. ఈమె భర్త ఆస్పత్రిలోనే ఓ విభాగంలో పని చేస్తుంటారు. నగరంలో ఓ క్లినిక్ ఉంది. సుమారు ఆరేడు ఆస్పత్రులకు కన్సల్టెంట్‌గా వెళ్తుంటారు. ఆస్పత్రి వేళల్లో కూడా ప్రైవేట్ సేవలో తరిస్తుంటారు. ఆర్థో విభాగంలో పని చేస్తున్న చాలా మంది డాక్టర్లకు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ వర్తిస్తుండడంతో వీరికి కాసుల పండగే. ఓపీలో కేసులను చూడడం, అవసరమైతే అడ్మిట్ చేసుకుని ఆ తర్వాత బయటి ఆస్పత్రులకు రెఫర్ చేయడం పరిపాటి. ప్రాణ భయంతో చాలా మంది డాక్టర్లు చెప్పినట్లు వెళ్లిపోతుంటారు. మృత్యువు ముఖంలోకి వెళ్లిన వారికి ప్రాణం పోసే శక్తి ఒక్క వైద్యునికే ఉంది. అందుకే వైద్యులను ప్రత్యక్ష దైవం అంటారు. రోగుల ప్రాణాలు కాపాడే విషయంలో అహర్నిశలు శ్రమించే వైద్య వృత్తిలో కొందరి తీరు వివాదాస్పదమవుతోంది. మానవత్వం స్థానంలో వ్యాపారం అధికమైంది. కార్పొరేట్ వైద్యం రాకతో ప్రాణం విలువ తరిగిపోతోంది. ఇక పేదలకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలోనూ కొందరు వైద్యులు సొంత లాభం చూసుకుంటున్నారు. ప్రయివేట్ సేవలో తరిస్తూ వైద్య వృత్తికే మాయని మచ్చగా నిలుస్తున్నారు. అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిత్యం 2వేల మందికి పైగా ఓపీ ఉంటుంది. 1000 వరకు ఇన్‌పేషెంట్స్ ఉంటారు. మొత్తం 241 మంది వైద్యులు అవసరం కాగా.. 70 వరకు ఖాళీలు ఉన్నాయి. ఉన్న వారిలో 90 శాతం మంది ప్రయివేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. కొందరు సొంతంగా ఆసుపత్రులు.. మరికొందరు.. క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని వివిధ ప్రైవేట్ ఆస్పత్రులకు కన్సల్టెంట్స్గా వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం సొంత ప్రాంతాల్లోనే నివాసం ఉండాల్సి ఉన్నా.. కొందరు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు వైద్యులు ఏకంగా కర్నూలు నుంచి రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం. నిబంధనల ప్రకారం ఉదయం 9 గంటల సాయంత్రం 4 గంటల వరకు సర్వజనాస్పత్రిలో వైద్యులు విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఈ రెండు సమయాల్లోనూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి. తెలివి మీరిన చాలా మంది డాక్టర్లు బయోమె‘ట్రిక్’ ప్రదర్శిస్తున్నారు. సమయానికి రావడం.. హాజరు వేసి రెండు గంటలు ఉండటం.. ఆ తర్వాత ‘సొంత’ పనికి వెళ్లడం.. సాయంత్రం వచ్చి మళ్లీ హాజరు వేసి వెళ్లిపోవడం.. ప్రతి రోజూ ఇదే తంతు. థియేటర్ చార్జీలు చెల్లిస్తూ.. సర్వజనాస్పత్రిలో పని చేస్తున్న కొందరు వైద్యులు శస్త్ర చికిత్సలను సైతం తాము ఒప్పందం చేసుకున్న ఆస్పత్రుల్లో చేస్తున్నారు. థియేటర్ చార్జీలు ఆస్పత్రులకు చెల్లించి వైద్యుల చార్జీలను జేబులో వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సమయానికి నాడి పట్టే వారు కరువవుతున్నారు. నిరుపేదలు వైద్యం కోసం వస్తే 24 గంటలు గడవక ముందే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న దారుణ పరిస్థితి ఉంది. అయినా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్ వస్తున్నారంటే రావడం.. మళ్లీ కనిపించకుండాపోవడం కొందరికి పరిపాటిగా మారింది. షరతులకు లోబడే ‘ప్రాక్టీస్’ ప్రభుత్వ వైద్యులు సొంతంగా ప్రాక్టీస్ చేసుకునేందుకు 2006లో జీఓ 119 జారీ అయింది. ఇది కూడా షరతులకు లోబడి మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉంది. ఆయా వైద్యులు ‘కన్సల్టేషన్’ కోసం క్లినిక్ మాత్రమే నిర్వహించుకోవచ్చు. తాను పని చేస్తున్న ప్రభుత్వ ఆస్పత్రిలో మినహా, మరెక్కడైనా సొంతంగా ‘ప్రైవేట్ కన్సల్టింగ్ గది’ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రిలో తన అధికారిక పని వేళలు ముగిసిన తర్వాత సొంత కన్సల్టేషన్‌కు వెళ్లాలి. నర్సింగ్ హోంలు, ఆస్పత్రులు ఏర్పాటు చేయకూడదు. కానీ కొందరు వైద్యులు చెలరేగిపోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేయడం పక్కన పెడితే.. ఏకంగా సొంత ఆస్పత్రులే ఏర్పాటు చేసుకుంటున్నారు. తీరిక ఉంటేనే తరగతులు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజనాస్పత్రిలో వైద్య సేవల మాట దేవుడెరుగు.. విద్యార్థులకు తరగతులు కూడా తీరిక ఉంటేనే నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఉంటున్న వారిలో కొందరి సేవలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. తీరిక ఉంటే తరగతులకు వస్తున్నారు.. లేదంటే అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. సర్వజనాస్పత్రిలో ఆగని మరణాలు అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మృత్యు గంటలు మోగుతూనే ఉన్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు 12 గంటల వ్యవధిలో తొమ్మిది మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని ఏఎంసీ(ఆక్యూట్ మెడికల్ కేర్) వార్డులోనే ఈ మరణాలన్నీ జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైం ది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తాడిపత్రికి చెందిన అశ్వర్థమ్మ(40) గుండె జబ్బుతో ఈనెల 27న సాయంత్రం 4.15 గంటలకు ఆస్పత్రిలో అడ్మిషన్ కాగా 5.30 గంటలకు మృతి చెందారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన కుళ్లాయప్ప(40) పురుగుల మందు తాగి బుధవారం రాత్రి 7.50 గంటలకు ఏఎంసీలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో గురువారం ఉదయం 4.30 గంటలకు మృతి చెందారు. కదిరి మండలం వీరాపల్లిపేటకు చెందిన ఉమాదేవి(35) సైతం పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చేరగా తెల్లవారుజామున 2 గంటలకు మరణించింది. ప్రస్తుతం ఏఎంసీలో మరో పది మంది వరకు అడ్మిషన్లో ఉన్నారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. -
అమ్మ కావాలి..
అనంతపురం సిటీ : ‘‘ నాకు అమ్మ కావాలి. నేను నాన్న చెంతకు చేరాలి. నన్ను ఎవరో ఇసుక దిబ్బలపై వదిలి వెళ్లారు. దిక్కూమొక్కూలేని దానిలా గుక్క పట్టి ఏడుస్తుంటే ఓ అమ్మ నన్ను గుండెలకు హత్తుకుంది. అక్కున చేర్చుకున్న వారు అమ్మ పొత్తిళ్లలోకి చేరుస్తారని చూస్తే.. వారేమో ఆస్పత్రిలోని గాజు అద్దాల మధ్య ఉంచారు. పక్షం రోజులు దాటాయి. నా అన్న వారెవరూ రాలేదు. ఇక్కడున్న నరుస(అ)మ్మలే నాకు దిక్కయ్యారు. వారు విడతల వారీగా వచ్చి నా ఆలన చూస్తున్నారు. అయితే అమ్మపై దిగులుతో నేను గట్టిగా ఏడ్చినప్పుడు అటుగా వచ్చే పెద్ద డాక్టర్ పాప ఏడవకుండా చూడంటి అంటున్నాడు. ఆ పోలీసులు చూస్తే ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. వారొస్తే మా అమ్మానాన్నల్ని వెతికిపెడతారన్న ఆశ. ఇంకెన్ని రోజులు నన్ను ఇక్కడ ఉంచుతారో తెలియదు. ఇంకోరెండు రోజులుంటే నన్ను అనాథగా ముద్ర వేసి అమ్మకు దూరం చేస్తారేమో. మీరైనా పోలీసులకు చెప్పండి. నాకు అమ్మ కావాలి.’’ ఇట్లు ఓ పాప (పేరు పెట్టలేదు కాబట్టి).. కేరాఫ్.. ఇసుక దిబ్బలు.. పక్షం రోజుల క్రితం ఆస్పత్రిలోని ఇసుక దిబ్బల్లో లభ్యమైన పసికందు ఆవేదన ఇది. గత శనివారమే ఆస్పత్రి వైద్యాధికారులు పోలీసులకు సీసీ పుటేజీల్లో దృశ్యాలు చూసుకునేందుకు అనుమతిచ్చారు. ఇప్పటి దాకా పోలీసులు మాత్రం పాప ఎవరి తాలూకు అన్న విషయాన్ని నిర్థారించేందుకు కనీస చర్యలు కూడా తీసుకోలేదు.