వైద్యులతో మాట్లాడుతున్న జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి
చిత్తూరు అర్బన్:‘ఆస్పత్రిని మీకు క్లినికల్ అటాచ్‌మెంట్‌కు మాత్రమే ఇచ్చాం. అంతమాత్రన ఇది అపోలో ఆస్పత్రి అయిపోదు. ఇది ఎప్పటికీ ధర్మాస్పత్రే. డాక్టర్ల కొరత ఉంది. రావట్లేదు అంటే ఎలా..? అది మీ సమస్య. రూ.లక్ష కాకుంటే మరింత ఇవ్వండి. ఇక్కడ సామాన్యుడికి వైద్యం అందాల్సిందే. ఏదైనా జరిగినప్పుడు జ నం ప్రభుత్వం, ధర్మాస్పత్రి, కలెక్టర్‌ను అంటున్నారే తప్ప మిమ్మల్ని కాదు. మీ రు తీరు మార్చుకోవాల్సింది ఉంది..’ అని రాష్ట్ర వైద్యవిధాన్ పరిషత్ జాయిం ట్ కమిషనర్ డాక్టర్ జయచంద్రారెడ్డి అపోలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సరళమ్మతో కలిసి అపోలో వైద్యులు, అధికారులతో పాటు ప్రభుత్వ డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆస్పత్రిలో సరైన వైద్య సేవలు అందక పలువురు చనిపోయారంటూ ఆందోళనలు, ధర్నాలు చేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు.
మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎం ఓయూ)లో కుదుర్చున్న ఒప్పందం ప్ర కారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో అపోలో యాజమాన్యం ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల్సిం దేదన్నారు. ద్విపరిపాలన కుదరదని, ప్రభుత్వ వైద్యులతో కలిసి సమన్వయం చేసుకుని వెళ్లాలన్నారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టులున్నా ఎందుకు 24 గంటలు ఇక్కడ ఉండటంలేదని అపోలో సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. తాము నెలకు రూ.1.20 లక్షలిస్తామన్నా ఈ పోస్టుకు వచ్చేవాళ్లు రాత్రి విధులు చేయడానికి ఒప్పుకోవడంలేదన్నారు. దీనిపై జేసీ స్పందిస్తూ ఇది తమ సమస్య కాదని, మీ తిప్పలు మీరు పడి గైనకాలజిస్టులకు 24 గంటల పాటు ఉంచాల్సిందేనన్నారు. జి ల్లాలో మదనపల్లె ఆస్పత్రిలో కంటే చి త్తూరులో కాన్పుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అపోలో రావడం వల్ల ప్రజ ల్లో మరింత నమ్మకం పెరగాలే తప్ప.. ఎందుకు వీళ్లకిచ్చారనే నిందలు వేయకూడదన్నారు.
జేసీ విచారణ
కాగా ఇటీవల ఆస్పత్రిలో ఎస్‌ఆర్ పురానికి చెందిన గర్భిణి మృతి చెం దడం, యాదమరికి చెందిన అంగన్‌వాడీ టీచర్ చనిపోవడంపై వైద్యులను జేసీ విచారించారు. టీచర్ పరిస్థితి విషమించడంతో ఇతర ఆస్పత్రికి రెఫర్ చేస్తే వేలూ రుకు వెళుతూ మధ్యలో డబ్బుల్లేవని వ చ్చేశారని అపోలో వైద్యులు పేర్కొన్నా రు. టీచర్‌కు ఎందుకు సీటీ స్కాన్ తీయలేదని జేసీ ప్రశ్నిస్తే.. కేసు తామే చూశామని, సీటీ నిపుణుడు అందుబాటులో ఉండటంలేదని అపోలో వైద్యులు చెప్పా రు. దీనిపై ప్రభుత్వ వైద్యులు స్పందిస్తూ రాత్రి విధులకు అపోలో డాక్టర్లు ఉండకపోవడంతో గర్భిణి మృతి చెందిందన్నా రు. సమావేశంలో ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ పాండురంగయ్య, ఆర్‌ఎంఓ డాక్టర్ రాజేంద్రబాబు, సీనియర్ వైద్యులు అరుణ్‌కుమార్, హరిప్రసాద్, శిరీష, లత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment