government security
-
రుణ సమీకరణ రూ. 20వేల కోట్లే
న్యూఢిల్లీ: మార్కెట్ నుంచి అదనంగా రూ.50వేల కోట్ల మేర రుణ సమీకరణ చేయాలని ముందుగా భావించినప్పటికీ.. ప్రస్తుతం దాన్ని రూ. 20,000 కోట్లకు పరిమితం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటిదాకా వచ్చిన ఆదాయాలు, వ్యయాలను సమీక్షించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో పేర్కొన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల జారీ ద్వారా ప్రస్తుత అవసరాల కోసం రూ.20,000 కోట్లు సమీకరిస్తే సరిపోతుందని సమీక్షలో తేలినట్లు కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఒక ప్రకటన చేసింది. మూడు సార్లు నిర్వహించిన సెక్యూరిటీస్ వేలంలో... రూ.15,000 కోట్ల మేర రుణాలను స్వీకరించలేదని పేర్కొంది. రాబోయే వారాల్లో మరో రూ.15,000 కోట్ల మొత్తాన్ని కూడా రుణ సమీకరణ నోటిఫికేషన్ నుంచి తగ్గించనున్నట్లు వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటును జీడీపీలో 3.2%కి పరిమితం చేయాలనేది కేంద్రం లక్ష్యం. అయితే, గతేడాది నవంబర్ నాటికే బడ్జెట్లో నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్యం 112% మేర దాటిపోయింది. -
వ్యయం చేసిన ప్రాంతమే చేల్లించాలి
రుణాలు, చెల్లింపులపై ఆర్థికశాఖ యోచన సాగునీటి ప్రాజెక్టుల వారీగా చేసిన వ్యయం ఆధారంగా ఆ ప్రాంతం ఖాతాలో అప్పు {పాంతాల వారీగా వేరు చేయలేని అప్పులనే జనాభా ప్రాతిపదికన నిర్ధారణ సీపీడీసీఎల్ కోసం ఈపీడీసీఎల్ ఆస్తులు తాకట్టుతో రూ. 4 వేల కోట్లు అప్పు.. ఇప్పుడు ఈ అప్పు సీపీడీసీఎల్ చెల్లించాలా? ఈపీడీసీఎల్ చెల్లించాలా అనేది ప్రశ్నార్థకం హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పును విడిపోయాక ఏ రాష్ట్రం ఎంత చెల్లించాలనే విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే ప్రత్యేకంగా బడ్జెట్ అమలు కోసం చేసిన రుణాన్ని వ్యయం ఆధారంగా పంపిణీ చేయాలని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన రుణ మొత్తాలను ఏ ప్రాంతంలో వ్యయం చేస్తే ఆ ప్రాంతానికే చెల్లింపు భారాన్ని వర్తించాలనే అభిప్రాయం ఆర్థిక శాఖ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రాంతాల వారీగా విడతీయలేని అప్పులను మాత్రమే జనాభా ప్రాతిపదికన ఇ టు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తింపచేయాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అలా కాకుండా బడ్జెట్ కోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల చొప్పున చేసిన అప్పులను జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 52 శాతం చొప్పున పంపిణీ చేయడం అశాస్త్రీయం అవుతుందని ఆర్థిక శాఖ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఏదైనా ప్రాజెక్టు కోసం ప్రత్యేకించి విదేశీ సంస్థల నుంచి అప్పు చేస్తే ఆ ప్రాజెక్టు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి ఆ అప్పును వర్తింప చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో కూడా చట్టంలో స్పష్టత లేకపోయినప్పటికీ గతంలో రాష్ట్రాల విభజన సమయంలో అనుసరించిన విధానాన్ని విదేశీ సంస్థల అప్పుల విషయంలో ఇక్కడ కూడా అనుసరించాలని నిర్ణయించారు. బడ్జెట్ అమలు కోసం సర్కారు ప్రతి ఏడాది 20 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించి అప్పు చేస్తోంది. వీటిని మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు వ్యయం చేస్తున్నారు. సాగునీటి రంగంలో ప్రాజెక్టుల వారీగాను, అలాగే రహదారుల వారీగాను బడ్జెట్ కేటాయింపులున్నాయి. ఆ కేటాయింపుల్లో ఆయా ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎంత మేర వ్యయం చేశారో లెక్కించి ఏ ప్రాంతంలోని ప్రాజెక్టు వ్యయాన్ని ఆ ప్రాంతానికి అప్పులో చూపెట్టాలని భావిస్తున్నారు. 1. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ స్వగృహకు రూ. 427 కోట్లు రుణంగా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు నుంచి ఈ మొత్తాన్ని కేటాయించింది. ఆ మొత్తాన్ని జంటనగరాల్లో గృహ నిర్మాణాల కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం ఇచ్చారు. దీంతో ఆ అప్పును తెలంగాణ రాష్ట్రానికి వర్తింప చేయాలి. కానీ బడ్జెట్ కోసం తెచ్చిన అప్పుల్లో రాజీవ్ స్వగృహ కోసం అని లేదు కదా? వాటిని మాకెలా వర్తింపచేస్తారంటే సమాధానం ఏమిటనేది ప్రశ్నార్థకం. 2.ఇటీవల సీపీడీసీఎల్ కోసం నాలుగు వేల కోట్ల రూపాయల రుణానికి ఈపీడీసీఎల్ ఆస్తులను తనఖా పెట్టారు. ఆ తనఖాల్లో సీపీడీసీఎల్ కోసం అప్పు కోసం అని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనలేదు. ఇప్పుడు ఆ ఆప్పును సీపీడీసీఎల్ చెల్లించాలా లేదా ఈపీడీసీఎల్ చెల్లించాలా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. 3.గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేయడం కోసం యూనిట్‌కు 9 రూపాయల వరకు చెల్లించి కరెంటు కొనుగోలు చేశారు. ఇందుకు ఏకంగా రూ.23 వేల కోట్లు అప్పు చేశారు. అలా కొన్న విద్యుత్తులో అధికభాగం జంటనగరాలతోపాటు ఇతర నగరాలకు సరఫరా చేశారు. అలాంటి రుణాన్ని ఇరు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ఉన్నతాధికారులే సందేహం వ్యక్తం చేస్తున్నారు. 4. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా రుణ మొత్తాన్ని వ్యయం చేశారో అదే ప్రాంతానికి వర్తింపచేయాలని, ప్రాంతాల వారీగా విడతీయలేని అప్పును మాత్రమే జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రూపాయి రికవరీ 42 పైసలు అప్, 60.88 వద్ద క్లోజ్
ముంబై: రూపాయికి మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం తాజాగా మరిన్ని చర్యలు తీసుకోవచ్చన్న అంచనాలతో దేశీ కరెన్సీ మారకం విలువ గురువారం గణనీయంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే.. ఆల్‌టైం కనిష్ట ముగింపు స్థాయిల నుంచి కోలుకుని 42 పైసలు పెరుగుదలతో 60.88 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు మెరుగ్గా ఉండటం, అటు విదేశాల్లో డాలరు బలహీనపడటం, దీంతో పాటు ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం సైతం రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. ఈ వారాంతంలోగా రూపాయికి మద్దతుగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందంటూ కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మయారాం సూచనప్రాయంగా తెలపడం రూపాయికి కాస్త ఊతమిచ్చింది. దేశీ కరెన్సీ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టమైన 61.80 స్థాయికి పతనమైన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం రూ.22 వేల కోట్ల బాండ్ల అమ్మకం ఇదిలా ఉండగా, రూపాయి క్షీణతకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను కట్టడి చేసే దిశగా ప్రతి సోమవారం రూ. 22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్లను విక్రయించాలని నిర్ణయించింది. వేలం వ్యవధి ఎంత ఉంటుందన్నది.. వేలం తేదికి ఒక రోజు ముందుగా ప్రకటించడం జరుగుతుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ద్రవ్య లభ్యతను సమర్ధంగా నిర్వహించేందుకు ఈ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ దోహదపడగలవని పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే అంతకంతకూ క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ మంగళవారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టమైన 61.80ని తాకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రూపాయి పతనాన్ని నిలువరించే దిశగా.. ద్రవ్య సరఫరాను క ఠినతరం చేయడానికి, స్పెక్యులేషన్ కి అడ్డుకట్ట వేయడానికి ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంది.