ఇకపై పోస్టాఫీసుల్లో పప్పు దినుసుల విక్రయం
న్యూఢిల్లీ: పోస్టాఫీసుల్లో రాయితీలో పప్పు దినుసులను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవ హారాల శాఖ కార్యదర్శి హేమ్ పాండే నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు, రాష్ట్రాల్లో ప్రభుత్వ దుకాణాలు అందుబాటులో లేకపోవడం, రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పప్పులను అమ్మనున్నారు.
ముఖ్యంగా కంది, మినప, శనగపప్పులను విక్రయించనున్నారు. వీటిని అత్యవసర నిల్వల నుంచి వినియోగదారులకు రాయితీతో అమ్ముతామని, ఇందుకోసం 20 లక్షల టన్నుల పప్పు దినుసులను సేకరిస్తామని ఓ అధికారి చెప్పారు.