తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
వలిగొండ, న్యూస్‌లైన్: తెలంగాణ సాధనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. మండలకేంద్రంలోని శివసాయి ఫంక్షన్హాల్లో పీఆర్టీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు చేసిన సకల జనుల సమ్మె, పాఠశాలల మూసివేతతో వాడవాడలా తెలంగాణ వాదం బలంగా వెళ్లిందన్నారు. 1100 మంది బలిదానాలు చేసుకున్న చరిత్ర తెలంగాణ ఉద్యమానిదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, ప్రతి వ్యక్తికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా వచ్చేలా కృషి చేస్తామన్నారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం నూతనంగా జోన్లు ఏర్పడుతాయని ఉపాధ్యాయుల సమస్యలు తీరుతాయన్నారు. పీఆర్టీయూ తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. అనంతరం ఆయనను డిప్యూటీ డీఈఓ మదన్మోహన్ చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఈ మాసంలో పదవి విరమణ చేయనున్న అరూరు పీఎస్ ప్రధానోపాధ్యాయులు రేపాల వెంకటేశాన్ని కూడా సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ పబ్బు ఉపేందర్, జేఏసీ చైర్మన్ రేకల రామదాసు, ఎంఈఓ రాజేందర్‌రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, సుంకరి భిక్షంగౌడ్, మండలశాఖ అధ్యక్ష, కార్యదర్శులు బిక్కి సత్యనారాయణ, సయ్యద్‌ఖాన్, వెంకటయ్య, ప్రభాకర్‌రెడ్డి, సత్తయ్య, రాజేశ్వర్, రవీందర్ పాల్గొన్నారు.