హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలం
చేవెళ్ల రూరల్: హామీలు నెరవేర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలమాకుల జంగయ్య, ఎం. ప్రభులింగం, చేవెళ్ల నియోజకవర్గం కార్యదర్శి కె. రామస్వామి అన్నారు. మండలంలోని ధర్మసాగర్లో ఆదివారం పార్టీ గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో పార్టీ జెండా ఎగురవేసి అనంతరం వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా నల్లధనం వెలికి తీయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్, పప్పు ధాన్యాల ధరలు పెంచి సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది త్యాగాలు, బలిదానాలు చేస్తే సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. అనంతరం గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ కార్యదర్శిగా ఎరుకల కృష్ణ, సహాయ కార్యదర్శులుగా తూర్పాటి చంద్రయ్య, ఈ. రాములు, మరో ఆరుగురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈకార్యక్రమంలో సీసీఐ మండల కార్యదర్శి సుధాకర్, నాయకులు మంజుల, బ్రహ్మచారి, శంకర్గైడ్, చంద్రకళ, సావిత్రి పాల్గొన్నారు.
17సిహెచ్వి 12: చేవెళ్ల మండలంలోని ధర్మసాగర్ గ్రామంలో సీపీఐ పార్టీ జెండాను అవిష్కరించి మాట్లాడుతున్న నాయకులు.