Govindaraopet
-
పిక్నిక్ ప్లాన్ చేస్తున్నారా.. సరికొత్త హంగులతో లక్నవరం తప్పక చూడాల్సిందే (ఫొటోలు)
-
పెరుగుతున్న లక్నవరం
గోవిందరావుపేట : గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు మత్తడి పోస్తూ పరవళ్లు తొక్కుతోంది. మంగళవారం సుమారు అడుగున్నరకు పైగా ఎత్తుతో మత్తడి పోస్తుండడంతో సరస్సు తూముల వద్దకు వెళ్లే అవకాశం లేకుండా లోలెవల్ కాజ్వే పైనుండి నీరు వెళుతోంది. ఉయ్యాలవంతెన సరస్సుపై తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మత్తడి పరవళ్లు తొక్కుతుండడంతో దయ్యాలవాగు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగుకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు నీటిలో మునుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
డెంగ్యూతో రైతు మృతి
గోవిందరావుపేట (వరంగల్ జిల్లా) : గోవిందరావుపేట మండలంలోని పస్రాకు చెందిన గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(42) డెంగ్యూతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఆయన భార్య పద్మ కథనం ప్రకారం.. శ్రీనివాసరెడ్డి ఐదురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. కాగా బుధవారం జ్వరం తీవ్రత పెరగడంతోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డెంగ్యూగా నిర్ధారించారు. దాంతో అక్కడి నుంచి ఎంజీఎంకు తీసుకెళ్తుండగా శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు కుమారులు రిషిందర్, శశిధర్ ఉన్నారు.