గోవిందరావుపేట (వరంగల్ జిల్లా) : గోవిందరావుపేట మండలంలోని పస్రాకు చెందిన గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి(42) డెంగ్యూతో బాధపడుతూ బుధవారం రాత్రి మరణించాడు. ఆయన భార్య పద్మ కథనం ప్రకారం.. శ్రీనివాసరెడ్డి ఐదురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఓ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు.
కాగా బుధవారం జ్వరం తీవ్రత పెరగడంతోపాటు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా డెంగ్యూగా నిర్ధారించారు. దాంతో అక్కడి నుంచి ఎంజీఎంకు తీసుకెళ్తుండగా శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు కుమారులు రిషిందర్, శశిధర్ ఉన్నారు.
డెంగ్యూతో రైతు మృతి
Published Thu, Sep 24 2015 7:14 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement